సబ్ ఫీచర్
ఇవి మల్టీస్టారర్లా!?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మల్టీ స్టార్ చిత్రాల గురించి ఆమధ్య ‘వెనె్నల’లో కొన్నిసార్లు ప్రస్థావన వచ్చింది. రచయిత కూడా కేటగిరీ మల్టీస్టారర్ల గురించి రెండు మాటలు చెప్పారు. బాగానే ఉంది. అసలు మల్టీస్టారర్ అంటే ఇద్దరు లేక అంతకంటే మించి స్టార్లు ఉండటం అనేది మనకు తెలిసిన అర్థం. ‘మల్టీస్టారర్’ అన్న పదానికి ఒక విలువ ఉంది. ప్రత్యేకత ఉంది. గౌరవం, స్థాయి, గొప్పదనం ఉన్నాయి. పాత చిత్రాల ‘మల్టీ స్టారర్’లన్నీ వీటినన్నింటినీ పొంది, కలిగి ఉన్నాయి. కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుండీ విడుదల తేదీవరకూ అటువంటి చిత్రాలకోసం కోట్లాది ప్రేక్షకులు కళ్లుకాయలు కాచేలా ఎదురుచూసే ఉత్సుకతను కలిగించడం నిజమైన ‘మల్టీస్టారర్’ల గొప్పదనం! అటువంటి అనుభవం పాత చిత్రాలతోనే అంతమైంది. తెలుగు సినీ కళామతల్లి ద్వినేత్ర దిగ్గజాలు ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావులు కలసి సుమారు 15 చిత్రాల్లో నటించినా 1963లో వచ్చిన ‘శ్రీకృష్ణార్జునయుద్ధం’ వరకూ ‘మల్టీ’అన్న పదాన్ని వాడుకోలేదు. అప్పటి రెండవ కేటగిరీ ‘హీరోలయిన కాంతారావు, జగ్గయ్యలాంటి వారు సోలో హీరోలుగా ఎన్ని చిత్రాలలో నటించినా, అక్కినేని, నందమూరిలతో కలసి వారు నటించిన ఏ చిత్రానికీ ‘మల్టీ’అన్న టాగ్ తగిలించలేదు. తరువాతి తరంలో వచ్చిన కృష్ణ, శోభన్‌బాబులు సూపర్‌స్టార్ ఇమేజ్ సంపాదించిన తరువాతే అక్కినేనితో గాని, నందమూరితో గాని కలసి నటించిన చిత్రాలకు మల్టీస్టారర్ అనే పేరును వాడుకున్నారు. హేమాహేమీలు, దేవుడు చేసిన మనుషులు అలాంటి చిత్రాలే! ఇప్పుడు మల్టీస్టారర్ అన్న పదానికున్న విలువను చింపేస్తూ, పెద్ద హీరోల గౌరవాన్ని చెరిపేస్తూ నేడు ప్రేక్షకులను వెర్రివాళ్లను చేస్తూ వాళ్ల వాణిజ్య అవసరాలకు వాయించడం మొదలుపెట్టిన నిర్మాతలు, మీడియా, మీడియా ఆధారంగా రెచ్చిపోతున్న నిర్మాతలు, పరిశ్రమ కొంచెం ఆత్మావలోకనం చేసుకోవాలి!! ఇదంతా ఎందుకంటే...? అక్కినేని నాగార్జున, నాని ఒక మల్టీస్టారర్ అట. అలాగే వెంకటేశ్, నాగచైతన్య, వెంకటేశ్ వరుణ్‌తేజ్ కూడా మల్టీస్టార్లట. విశేషమేమిటంటే వంశీ పైడిపల్లి సినిమా మహేశ్‌బాబు, అల్లరి నరేశ్ కూడా మల్టీ స్టారర్సట! ఈమధ్య ఓ ప్రముఖ దినపత్రిక సినిమా పేజీలో బ్రహ్మాండమైన మల్టీస్టారర్ సినిమా ‘సిల్లీఫెలోస్’ రాబోతుంది. హీరోలుగా సునీల్, అల్లరి నరేశ్‌లు నటిస్తున్నారు అని పేర్కొంది. ఎక్కడికి పోతున్నాం మనం? నాని కొంతవరకూ నయం, కానీ తానేమిటో ఇంకా నిరూపణ కాని నాగచైతన్య, ముచ్చటగా మూడు చిత్రాల హీరో వరుణ్‌తేజ్, అసలు ఇప్పటికీ ఒక రూపంలేని అల్లరి నరేష్‌లు సూపర్ హీరోలు ఎప్పుడయ్యారు? ఎలా అయ్యారు?? మరి ఆ చిత్రాలు మల్టీస్టారర్లు ఎలా అయ్యాయి? ఎందుకయ్యాయి? జయాపజయాలు పక్కనపెడితే మొదటి కేటగిరీ సీనియర్ హీరోలు నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేశ్‌ల చిత్రాలు విజయం సాధిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి హంగామా చేస్తాయో మనకు తెలియంది కాదు! ఖైదీ 150, లెజెండ్, సింహా, సోగ్గాడే చిన్నినాయనా, మనం లాంటి చిత్రాలు ప్రభంజనం మనకు తెలిసిందే!!
ఇప్పుడిప్పుడే పైకివస్తున్న నటులు ఈ సీనియర్ నటులతో కలసి నటించిన చిత్రాలకు దయచేసి ‘మల్టీ’అనే టాగ్‌ను తగిలించకండి. నేటి బాక్సాఫీస్ యువ ప్రభంజనాలు అల్లుఅర్జున్, ప్రభాస్, రామ్‌చరణ్, మహేశ్‌బాబు, పవన్‌కళ్యాణ్, జూ.ఎన్టీఆర్ లాంటివాళ్లు కలసి నటించినా, సీనియర్ నటులతో కలసి నటించినా వాటిని మల్టీస్టారర్స్ అనొచ్చు. ఉదా: గోపాల గోపాల, సీతమ్మవాకిట్లో సరిమల్లెచెట్టు! రాబోయే నిజమైన మల్టీస్టారర్ రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ల రాజవౌళి చిత్రం!! ‘మల్టీ’అన్న పదం ఒక్క హీరోలకే పరిమితమయింది. సమంత, అనుష్క కలసి ఒక చిత్రంలో నటిస్తే ‘మల్టీ’అని ఎందుకు అనలేం? పాత చిత్రాల సూపర్ హీరోయిన్స్ సావిత్రి, అంజలి, జమున లాంటివారు కలసి నటించినా ఆ ‘టాగ్’ అసలు ఎందుకు లేదు? హీరోలకు మాత్రమే ఉపయోగింపబడే ఆ పదానికున్న విలువను కాపాడండి!! పెద్ద హీరోల విలువను కాపాడండి!!