సబ్ ఫీచర్
ఈ హంగామా ఎందుకు?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
చిత్ర ప్రారంభోత్సవం, భగవంతుని ఫొటోలు, పూలమాలలు, పూలు, రకరకాల పండ్లు, పూజ, కొబ్బరికాయ ‘్ఢం’ అనిపించడం, పిదప హాజరైన వక్తలందరూ ‘‘ఈ చిత్రం వందకాదు, రెండువందల రోజులు గ్యారంటీ, ఈ చిత్రం ఓ ట్రెండ్ సృష్టిస్తుంది, ఈ కథా సబ్జెట్ ప్రేక్షకులకు - అభిమానులకు తప్పక నచ్చితీరుతుంది. ఈ సబ్జెక్ట్ యింతవరకెవరూ టచ్ చేయలేదు. ఈ చిత్రం అఖండ విజయం సాధిస్తుందంటూ’’ అతిథులందరూ చిలుక జోస్యం చెప్పడం. ఆ కార్యక్రమాన్ని మీడియా ఆకాశానికెత్తడం, తీరా చిత్రం విడుదలయ్యాక ‘్ఢం’ అనడం మనకు కొత్తేంకాదు. వింతేం కాదు. ఇలా జరుగుతున్నా, చూస్తున్నా, చేతులు కాల్చుకున్నా మన టాలీవుడ్ రంగంలో మార్పన్నది రాకపోవడం గర్హించి తీరవలసిందే. పరాజయాల పరంపరలు కనిపిస్తున్నా, వారం తిరక్కముందే చిత్ర చిరునామా గల్లంతు కావడం. నగరాలలో పాత (డొక్కు) థియేటర్లలో ప్రదర్శింపబడడం, రెండు నెలలకే ‘బ్లాక్ బస్టర్’ చిత్రమంటూ బుల్లితెర ప్రసారం చేయడంతో ఆ చిత్ర శవయాత్ర అంతమైపోతుంది. సాంకేతిక పరిజ్ఞానం అంబాటుకు వచ్చింది. అరచేతిలో ప్రపంచం అంటున్నారు. ‘‘అనుకున్న సమయానికి చిత్రం పూర్తిచేయగలిగాం. హీరోహీరోయిన్ మంచి సహకార మందించారు, కాంప్రొమైజ్ కాకుండా, కాస్త బడ్జెట్ పెరిగినా, చిత్ర విజయంపై నమ్మకంతో చిత్రం పూర్తిచేశాము, మా చిత్రం ‘సంక్రాంతి బరి’లో పందెంకోడిలా విజయం సాధించి తీరుతుంది, ఆ నమ్మకం మా యూనిట్కుంది’అంటూ రొటీన్ డైలాగ్స్ చెబుతున్నారు, వింటున్నాం, మనసులో ఆ సుత్తి విని నవ్వుకుంటున్నాము.
వెనువెంటనే ‘‘ఫేస్బుక్- ట్విట్టర్- యూట్యూబ్- వాట్సాప్- ఇన్స్టాగ్రామ్- లైక్స్- నెటిజన్స్- ఫస్ట్‌లుక్- టీజర్- ఫస్ట్ ఇంపాక్ట్- డిజిటల్ వ్యూస్’’ అంటూ మీడియా హడావుడి చేస్తుంటే నవ్వురాక తప్పదు. ‘‘ఫేస్బుక్’’లో చిత్రం ‘అదుర్స్’అని ప్రకటిస్తే ఆ చిత్రం విజయం సాధించినట్లా? కోట్ల(మిలియన్ల) ‘లైక్స్’ వచ్చాయని డబ్బాకొట్టుకుంటే చిత్రం విజయం సాధించినట్లా? ‘‘్ఫస్ట్‌లుక్’’ అదిరిందని అభిమానులు కాలరెగుర వేసినంత మాత్రాన చిత్రం విజయం సాధించినట్లా? మెగా పోస్టర్ విడుదల చేసినంత మాత్రాన, అభిమానులు చిందులు వేసినంత మాత్రాన ఆ చిత్రానికి విజయం సిద్ధిస్తుందా? కోట్ల ‘వ్యూస్’తో రికార్డుల మోత అని చంకలుగుద్దుకుంటే అది గొప్ప చిత్రవౌతుందా? చిత్రంపై భారీ అంచనాలని అరిగిపోయిన గ్రాంఫోన్ రికార్డులా కలవరించినా, భారీ బడ్జెట్ చిత్రమని కాకిలెక్కలు ప్రకటించినంత మాత్రాన అదో ‘‘దేవదాసు’’ ఔతుందా? ‘‘సీతారామకళ్యాణం’’ ఔతుందా? దాదాపు చిత్రాలన్ని ‘‘తుస్సు’’లేకదా? అట్టర్ ఫ్లాపులే కదా? మరి ఈ హంగామా ఎందుకు? ఆర్భాటమెందుకు? ఇక రెండవ ఘట్టానికి వస్తే ‘‘ఆడియో వేడుక’’లు నేడు టాలీవుడ్ రంగానికిదో ఫ్యాషిన్ అయిపోయింది. ఈ వేడుకకోసం కొన్ని లక్షలు వృధాగా ఖర్చుచేస్తున్నారు. హీరోను హీరోయిన్- దర్శకుడు పొగడితే, హీరోయిన్ను నిర్మాత, హీరో మెచ్చుకోవడం, సాంకేతిక వర్గం ఒకరినొకరు పొగడ్తలతో ముంచేసుకోవడం, వచ్చిన సహచర నట వర్గం తమకు తోచిన ‘‘కాంప్లిమెంట్స్’’ యిచ్చి తమవంతు డబ్బాకొట్టడం పరిపాటైపోయింది. ఆ పిదప చిత్రమెలాగూ థియేటర్లలో కనిపించదు. అది వేరే విషయమనుకోండి.
