తెలంగాణ

కార్మికుల దాడిలో గాయపడ్డ ఒసిటిఎల్ ఎజిఎం మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్కట్‌పల్లి: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి ఒసిటిఎల్ ఫ్యాక్టరీలో కార్మికుల దాడికి గురైన ఫ్యాక్టరీ ఎజిఎం కోయ మస్తాన్‌రావు(51) ఎల్‌బి నగర్ కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందారు. రెండు రోజుల క్రితం కార్మికుల దాడిలో తలకు తీవ్ర గాయాలై రక్తస్రావం జరిగి ఆయన కోమాలోకి వెళ్లి చికిత్సలో ఉండగానే మృతి చెందారు. మస్తాన్‌రావు మృతితో ఒసిటిఎల్ ఫ్యాక్టరీ యాజమాన్యం, కార్మికుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. గుంటూరు జిల్లా నాదేళ్ల గ్రామానికి చెందిన మస్తాన్‌రావుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మస్తాన్‌రావు మృతిని సీరియస్‌గా తీసుకున్న ఓసిటిఎల్(కామినేని) యాజమాన్యం ఫ్యాక్టరీ లాకౌట్ చేసే దిశగా యోచిస్తుంది. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు 30మందిపై కేసు నమోదు చేసి 22మందిని అరెస్టు చేయగా మరో 8మంది పరారీలో ఉన్నారు. ఒసిటిఎల్ యాజమాన్యానికి, కార్మికుల మధ్య గత రెండేళ్లుగా తరుచూ వివాదాలు ఘర్షణలు సాగుతున్నాయి. మస్తాన్‌రావుపై కార్మికుల దాడితో ఈ వ్యవహారం మరింత ముదిరిపోగా ఫ్యాక్టరీ మనుగడ, కార్మికుల భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారింది.

టి.సర్కార్ వెబ్‌సైట్ మూసివేతపై విమర్శలు

హైదరాబాద్, ఫిబ్రవరి 20: రాష్ట్ర ప్రభుత్వం ఉన్నపళంగా వెబ్ సైట్‌ను మూసి వేసిందని విమర్శల వెల్లువెత్తింది. ప్రభుత్వం జారీ చేసే జీవోలను ఈ వెబ్ సైట్‌లో వెంటనే పెడతారు. పారదర్శకంగా జీవోలు చూడకుండా ప్రభుత్వం వెబ్‌సైట్‌ను లేకుండా చేసిందని బచావో తెలంగాణ మిషన్ అధ్యక్షుడు డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి, పలువురు బిజెపి నాయకులు శుక్రవారం విమర్శించగా, శనివారం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ మరో అడుగు ముందుకేసి సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) కింద వివరణ కోరారు. ఈ మేరకు ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ (జిఎడి) పిఆర్‌ఓకు లేఖ అందజేశారు.

సెంటర్ ఫర్ దళిత్
స్టడీస్‌కు స్థలం కేటాయింపు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 20: సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్‌కు ప్రభుత్వం యూసఫ్ గూడలో 865 చదరుపు గజాల స్థలాన్ని కేటాయించింది. ప్రస్తుతం సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ కార్యాలయం తార్నాకలో ఉంది. దళిత్ స్డడీస్ కోసం ఈ స్థలం కేటాయించినట్టు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఆసుపత్రిలో చేరిన మత్తయ్య

నరసరావుపేట, ఫిబ్రవరి 20: ఓటుకు నోటు కేసులో నాలుగో ముద్దాయిగా ఉన్న జరూసలేం మత్తయ్య అనారోగ్యంతో గుంటూరు జిల్లా నరసరావుపేటలోని పల్నాడురోడ్డులో మదర్ థెరిసా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో శనివారం చేరారు. బస్సు ప్రయాణంలో హై బీపీ (అధిక రక్తపోటు)తో అనారోగ్యానికి గురికావడంతో తన భార్య, బంధువులు చికిత్స నిమిత్తం ఈ ఆసుపత్రిలో చేరినట్లు మత్తయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఎసిబి డిజి జారీ చేసిన దాని ప్రకారం వారం రోజుల్లో ఎసిబి ఎదట హాజరు అవనున్నట్లు తెలిపారు. అయితే హైబీపీ, చక్కెరవ్యాధి, ఆందోళనకు గురై చికిత్స పొందుతున్నందున హాజరు కాలేకపోతున్నట్లు తెలిపారు. వైద్యుల సూచనల మేరకు రెండు, మూడు వారాల విశ్రాంతి అనంతరం ఎసిబి కార్యాలయానికి హాజరవుతానని స్పష్టం చేశారు. దళిత క్రైస్తవుడనైన తనను రాజకీయ కక్షలతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఓటుకు నోటు కేసులో ఇరికించి, స్వయంగా హైకోర్టు స్టే ఆర్డర్‌ను సైతం లెక్కచేయకుండా గ్రేటర్ ఎన్నికల అనంతరం టీడీపీ ఎమ్మెల్యేలను లోబరుచుకున్నారన్నారు. ప్రతిపక్షాల వేధింపుల భాగంగానే తిరిగి కోర్టు ఆర్డర్‌ను కూడా ధిక్కరిస్తూ నోటీసు జారీ చేయాల్సిందిగా ఎసిబిని ఉసిగొల్పి తనను భయాందోళనకు గురిచేస్తున్నారని ఆరోపించారు.