సబ్ ఫీచర్

వైవిధ్యానే్న కోరుకుంటున్నా....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పక్కింటి అమ్మాయిగా కనిపించి ఆకట్టుకుంది మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్. ప్రేమమ్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అనుపమ తక్కువ సమయంలో క్రేజీ హీరోయిన్‌గా ఇమేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంటున్న ఈమె తాజాగా రామ్‌తో కలిసి ‘హలో గురు ప్రేమకోసమే’ సినిమాలో నటించింది. త్రినాథ్‌రావు నక్కిన దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన ఈ సినిమా దసరా సందర్భంగా విడుదలై మంచి హిట్ టాక్‌ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చెప్పిన విశేషాలు ఆమె మాటల్లో...
==========================

సినిమా చూసిన వారంతా నా పాత్ర బాగుందని అంటుంటే హ్యాపీగావుంది. మంచి కథతో వచ్చిన సినిమా. అన్నిచోట్లనుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.
ప్లాపుల విషయంలో..
నేను ఏ సినిమా చేసిన అందులో కథ గురించి.. తరువాత నా పాత్ర గురించే ఆలోచిస్తా. నా పాత్రను ఎంతవరకు బెటర్‌గా చేశానన్నదే ముఖ్యం. ఉన్నది ఒకటే జిందగీలో నా పాత్రకు మంచి స్పందన వచ్చింది. కానీ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ అందుకోలేదు. ఇక తేజ్ ఐ లవ్‌యులోనూ కరుణాకరన్‌తో సినిమా ఛాన్స్‌కోసం వెయిట్ చేశా. అలాంటిది ఆ అవకాశం రావడంతో ఒప్పుకున్నా. ఇక నానితో నటించిన కృష్ణార్జున యుద్ధం కూడా మంచి పాత్రనే చేసాను. కానీ దాని రిజల్ట్ మరోలా మారింది. ఏదైనా సక్సెస్ అవ్వాలని చేసే ప్రయత్నాలే.
ఎక్కువగా పక్కింటి అమ్మాయిగానే కనిపిస్తున్నారు.. ఎందుకు భిన్నమైన పాత్రలు చేయడంలేదని అంటున్నారు. ఈ విషయంలో నేనూ ఆలోచిస్తున్నా. అయితే నా దగ్గరికి వచ్చే కథల్లో ఎక్కువగా నన్ను పక్కింటి అమ్మాయి తరహా సాఫ్ట్ పాత్రలే చేయమని అంటున్నారు. భిన్నమైన పాత్రలు రావడం లేదు. కాబట్టి ఒప్పుకోక తప్పడం లేదు. నాకూ భిన్నంగా చేయాలని ఉంది. ఎదురు చూస్తున్నా..
సక్సెస్ ఫెయిల్యూర్ గురించి..
ఎవరికైనా సక్సెస్ వచ్చిందంటే ఆనందమే. ఏ పని అయినా ఫెయిలవ్వాలని ఎవరు పని చేయరు. ఒక్కోసారి మనం చేసే పని ఫెయిల్ అవుతుంది. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు నన్ను నేను మోటివేట్ చేసుకుంటా. ఎందుకు ఇలా జరిగింది. ఎక్కడ తప్పు జరిగిందని ఆలోచిస్తా.
నా బెస్ట్ విమర్శకులు..
నా స్నేహితులతోపాటు పేరెంట్స్‌కూడా నువ్వు ఇలా చెయ్యి... అలా చేసి ఉండకూడదు అని చెబుతారు. ఇక మా తమ్ముడైతే బాగాచేయలేదని తెలిస్తే.. అస్సలు బాగలేదని చెబుతాడు. వాడే నా బెస్ట్ క్రిటిక్.
రామ్ నాకిష్టం..
హీరో రామ్‌తో ఇది నా రెండో సినిమా. తాను చాలా హార్డ్‌వర్కర్. ఒక పాత్ర గురించి ఎలా బెటర్‌గా చేయాలని తపన పడుతుంటాడు.. అందుకే అతనంటే నాకు ఇష్టం. ఉన్నది ఒకటే జిందగీకి ఈ సినిమాకి రామ్‌లో చాలా తేడాలు గమనించాను. తాను చాలా మంచి వ్యక్తి. ఎంతో సపోర్ట్ ఇస్తుంటాడు. అలాగే ప్రకాష్‌రాజ్‌తో కూడా. ఆయనతో ఇంతకుముందు తాతగా నటిస్తే ఇప్పుడేమో తండ్రిగా కనిపించాడు. గొప్ప నటుడు. ఆయనతో పనిచేయడం గర్వంగా అనిపిస్తుంది.
తదుపరి చిత్రాలు..
కన్నడంలో పునీత్ రాజ్‌కుమార్‌తో కలిసి నట సార్వభౌమ సినిమా చేస్తున్నాను. కన్నడలో ఇది నా మొదటి సినిమా. అలాగే తెలుగులో ఇంకా ఏ సినిమాకు ఓకే చెప్పలేదు. నటిగా అన్ని భాషల్లో నటిస్తా.. భాష విషయంలో సమస్య ఉంటుంది కానీ.. నటనే కదా ముఖ్యం.

--శ్రీ