తెలంగాణ

ఆత్మబలంతో దేన్నయనా జయించవచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: ప్రతి మనిషి ఆత్మబలంతో ఎంతటి కార్యానైనా జయించవచ్చని, అదే ఆత్మబలంతో జ్యోతిష్యాన్ని అధిగమించవచ్చని శ్రీపీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద ఉద్బోధించారు. యువశక్తిని అనుకూలంగా ఉపయోగించుకోవాలని, భారతదేశ జనాభాలో 60 శాతం యువత ఉందని, యువశక్తితో దేన్నయినా సాధించవచ్చని స్వామిజీ అన్నారు. పాలసముద్రాన్ని చిలికినప్పుడు వచ్చిన గరళాన్ని పరమేశ్వరుడు మింగి అమృతాన్ని దేవతలకు పంచిఇచ్చినట్లు కష్టాన్ని నీవు తీసుకుని సుఖాన్ని పదిమందికి పంచు, అప్పుడు నీకు పరమాత్ముని అనుగ్రహం కలుగుతుందని స్వామీజీ అన్నారు. భారత్ టుడే, ఐ ఫోకస్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం తెలుగు లలిత కళాతోరణంలో జరిగిన యువ ‘సంకల్ప్ దివస్’, యువతకు ఐకాన్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసి స్వామి పరిపూర్ణానంద మాట్లాడుతూ యువకులందరినీ ఒకే చోటుకు తీసుకువచ్చి ఉభయ రాష్ట్రాల్లోని యువతలోని నిష్ణాతులను వెలికి తీసి అవార్డులు ఇస్తున్నందుకు భారత్ టుడే సంస్థను అభినందించారు. ప్రాంతాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖమంత్రి కెటిఆర్ పురస్కార గ్రహీతలకు లక్ష రూపాయల నగదు ప్రకటించడాన్ని స్వామీజీ అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఐటి శాఖమంత్రి కెటిఆర్ మాట్లాడుతూ 50 శాతానికి పైగా ఉన్న దేశంలోని యువత కేవలం ఉద్యోగాలకోసమే కాకుండా శాస్తప్రరంగా ఎదగాలని ఆయన సూచించారు. ఐఫోకస్ సిఇవో వాసుదేవ శర్మ మాట్లాడుతూ ఆనందం అనేది యుట్యూబ్, ఇంటర్నెట్‌ల ద్వారా రాదని, యువతనుండి వస్తుందంటూ గతంలో స్వామి వివేకానంద అన్నమాటల్ని గుర్తుచేశారు. తరతరాలుగా యువతను ప్రేరేపించే విధంగా స్వామి వివేకానంద బోధనలను పాటించాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆకెళ్ళ రాఘవేంద్ర మాట్లాడుతూ మళ్ళీ జన్మించిన వివేకానందుడే స్వామి పరిపూర్ణానంద అని అన్నారు. ఈ నేలపై జన్మించినందుకు నిన్ను సంస్కరించుకో అని వివేకానంద అన్నారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ శాస్తవ్రేత్త బొమ్మగాని మల్లేష్, బాడీ బిల్డర్ చరణ్, చిన్న వయసులోనే తాటిచెట్టు ఎక్కగలిగే సామర్థ్యాన్ని సంపాదించిన మృదువర్షిణికి, 15 భాషలను తిరగవ్రాయగలిగే నారాయణరావుకు, అమ్మా, నాన్న ఆశ్రమం ద్వారా మతి స్థిమితంలేని 350మంది వృద్ధులకు ఆశ్రమం కల్పిస్తున్న గట్టు శంకర్‌కు యూత్ ఐకాన్ అవార్డులను ప్రదానం చేశారు. వరప్రసాదరెడ్డి గ్రామీణ శాస్తవ్రేత్త మల్లేష్‌కు లక్షరూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.

