రాష్ట్రీయం

హిందూమత రక్షణే ప్రధాన లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 29 : హిందూమత రక్షణ, హిందూ సంస్కృతి పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మాజీ ఐఎఎస్ అధికారి, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ పివిఆర్‌కె ప్రసాద్ తెలిపారు. 2015 డిసెంబర్ 2 న తిరుమలలోని ‘సదస్సుహాల్’లో నిర్వహిస్తున్న ‘్ధర్మిక సదస్సు’ లక్ష్యాల గురించి ఆదివారం ఆయన ఆంధ్రభూమి ప్రతినిధికి వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థానాలు, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి. 2007, 2008లో తాను టిటిడి సలహాదారుగా ఉండగా, ధార్మిక సదస్సులను నిర్వహించామని గుర్తు చేశారు. ఆనాడు 23 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం తలపెట్టిన ధార్మిక సదస్సు ప్రత్యేక లక్ష్యాలతో ఏర్పాటు చేస్తున్నామన్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పీఠాల అధిపతులు, మఠాధిపతులు తదితరులను ఈ సదస్సుకు ఆహ్వానిస్తున్నామన్నారు.
దేవాలయాలు ఆధ్మాతిక కేంద్రాలుగా పనిచేయాలన్నదే లక్ష్యమన్నారు. భక్తులు వచ్చి దేవుడికి దండం పెట్టుకుని, తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్లిపోయేందుకు మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక అంశాలకు కేంద్రాలుగా ఆలయాలు ఉండాలన్నదే ఉద్దేశమన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో హిందూ ప్రజలందరికీ ఉపయోగపడే కార్యక్రమాలను చేపడతామన్నారు. హిందూ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకుంటూ, వీటిని విశ్వవ్యాప్తం చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే భక్తమండళ్లు, దేవాలయ కమిటీలు, భజన మండళ్లు తదితర విభాగాలను పూర్తిగా ఉపయోగించుకోవాలన్నదే తమ ఉద్దేశమని ప్రసాద్ తెలిపారు. ప్రతి హిందూ ఇంటికి చెందిన వారిని ఆధ్యాత్మిక అంశాల్లో భాగస్వామ్యం చేస్తామని తెలిపారు. అన్ని గ్రామాల్లో జరిగే కార్యక్రమాలను మండలస్థాయిలో, జిల్లాస్థాయిలో సమన్వయం చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని భావిస్తున్నామన్నారు. వీటన్నింటికీ నిధులు ఏ విధంగా సమకూర్చుకోవాలో ఆలోచిస్తామని ప్రసాద్ వివరించారు. ధార్మిక సదస్సులో పాల్గొనే పీఠాధిపతులు తదితరుల సలహాలు సూచనలు తీసుకుని బృహత్ ప్రణాళిక రూపొందిస్తామన్నారు.
తిరుమలో జరిగే ఒకరోజు సదస్సు రెండు విభాగాలుగా ఉంటుంది. ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం వరకు ఒక సెషన్, మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం వరకు మరో సెషన్ ఉంటుందని తెలిపారు.