సబ్ ఫీచర్

అవకాశ రాజకీయాలతో అనర్థం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలోని అన్ని నగరాలలో, పట్టణాలలో జన సమ్మర్ధమైన ప్రాంతాలలో, రహదారి రోడ్లపైన వివిధ రకాలైన మతపరమైన కట్టడాలు, అడ్డంగా తిష్ఠవేసి ఉంటాయి. వీటిలో మందిరాలు, గురుద్వారాలు, సమాధులు, చర్చిలు, మసీదులు ఉన్నాయి. నేటి ఆధునిక సమాజంలోని ప్రజలు ప్రతిరోజు ఉరుకుల పరుగుల జీవితాలకు అలవాటై దూర ప్రాంతాలకు ప్రయాణించి ఉద్యోగాలు చేస్తూ తమ కుటుంబాలను పోషించుకొంటున్నారు. ప్రయాణ సాధనాలు సక్రమంగా నడిస్తేనే నిర్ణీత సమయానికి గమ్యానికి చేరుకోలేరు.
ఈ మతపరమైన కట్టడాలవల్ల రహదారులు మూసుకుపోయి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగి తగు సమయానికి తమ ఆఫీసులకు, కర్మాగారాలకు చేరుకోలేక చాలా అవస్థలు పడుతున్నారు. కొన్ని సమయాలలో రోగులు, ప్రమాదాల బారిన పడిన వ్యక్తులు సరైన తరుణంలో ఆసుపత్రులకు చేరలేక వైద్య వసతి అందక దుర్మరణంపాలు అవుతున్నారు. ఈ విషయాలన్ని దృష్టిలో ఉంచుకొని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. రహదారులకు అడ్డంగా ఉన్నా లేక అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలిగించే మతపరమైన కట్టడాలను ఖచ్చితంగా తొలగించాలి అని చాలా సంవత్సరాల క్రితం ఆదేశించింది.
కాని ఈ విషయంలో ఎటువంటి ప్రగతి సాధించలేదు. కారణం. అవకాశవాద రాజకీయాలే. చట్టసభల్లో ప్రజాసమస్యలపై వాడిగా వేడిగా ఆవేశంగా. అనర్గళంగా మాట్లాడే అధికార పక్ష సభ్యులైనా లేక ప్రతిపక్ష సభ్యులైనా ఇలాంటి సమస్యలపై వౌనం వహిస్తారు. ఓట్లకోసం, సీట్లకోసం తద్వారా పదవికోసం అధికారంకోసం రాజకీయ పార్టీలు అన్నీ నిమ్మకు నీరెత్తినట్లు ఉంటాయి.
ఎవరో కొంతమంది ప్రజలు మాత్రమే ఇబ్బందులు పడతారు. నాయకులు మాత్రం పోలీస్ ఎస్‌కార్టులతో తమ గమ్యస్థానాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేరతారు. ప్రజాప్రతినిధులు నాయకులను నిలదీసి అడిగితే ఏదో కల్లబొల్లి కబుర్లు చెప్పి తప్పించుకొంటారు. కొంతమంది నాయకులు ప్రజల విశ్వాసాలను, నమ్మకాలను వాడుకొని తమ విలువైన ఆస్తులను కాపాడుకొంటున్నారు.
మన దేశంలో మైనారిటీ వర్గంవారి ఆస్తులను రక్షించడం ప్రభ్వుంవారి ప్రథమ కర్తవ్యం. అందుకని ఆ హక్కును ఆధారంగా చేసుకొని ఎంతోమంది తమ కోట్లాది ఆస్తులను రక్షించుకొంటూ లక్షల వ్యాపారాలు చేస్తున్నారు. ఇక దేశ అభివృద్ధి నిబద్ధత, ధర్మం, న్యాయం ఏదైనా తమ పబ్బం గడుపుకొన్న తర్వాతే. ఈ దేశం ఒకప్పుడు పరాయి పాలన క్రింద నలిగిపోయింది. ఇప్పుడు ఈ అవకాశవాద నాయకుల ఓట్ల కుట్ర క్రింద నలిగిపోతున్నది. వీరి అవకాశవాద రాజకీయా వల్ల మెజారిటీ వర్గవారి మనోభా వాలు దెబ్బతింటున్నాయ. కేవలం ఓటుబ్యాంకు రాజకీయాలు నెరపే వీరికి ప్రజల ఇష్టాయష్టాలతో ఎంతమాత్రం పనిలేదు. అందువల్లనే తమ ప్రయోజనాలకు అనుగుణంగా మాత్రమే వారు పనిచేస్తున్నారు. ఫలితంగా దేశంలో ఓటువిలువ పడిపోయంది. ప్రజాస్వామ్య విలువలు అడుగం టుతున్నాయ.
ఇటువంటి తరుణంలో తాజాగా సుప్రీంకోర్టు మరోమారు ఈ విషయంలో జోక్యం చేసుకొంది. ఈ మతపరమైన కట్టడాలను ఆ ఏరియాలో ఉండే మత పెద్దలను ఒప్పించి ఇతర ప్రదేశాలకు మార్చేందుకు ప్రభుత్వం కృషిచెయ్యాలి. దీనికి ప్రజల సహాయ సహకారాలు కూడా ఎంతో అవసరం. అవకాశవాద రాజకీయాలకు దేశ ప్రజలందరు ఏకమై చరమగీతం పాడాలి. అప్పుడే భారతదేశం ప్రపంచ దేశాలతో అగ్రగామిగా నిలుస్తుందన్నది అక్షర సత్యం.

- జన్నాభట్ల లక్ష్మికామేశ్వరి