పిదప చిత్ర విడుదలకు బోలెడు హంగామా సృష్టించడం, బుల్లితెర ఇంటర్వ్యూలు, అగ్ర నటులతో చిత్రం అద్భుతమంటూ సర్ట్ఫికెట్స్ యిప్పించడం లాంటివి మామూలైపోయాయి. ఇలాంటి జిమ్మిక్కులు ప్రేక్షకులు చూసి చూసి వదిలివేశారనుకోండి. చిత్రం విడుదల రోజు అభిమానులు ఫోన్‌చేశారు. అగ్రనటులు ఫోన్‌చేశారు. బాలీవుడ్ నుండి ఫోన్లు మెచ్చుకోలు, చిత్రం సూపర్‌హిట్ టాక్ వచ్చిందంటూ సంబరపడిపోవడం, మరుదినమే చిత్ర యూనిటంతా ‘‘విజయోత్సవ యాత్ర’’ ప్రారంభించి రోడ్లవెంట, థియేటర్ల వెంట వెంపర్లాడడం చూస్తుంటే మసిపూసి నేరేడుకాయను చూపిస్తారన్న సామెత నిజమనిపిస్తుంది. అలా ఆ యూనిట్ తిరిగి నగరం చేరేలోగా బాక్సులన్నీ భద్రంగా వారికి స్వాగతం చెప్పడంతో విజయ యాత్ర ముగిసిపోతుంది. మరో వింత ఏమిటంటే ‘మల్టీస్టారర్’ చిత్రాలని టాలీవుడ్ రంగంలో వింటున్నాం. ‘‘అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావు, జగ్గయ్య, గుమ్మడి, యస్.వి.రంగారావు, రేలంగి, రమణారెడ్డి, కృష్ణంరాజు, శోభన్‌బాబు’’ల తరంతో స్టార్లతరం అంతరించిపోయింది. స్టార్లే లేనప్పుడు మల్టీస్టారర్ చిత్రాలెక్కడనుండి వస్తాయో అర్థం కాదు? ‘్ఫస్ట్ర్యాంక్’ నటులు వెండితెరకు దూరమైపోయారు. ఉన్న ‘‘మూడవ నాలుగవ ర్యాంకుల నటులు కలసి నటిస్తే అది ‘‘మల్టీస్టారర్’’ ఎలా ఔతుంది? గొప్ప నటులు గొప్పవారే, సాదా నటులు సాదానే, మరి మల్టీ స్టారర్‌కు అర్ధం వుండాలిగా, మల్టీ స్టారర్ అనగానే మల్టీస్టారర్లౌతారా? స్వర్ణయుగ నటుల నటన ఈ పెట్టుడు బిరుదుల నటులకు వస్తుందా? ఘోర ఫైట్లు, గీతాల గెంతులకే పరిమితం నేటి నటులన్నది వాస్తవం.
