తెలంగాణ

హైదరాబాద్ అభివృద్ధికి 30వేల కోట్ల ‘బ్రిక్స్’ రుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: హైదరాబాద్‌లో అభివృద్ధి కార్యక్రమాల కోసం బ్రిక్స్ బ్యాంకు నుంచి 30వేల కోట్ల రూపాయల రుణానికి ప్రతిపాదనలు పంపించినట్టు ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(టియుడబ్లుజె) హెయుజె, టిఎస్‌పిజెఎ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీట్‌ది ప్రెస్‌లో కెటిఆర్ మాట్లాడారు. 8600 కోట్ల రూపాయల వ్యయంతో మూసి నదిని అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. మూసినదిని మురికి కూపంగా మార్చారని, మూసీ సుందరీకరణ, మూసీ పరివాహక ప్రాంతం 40 కిలో మీటర్ల వరకు సిక్స్‌వే రోడ్స్ ను నిర్మించనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం నగర వాసులు కుటుంబంతో సేద తీరేందుకు నెక్లెస్ రోడ్ తప్ప మరోటి లేదని మూసీ పరివాహక ప్రాంతాన్ని సుందరీకరించనున్నట్టు చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం ఏం చేస్తే బాగుంటుందో ముఖ్యమంత్రికి స్పష్టమైన ప్రణాళిక ఉందని తెలిపారు. ప్రస్తుతం పివి నరసింహారావు స్కైవే ఒక్కటే ఉందని, ఇలాంటివి నగరానికి నలువైపులా 12 స్కైవేలు నిర్మించనున్నట్టు చెప్పారు. నాలుగు వందల కిలో మీటర్ల పరిధిలో వైట్ ట్యాప్ రోడ్లను ఈ సంవత్సరం నిర్మించనున్నట్టు చెప్పారు. త్వరలోనే వరంగల్‌కు కూడా ఐటి కంపెనీలు రాబోతున్నాయని అన్నారు. ఆయా జిల్లాల్లో అవకాశాలను బట్టి ఎలాంటి పరిశ్రమలను ఏర్పాటు చేయాలో ఆలోచిస్తున్నట్టు చెప్పారు. హుసేన్ సాగర్‌ను ప్రక్షాళన చేస్తుంటే అడ్డుకునే పార్టీలు ఉన్నాయని అన్నారు. హుసేన్‌సాగర్‌లోకి వచ్చే కూకట్‌పల్లి నాలాను మళ్లించినట్టు చెప్పారు. 11వేలకోట్లతో 11 స్కైవేల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ముందుగా నిర్ణయించిన విధంగానే 2017లో మెట్రో రైలు పరుగులు పెడుతుందని తెలిపారు. 50ఏళ్లలో కాంగ్రెస్, టిడిపి, బిజెపి, ఎంఐఎం పార్టీలు చేయలేని పనులు హైదరాబాద్‌లో ఐదేళ్లలో చేసి చూపిస్తామని చెప్పారు. ప్రజలకు ఇదే అంశాన్ని వివరిస్తాం, ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వమని కోరుతామని చెప్పారు. 14 ఏళ్ల క్రితం తెలంగాణ ఉద్యమాన్ని కెసిఆర్ ప్రారంభించినప్పుడు నవ్విన వారున్నారని, కానీ అసాధ్యం అనుకున్నదాన్ని సాధ్యం చేసి చూపించామని అన్నారు. విశ్వనగరంగా హైదరాబాద్ అభివృద్ధికి ఏం చేయాలో సమగ్ర ప్రణాళికతో నాలుగు రోజుల్లో ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకటించనున్నట్టు కెటిఆర్ తెలిపారు. గ్రేటర్ మేయర్ స్థానం టిఆర్‌ఎస్ కైవసం చేసుకోకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మరో సారి చెబుతున్నానని అన్నారు. ఏ ఒక్క వర్గాన్ని టిఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయలేదని తెలిపారు. ఆలస్యం కావచ్చు కానీ ఇచ్చిన హామీలను అమలు చేసి చూపిస్తామని అన్నారు. కాలుష్యం లేకుండా ప్రశాంతంగా జీవించే హైదరాబాద్‌గా అభివృద్ధి చేయాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. టాస్క్ ద్వారా ఇప్పటికే 20వేల మందికి శిక్షణ ఇచ్చినట్టు చెప్పారు.
ఓటమికి రంగం సిద్ధం చేసుకుంటున్న విపక్షాలు
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విపక్షాలు ఇప్పటికే ఓటమికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయని కెటిఆర్ తెలిపారు. డివిజన్ల విభజన మాకు చెప్పలేదని, మీరు ఫోన్ చేసినప్పుడు బాత్రూమ్‌లో ఉన్నాను అంటూ కుంటి సాకులు చెబుతున్నారని విమర్శించారు. ఓటర్లు ఏకపక్షంగా టిఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని కోరుతున్నట్టు చెప్పారు. హైదరాబాద్ పరిధిలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రజా రవాణ వ్యవస్థలో మార్పులతో పాటు పది కోట్ల మొక్కలు పెంచనున్నట్టు చెప్పారు. అయితే వర్షాలు సరిగా కురవక పోవడం వల్ల అనుకున్నట్టుగా హరిత హారం ప్రారంభం కాలేదని చెప్పారు. తాను చెబుతున్న అభివృద్ధి ఇప్పటికిప్పుడు అవుతుందని చెప్పడం లేదని, 10 ఏళ్ల సమయం పడుతుందని అన్నారు.

టియుడబ్లుజె, హెయుజె, టిఎస్‌పిజెఎ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీట్‌ది ప్రెస్‌లో మాట్లాడుతున్న తెలంగాణ మంత్రి కెటిఆర్