రాష్ట్రీయం

గవర్నర్ గుళ్ళకు వెళ్తే తప్పేంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 29: సంచలనాలకు స్వస్తి పలకాలని, ఎప్పుడూ విమర్శించడమే కాదు...సలహాలూ ఇవ్వాలని గవర్నర్ నరసింహన్ మీడియాకు హితవు పలికారు. ఆదివారం రవీంద్ర భారతిలో జరిగిన హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ స్వర్ణోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్రేకింగ్ న్యూస్ పేరిట సంచలనాలకు స్వస్తి పలకాలని, బాధ్యతతో మెలగాలని అన్నారు. తాము దేనికైనా అతీతులమని మీడియా ప్రతినిధులు భావించ కూడదని, సమాజంలో భాగమేనని గ్రహించాలని అన్నారు. అస్సాంలో బాంబు పేలుడు ఘటనలో తన సోదరుడు మరణిస్తే అక్కడికి వెళ్లినప్పుడు మీడియా ఎదురై, ‘ఆప్‌కో కైసా లగ్‌తాహై..’ (ఈ ఘటనపై మీకు ఎలా అనిపిస్తున్నది?) అని ప్రశ్నించడంతో తాను నివ్వెరపోయానని అన్నారు. రాష్ట్ర పరిస్థితులపై కేంద్రానికి నివేదించేందుకు ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడి మీడియా ఎదురైందని, కేంద్రానికి తాను 35 పేజీల నివేదిక సమర్పించినట్లు చెబితే, నివేదిక కాపీ (ప్రతి) కావాలంటూ మీడియా ప్రతినిధులు అడిగితే తాను ఏం సమాధానం చెప్పాలని అన్నారు. తాను గుళ్లు, గోపురాలకు వెళితే తప్పేమిటని ప్రశ్నించారు. ఎక్కడికి వెళ్ళినా భార్యను తీసుకెళుతున్నారని అంటారని, భార్యను తీసుకెళితే తప్పేమిటన్నారు. మీడియా వార్తలనూ సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) పరిధిలోకి తేవాల్సిన అవసరం ఉందని అన్నారు. మీడియాలో సంస్కరణలు రావాలని, 45 రోజులకు ఒకసారి మీడియాకు వివిధ అంశాలపై అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆయన ప్రెస్‌క్లబ్ నిర్వాహకులకు సూచించారు. తాను చాలావరకు మీడియాకు దూరంగా ఉన్నానని అన్నారు. తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోరాదని, మళ్లీ హెడ్‌లైన్స్‌లో చూపించవద్దని ఆయన కోరారు. 47 సంవత్సరాలుగా వివిధ పదవులు నిర్వహించిన అనుభవంతో చెప్పిన వాటిని సానుకూలంగా తీసుకోవాలని గవర్నర్ మీడియాను కోరారు.
మీడియాకు మాడల్ గృహాలు: దత్తాత్రేయ
కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రసంగిస్తూ జర్నలిజంలో మహిళలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. సమాజంలో జర్నలిస్టుల పాత్ర చాలా ముఖ్యమైనదని ఆయన తెలిపారు. వార్తల విషయంలో యాజమాన్యం వత్తిడి లేకుండా, స్వేచ్ఛ ఉండాలని అన్నారు. జర్నలిస్టులకు రక్షణ ఉండాలని, వేజ్‌బోర్డు అమలు చేయాలని ఆయన చెప్పారు. గతంలో ఆంధ్రభూమి దినపత్రికలో గోరా శాస్ర్తీ సంపాదకీయాలు చాలా బాగా ఉండేవని ఆయన తెలిపారు. జర్నలిస్టులకు మాడల్ గృహాలు నిర్మించి ఇస్తామని ఆయన భరోసా ఇచ్చారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రెస్ క్లబ్ కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తే తామూ సహకరిస్తామని దత్తాత్రేయ తెలిపారు.
10 కోట్లు ఇచ్చాం: మంత్రి కెటిఆర్
రాష్ట్ర ఐటి మంత్రి కె తారకరామారావు ప్రసంగిస్తూ జర్నలిస్టుల సంక్షేమ నిధికి తాము ఇదివరకే 10 కోట్ల రూపాయలు విడుదల చేశామని అన్నారు. 29 రాష్ట్రాల్లో ఎక్కడా జర్నలిస్టులకు సమకూరని విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని ఆయన తెలిపారు. త్వరలో హెల్త్ కార్డులు ఇవ్వనున్నట్లు ఆయన ఉదహరించారు. హైదరాబాద్‌లో జర్నలిస్టు భవన్ నిర్మించాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి ఉన్నారని ఆయన తెలిపారు. జర్నలిస్టుల ఇళ్ళ పట్టాలకు సంబంధించిన అంశం పరిశీలనలో ఉందని, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాను సమానంగా చూస్తామని అన్నారు. మీడియా స్వీయ నియంత్రణ పాటించాలని ఆయన కోరారు. రాజకీయ నాయకులు ఏదైనా ఆవేశంలో అంటే కొన్ని పత్రికలు, ఛానళ్ళు తీవ్రతను తగ్గించి చూపిస్తుండగా, కొన్ని మాత్రం తాము అనని మాటలనూ చూపిస్తున్నాయని మంత్రి కెటిఆర్ అన్నారు.
ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రవికాంత్‌రెడ్డి స్వాగతోపన్యాసం చేశారు. క్లబ్ నాయకులు రాజవౌళిచారి, పివి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. ప్రెస్‌క్లబ్ స్వర్ణోత్సవాల్లో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న గవర్నర్ నరసింహన్