సబ్ ఫీచర్

యాచకుడి దాతృత్వంతో అక్షరకాంతులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్థికంగా స్థితిమంతులైన వారే పొరుగువారి కోసం రూపాయి కూడా విదల్చని ఈ కలికాలంలో- ఓ యాచకుడు తన కష్టార్జితాన్నంతా బాలికల విద్య కోసం ఖర్చు చేస్తున్నాడు. పేదింటి బాలికలు బడికి వెళ్లాలని, వారి కనీస అవసరాలను కొంతమేరకైనా తీర్చాలని ఆ బిచ్చగాడు నిరంతరం పరితపిస్తునే ఉంటాడు. మురికివాడల్లోని బాలికలకు పుస్తకాలు, యూనిఫామ్స్ కొని ఇవ్వడం, స్కూల్ ఫీజులు చెల్లించడం మాత్రమే కాదు, వారికి చిన్నసైజు బంగారు చెవిరింగులను కూడా అందజేస్తూ కింబ్జ్భీయ్ ప్రజాపతి అనే బిచ్చగాడు తన దాతృత్వాన్ని చాటుకుంటున్నాడు. గుజరాత్‌లో జిల్లా కేంద్రమైన మెహ్‌సానా పట్టణంలో ఉంటున్న ప్రజాపతి తాజాగా స్థానిక అంగన్‌వాడీలో చదువుకుంటున్న పదిమంది బాలికలకు బంగారు చెవి రింగులను అందజేసి తన గొప్ప మనసును చాటుకున్నాడు.
పేద కుటుంబాలకు చెందిన బాలికలకు గత మూడేళ్లుగా ప్రజాపతి ఏదో ఒకరూపంలో సాయం చేస్తున్నాడు. మాగ్‌పర స్కూలుకు అనుబంధంగా ఉన్న అంగన్‌వాడీలో ఒకేసారి పదిమంది బాలికలకు ప్రజాపతి చెవిరింగులను ఇవ్వడంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 68 ఏళ్ల ప్రజాపతి స్థానిక ఆలయాల వద్ద యాచన చేస్తూ తన సంపాదనను పేద బాలికల కోసం వినియోగిస్తున్నాడు.
బంగారు చెవిరింగులను ధరించే అదృష్టం తమ పిల్లలకు ఉంటుందని తాము కలలో కూడా ఊహించలేదని, ప్రజాపతి దాతృత్వం వల్లనే ఇది సాధ్యమైందని బాలికల తల్లిదండ్రులు చెబుతున్నారు. ‘బాలికలంతా బడిబాట పట్టాలి.. వారు బాగా చదువుకుని ఆత్మవిశ్వాసంతో స్వేచ్ఛగా బతకాలి.. మెహ్‌సానా మురికివాడల్లో బాలికల పరిస్థితి దయనీయంగా ఉంది.. బాలురతో పోటీపడి వారు చదువులో, ఉద్యోగాల్లో రాణించాలి.. అందుకే వారికి పుస్తకాలు, యూనిఫామ్స్ కొంటున్నా.. స్కూల్ ఫీజులు చెల్లిస్తున్నా.. వారి ముచ్చట తీర్చేందుకు బంగారు చెవిరింగులను అందజేశా.. బాలికలకు కనీస సౌకర్యాలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నదే నా ధ్యేయం..’ అంటున్నాడు ప్రజాపతి. తన వొంట్లో శక్తి ఉన్నంతవరకూ యాచక వృత్తిపైనే జీవిస్తానని, పొదుపుగా ఖర్చు చేస్తూ బాలికల విద్య కోసం డబ్బు దాస్తుంటానని ఆయన చెబుతున్నాడు.