ఐపిఎస్ సస్పెన్షన్ ఉత్తర్వులు రద్దుచేసిన ఏపి సర్కార్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 12: రాష్ట్రప్రభుత్వం కేటాయించిన భవంతిలో ఉంటూనే మరో పక్క ప్రతి నెలా అద్దె ఇంటి అలవెన్స్‌ను తీసుకున్నారనే ఆరోపణలపై ఐపిఎస్ అధికారి డాక్టర్ సిహెచ్ శ్యాంప్రసాదరావును సస్పెండ్ చేసిన ప్రభుత్వం ఆ ఉత్తర్వులను తాజాగా రద్దు చేసింది.ప్రభుత్వ సస్పెన్షన్ ఉత్తర్వులపై శ్యాం ప్రసాదరావు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడంతో ఒఎ 1316లో ట్రిబ్యునల్ ప్రభుత్వ సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దు చేసింది. అయితే హెచ్‌ఆర్‌ఎ అంశంపై దర్యాప్తు కొనసాగించవచ్చని పేర్కొంది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయగా, క్యాట్ ఉత్తర్వులను రద్దు చేస్తూ తాజాగా ఈ కేసును పునఃసమీక్ష చేయాలని హైకోర్టు క్యాట్‌కు సిఫార్సు చేసింది. అయితే మరోమారు క్యాట్ ఈ కేసును పరిశీలించి సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది, అయితే హెచ్‌ఆర్‌ఎ అంశంపై దర్యాప్తు కొనసాగించవచ్చని సూచించింది. దాంతో ప్రభుత్వం తాజాగా సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దుచేస్తూ ఆదేశాలు ఇచ్చింది.
2011 బ్యాచ్ ఐపిఎస్‌ల సర్వీసులు క్రమబద్ధం
2011 బ్యాచ్‌కు చెందిన ఐపిఎస్ అధికారుల సేవలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రమబద్ధం చేసింది. క్రమబద్ధం అయిన వారిలో అభిషేక్ మహంతి, వెంకట అప్పల నాయుడు చింతం, ఫకీరప్ప కాగినెల్లి, భూసారపు సత్య ఏసుబాబు, అట్టాడ బాబూజీ ఉన్నారు. ఈ మేరకు కేంద్రప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను రాష్ట్రప్రభుత్వం అమలుచేసింది.
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో
సౌర విద్యుత్ ప్లాంట్ ప్రారంభం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 12: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఐదు మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ విద్యుదుత్పత్తిని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిహెచ్‌ఐఎఎల్ సిఇవోఎస్‌జికె కిషోర్ మాట్లాడుతూ, రోజుకు 25వేల యూనిట్ల కాలుష్య రహిత విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తామన్నారు. సంప్రదాయేతర ఇంధన రంగంలో జిఎంఆర్ విమానాశ్రయం ముందంజ వేసిందన్నారు. కేంద్ర వైమానిక రంగం మార్గదర్శకాలకు అనుగుణంగా తమ సంస్ధ 7 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేసిన ప్లాంట్‌లో 16వేల సోలార్ పానెల్స్ ఉన్నాయన్నారు. పొలి క్ట్రిస్టలైన్ టెక్నాలజీతో నిర్మించామన్నారు. సూపర్‌వైజరీ కంట్రోల్ అండ్ డాటా అక్విజిషన్ వ్యవస్ధను ఏర్పాటు చేశామన్నారు. గ్రిడ్‌తో ఈ విద్యుత్ ప్లాంట్‌ను అనుసంధానం చేశామన్నారు.
ఐటిఐ విద్యార్థులకు తీపికబురు
డిప్లొమో రెండోఏడులో చేరికకు అవకాశం
కేంద్రం ప్రతిపాదనను ఆమోదించిన ఏపి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 12: ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ఐటిఐ విద్యార్థులకు గొప్పవరాన్ని ఇచ్చింది. వారు నేరుగా మూడేళ్ల డిప్లొమో కోర్సు రెండో సంవత్సరంలో చేరేందుకు వీలుకల్పించింది. గతంలో కేంద్రం చేసిన ఈ ప్రతిపాదలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించింది. పదో తరగతి తర్వాత రెండేళ్లు కష్టపడి ఐటిఐ చేసిన విద్యార్థులు, అది పూర్తయిన తర్వాత ఏం చేయాలో తోచని స్థితిలో పడిపోతున్నారు. మళ్లీ ఇంటర్‌లో చేరడమో లేదా మూడేళ్ల డిప్లొమో కోర్సు మొదటి సంవత్సరంలో చేరడమో జరుగుతోంది. ఇక మీదట ఐటిఐ చేసిన వారు నేరుగా డిప్లొమో రెండో సంవత్సరంలో చేరేందుకు వీలుంది. అయితే వీరు ఎస్‌బిటిఇటి నిర్వహించే బ్రిడ్జికోర్సును పూర్తి చేయాలి. వారు నిర్వహించే ఫిజిక్స్, మాథ్స్ , కెమిస్ట్రీ పరీక్షలు ఉత్తీర్ణులై ఉండాలని సూచించింది.

గోదావరి బోర్డు
సమావేశం
21కి వాయిదా
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 12: రెండు తెలుగు రాష్ట్రాల్లో గోదావరి జలాల వినియోగం, నిర్మాణమవుతున్న ప్రాజెక్టులు, ప్రతిపాదన దశలో ఉన్న పథకాలపై మంగళవారం జరగాల్సిన గోదావరి నదీ జలాల యాజమాన్య బోర్డు సమావేశం 21వ తేదీకి వాయిదా పడింది. తెలంగాణ రాష్ట్ర సాగునీటిపారుదల శాఖ ఇంజనీర్లు, అంతరాష్ట్ర ప్రాజెక్టు నిర్మాణం విషయమై మహారాష్టక్రు వెళ్లినందు వల్ల ఈ బోర్డు సమావేశం వాయిదా పడింది. ఈ సమావేశంలో తెలంగాణలో గోదావరి నదిపై నిర్మాణమవుతున్న ఆరు పథకాలు, ఆంధ్రాలో 12 ప్రాజెక్టులపై సమగ్రంగా చర్చించడం, సీలేరు జల విద్యుత్ ఉత్పత్తి పంపకాలపై చర్చించాల్సి ఉంది.