Others

మరపురాని జ్ఞాపకాలు పదిలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అభిరుచులు అందరికీ ఉంటాయ. కొం దరు మాత్రమే ఆసక్తితో అభి రుచులను నెరవేర్చుకుంటారు. కొం తమంది చిన్నారులు పసి ప్రాయం నుంచే వారికంటూ కొన్ని అభిరుచులను ఏర్పర చుకుం టారు. ఆట వస్తువులు, బొమ్మలను సేకరిస్తూ తమ మన సును ఆనందంతో నింపేసుకుంటారు. చిరు ప్రాయంలో చేసే ఈ చిన్ని ప్రయత్నాలే అర్ధవంతమైన హాబీలుగా మారి వారి ప్రత్యేకతను చాటుకుంటాయ. ఇలాంటి కోవకు చెందిన ముంతాజ్ ఎన్నో మరుపురాని జ్ఞాపకాలను పదిలం చేసి నేటి తరానికి అందిస్తున్నారు. చిన్నతనం నుంచి మొదలైన అభిరుచిని ఏడుపదులు వయస్సులోను నిత్యనూతనంగా కొనసాగించడం
అద్భుతమే. పాఠశాల స్ధాయి నుంచి మొదలైన దేశ,విదేశాల నాణేల సేకరణ, కరెన్సీ నోట్లు, వివిధ రంగాల్లో ప్రతిభగల ప్రముఖుల మజిలీలతో నిండిన జ్ఞాపకాలను ఫొటో అల్బమ్ రూపంలో పొందుపరచి విజ్ఞానాన్ని పంచుతున్నారు. ఈ ఫొటో అల్బమ్‌లో నిజాం కాలం కాటి సమకాలిన అంశాలు సైతం మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తాయ. ఇలా ఎన్నో వైవిధ్య సేరకణలతో 78 సంవత్సరాల వయస్సులోను తన అభిరుచిని కొనసాగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నిర్మల్ శాస్ర్తీనగర్‌కు చెందిన ముంతాజ్ ప్రత్యేక గది చిన్న పాటి మ్యూజియం అనడంలో అతిశయోక్తి కాదు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి చెందిన ముంతాజ్ ఉద్యోగరీత్య నిర్మల్‌కు వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. చదువుకునే వయసులోనే తన మిత్రుల వద్ద రక రకాల నాణేలు, కరెన్సీ నోట్లు చూసి సంబర పడి తాను ఇలాంటివి సేకరించి భద్రపర్చాలనే అభిరుచికి నాంది పలికారు.
అబ్బురపర్చే సేకరణ...
వివిధ దేశాలకు చెందిన పురాతన కాలం నాటి రాగి నాణేలు, అణా పైస నుంచి మొదలు రూ. 500ల నాణేం వరకు సేకరించిన తీరు ఆయన అభిరుచికి అద్దంపడుతుంది. ఇరాక్, ఇరాన్, ఉగండా, టాంజానియా, మారిషస్, శ్రీలంకా, బెహరాన్, దక్షిణా ఆఫ్రికా, అమెరికా తదితర దేశాల కరెన్సీ, పోస్టల్ స్టాంపులను సేకరించారు. ఈ సేకరణకు గాను వివిధ దేశాలకు చెందిన వారితో కలం స్నేహం చేశారు. వారిలో కొందరితో నేడు కూడా ఉత్తర ప్రత్త్యుత్తరాలను కొనసాగిస్తున్నారు. మహ్మదీయులు పవిత్రంగా,అదృష్టంగా భావించే 786నెంబరుగల కరెన్సీని సేకరించడం విశేషం. బ్రిటిష్ యువరాణి డయనా జీవిత విశేషాలు, ఇరాన్, ఇరాక్ యుద్దవిశేషాల కథనాలు దేశ మాజీ ప్రధాని ఇందిర, రాజీవ్, మాజీ ముఖ్యమంత్రులు రాజశేఖర్ రెడ్డి తదితరుల జీవిత విశేషాల ఫోటోలు, పత్రికల క్లిప్పింగ్‌లు సేకరించి పొందుపర్చిన తీరు అబ్బుపరుస్తుంది. 1839 నుంచి నేటి వరకు క్యాలెండర్లను భద్రపర్చారు. సాహిత్య, సాంస్కృతిక అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. పాత సాహిత్యం, పాటలపై ఆయనకు అమితమైన ప్రేమ. 1937 సంవత్సరానికి చెందిన ప్రముఖ గాయకులు ‘ తలేద్ మహముద్ ఆలపించిన ‘ జిందగీ దేనేవాలో సునా తేరే దునియాసే జిబర్‌గయా , మై యహా జీతేభీ మర్‌గయా ’ లాంటి పాపులర్ పాటల సిడిలను ఓ పద్దతి ప్రకారం సేకరించారు. హాలివుడ్, బాలీవుడ్, టాలీవుడ్ సినీ ప్రపంచంలోని పాత తరం నుంచి నేటి తరం వరకు నటీ నటుల పోటోలను ఆయన పదిల పరిచిన తీరు ఆశ్చర్యం కల్గిస్తుంది.
సాహితీ పిపాసకులు..వేణువుతో సరాగాలు..
ఈ హాబీనే కాదు సాహిత్యం, సంగీతం పట్ల కూడా మంతాజ్‌కు ఇష్టం. నిరంతరం సమకాలీన అంశాలను అధ్యయనం చేస్తూ తన అనుభవాలను ఆర్టికల్స్ రూపంలో రాసిన ఎన్నో వ్యాసాలు పలు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. గానాబజానా మరింత ఇష్టపడబతారు. హార్మోనియంపై సరిగమలు, పిల్లన గ్రోవితో సరాగాలు పలికించడంలో ప్రావీణ్యతను పొందారు. అటవీ శాఖలో ఉద్యోగిగా పనిచేసిన కాలంలో ఎన్నో ప్రదర్శనలిచ్చి పలువురి మన్ననలను అందుకున్నారు. విలక్షణమైన అభిరుచులతో ఆదర్శంగా నిలుస్తున్న ముంతాజ్ ఆచరణ పలువురికి స్పూర్తిదాయకం.

-శ్రీనివాస్,