రాష్ట్రీయం

అడిగిన దానికంటే ఎక్కువే ఇచ్చాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 29: పట్టణాల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడిగిన దాని కంటే అధికంగా ఇచ్చామని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. రామగుండం, మహబూబ్‌నగర్, వరంగల్, సూర్యాపేట, మిర్యాలగూడ, నల్లగొండ, ఆదిలాబాద్ పట్టణాల అభివృద్ధికి 405 కోట్ల రూపాయలు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరితే కేంద్రం 415 కోట్ల రూపాయలు కేటాయించిందని ఆయన ఆదివారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. హైదరాబాద్‌కు 20 కోట్లు కేటాయించినట్లు ఆయన చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడితే తాము సహకరిస్తామని ఆయన తెలిపారు. కేంద్రంపై ఆరోపణలు చేయడం కాదు అభివృద్ధికి చర్యలు చేపట్టాలని అన్నారు. తెలంగాణలో కరవు తీవ్రంగా ఉందని, రెండు జిల్లాల్లో పూర్తిగా ఉందని ఆయన తెలిపారు. తెలంగాణ హైకోర్టు ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా ఉందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక అక్కసుతో ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని ఆయన తెలిపారు.

విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి దత్తాత్రేయ