ఇక గీతాల విషయానికొస్తే ‘‘అనురాగానికి ప్రతి రూపమైన అమ్మ పాటలు, కమ్మని లాలి(జోల) పాటలు, ఉత్సాహం నింపే వర్షం పాటలు, హాయిగొలిపే వీణ-హార్మోనియం పాటలు, మత్తు కలిగించి పరవశింపచేసే వెనె్నలరేయి పాటలు, తొలి రేయి పాటలు, గంభీరంగా-అర్ధం వివరించే టైటిల్ సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ గీతాలు, మనసును కరిగించి కన్నీరు తెప్పించే విషాద- విరహపు గీతాలు’’కనుమరుగై, అర్థనగ్న చిందుల గీతాలు నేడు వెండితెరను మలిన పరుస్తున్నవి. ఈ గీతాలకు విలువలేదు, జీవంలేదన్నది అక్షర సత్యం. ప్రస్తుత ప్రభుత్వం థియేటర్ల యజమానులకు టికెట్ల ధర పెంపుదలకు గ్రీన్సిగ్నలిచ్చి పెద్దతప్పుచేసింది. ప్రేక్షకులు రాక, వసూళ్లు రాక నష్టపోతున్న థియేటర్ల యాజమాన్యం వాటిని కళ్యాణ మంటపాలుగా, షాపింగ్ కాంప్లెక్స్‌గా మార్చుకుని జీవనం సాగిస్తున్నారు. అది తెలిసికూడా అలా ఉత్తర్వులివ్వడం తప్పుకాదా? ఈ పెరిగిన టికెట్ల ధరలను చూచి ప్రేక్షకులు సినిమాలకొస్తారా? వస్తారని భ్రమపడుతున్నారా? హాయిగా పది రూపాయలతో ‘పైరసి సిడి’ తెచ్చుకుని యింటిల్లిపాది చిత్రం చూస్తారు. (నిజం చెప్పాలంటే పైరసిని అటు ప్రభుత్వం- ఇటు టాలీవుడ్ రంగం అరికట్టలేదు). మరి పైరసి అరికట్టగలరా? అభిమానులు ఏదో కేకలు వేయడం తప్ప ఏమిచేయలేరన్నది పచ్చి నిజం. ఎలాగు ఈ చెత్త చిత్రాలన్నీ రెండునెలలు తిరగకముందే బుల్లితెర ఆర్భాటం చేస్తూ బ్లాక్‌బస్టర్ మూవీ అంటూ ప్రసారం చేస్తుంది. అలాంటప్పుడు పెరిగిన ధరలకు ప్రేక్షకులు వచ్చి సినిమా చూస్తారా? ఇలాంటి చిన్న ఆలోచనాజ్ఞానం ప్రభుత్వానికి-టాలీవుడ్ రంగానికి లేదా? ఆలోచించలేరా?
పూర్వ బట్రాజులనేవారు వుండేవారు. వారి పొగడ్తలను ‘‘బట్రాజు పొగడ్తలు’’ అనేవారు. వారి పాత్రలను నేడు మన ‘‘సోషియల్ మీడియా’’ సమర్ధనీయంగా పోషిస్తుందనుటలో అతిశయోక్తి లేదనుకుంటాను. చిత్ర పరిశ్రమలో ప్రారంభోత్సవం నుండి, పిక్చర్ ప్రమోషన్స్ విషయంలో నానా యాగిచేస్తూ, హంగామాచేస్తూ సుత్తికొట్టి కొట్టి, పొగిడి పొగిడి పాపం చిత్ర అంచనాలను ఆకాశానికెత్తుతుంది. తీర చిత్రం విడుదలకాగానే రెక్కలుతెగిన పక్షిలా ఆ చిత్రం ఆకాశంనుండి టప్పున నేలపై పడుతుంది. అభిమానుల అంచనాలను, ప్రేక్షకుల ఊహలకు, చిత్ర యూనిట్‌కు, ఆ గొప్ప హీరోకు (అభిమానులకు) చుక్కలు చూపించి ‘‘తుస్’’మంటుంది. ఆ పిదప మీడియా కనిపించదు. నోరెత్తదు. మరో చిత్రానికి పొగడ్తలు ఆరంభిస్తుంది. ఈ ‘‘తుస్’’లకు మూలకారణం మన ‘మీడియానే’ కాదంటారా? కాబట్టి మన ‘‘మీడియానే’’ కాదంటారా? కాబట్టి మన మీడియా చిత్రాలకు భారీ అంచనాలను వ్యాపింపచేయరాదు. అందువల్ల నాశనమయ్యేది టాలీవుడ్ రంగమే. చిత్రం విడుదలై విజయం సాధించాక ఎంత డబ్బాకొట్టినా సరిపోతుంది. ఏమిట్లో ఏమి లేకపోయినా అంచనాల జోలికి మీడియా వెళ్లకుంటే చిత్రరంగం బాగుపడుతుంది!