తెలంగాణ

వీసీ పోస్టులకు తప్పుడు వివరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 11: తెలంగాణలో వర్శిటీ ఉపాధ్యక్షుల నియామకానికి వచ్చిన దరఖాస్తుల్లో పలువురు అధ్యాపకులు తప్పుడు వివరాలను బయోడాటాల్లో నింపినట్టు ప్రభుత్వం దృష్టికొచ్చింది. వైస్ ఛాన్సలర్లుగా అత్యంత నిబద్ధత, నైతిక విలువలు, అత్యున్నత ప్రమాణాల విద్యార్హతలున్నవారు, పరిశోధనల్లో ఆరితేరిన వారిని దరఖాస్తు చేసుకోమని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పొట్టి శ్రీరాములు, జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ వర్శిటీల ఉపాధ్యక్ష పదవుల భర్తీకి దరఖాస్తులు స్వీకరించింది. తాజా సమాచారం మేరకు అత్యధికంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్శిటీ, కాకతీయ వర్శిటీలకు దరఖాస్తులు రాగా, అత్యల్పంగా పాలమూరు వర్శిటీకి వచ్చాయని తెలిసింది. కాగా దరఖాస్తు చేసినవారిలో అత్యధికంగా వివిధ వర్శిటీల్లో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న వారే ఉన్నట్టు సమాచారం. గతంలో విసి పోస్టుకు దరఖాస్తు చేయాలంటే పదేళ్లు పైబడినవారికే అవకాశం ఉండేది. నేడు సీనియారిటీ పరిమితిని ఐదేళ్లకు కుదించడంతో 2009 తర్వాత ప్రొఫెసర్లయిన వందలాది మంది సైతం దరఖాస్తులు పెట్టుకున్నారు. నేడో రేపో రిటైర్ అవుతారన్న వారే గతంలో వీసీ పదవులకు దరఖాస్తులు పంపించేవారు. అయితే నేడు ఉద్యోగ మేళా మాదిరి సంపూర్ణ అర్హతలు లేనివారు కూడా దరఖాస్తులను పంపించినట్టు తెలిసింది. ప్రభుత్వానికి వచ్చిన దరఖాస్తులను ఒక్కోదాన్ని పరిశీలించే ప్రక్రియ ప్రారంభం కాగానే వాటిని గమనిస్తున్న అధికారులు హుతాశులవుతున్నారు. చాలామంది తమ అర్హతలు మొదలు వృత్తి నైపుణ్య అర్హతలు, బోధన శాస్త్ర అర్హతలు, అవార్డులు, జాతీయ అంతర్జాతీయ సెమినార్లు, ప్రచురణలు, ప్రచురితమైన గ్రంథాలు, పరిశోధనాత్మక జర్నల్స్‌లో ముద్రితమైన పరిశోధనా పత్రాలు, పేటెంట్లు, భారీ పరిశోధనలు, మధ్యతరహా పరిశోధనలు, చిన్నతరహా పరిశోధనలు, ఎంఫిల్ విద్యార్థులు, పిహెచ్‌డిలు, జాతీయ అంతర్జాతీయ అవార్డులు తదితర వివరాల్లో కావాలనే తప్పుడు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం చాలా స్పష్టంగా సామజిక నేపథ్యం, ప్రొఫెసర్‌గా పనిచేసిన కాలం, ప్రస్తుత హోదా, బోధన అనుభవం, అసిస్టెంట్ ప్రొఫెసర్ 2గా, అసోసియేట్ ప్రొఫెసర్‌గా బోధనానుభవం, ప్రొఫెసర్‌గా బోధనానుభవం, మొత్తం బోధనానుభవం, రిటైర్మెంట్‌కు ఇంకా ఉన్న సర్వీసు వివరాలు కోరింది. అయితే వీటికి చాలా స్పష్టమైన రికార్డులు ఉన్నా కొంతమంది తప్పుడు సమాచారం దాఖలు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. అలాగే ప్రసిద్ధిగాంచిన రీసెర్చి ప్రచురణలు అని ప్రభుత్వం కోరగా, దినపత్రికల్లో సాయంకాల పత్రికల్లో వచ్చిన ఆర్టికల్స్‌ను కూడా కొంతమంది తమ పరిశోధన పత్రాలుగా చూపించినట్టు తెలిసింది. కొంతమంది లెక్కకు మిక్కిలిగా గ్రంథాలను రాయడం, ప్రచురణలుపైనే దృష్టిపెట్టగా, మరికొందరు బోధనపై దృష్టి పెట్టడంతో ముద్రిత గ్రంథాలు తక్కువగా ఉన్నాయి. వీసీ పదవికి వచ్చేసరికి ఏదోకటి చూపించుకోవాల్సిన పరిస్థితుల్లో తప్పుడు సమాచారం ఇచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. పుస్తకాలు ఎడిట్ చేసినవి, ముద్రించినవి, అలాగే పరిశోధనానుభవానికి సంబంధించి సమగ్ర వివరాల్లో కూడా కొంతమంది తమకు సంబంధంలేని వివరాలు రాసినట్టు తెలిసింది. అవార్డులు కూడా తమకు వచ్చిన చోటామోటా అవార్డులను కూడా పేర్కొన్నారని సమాచారం. మరీ ముఖ్యంగా సెమినార్లు విషయంలో ఎలాంటి ఆధారాలులేకున్నా సెమినార్ల పేర్లు రాసి హాజరైనట్టు పేర్కొన్నారు. సెమినార్లకు ఎప్పుడు హాజరయ్యారో? ఏ రోజు ఎక్కడ పాల్గొన్నారో వంటి వివరాలు కూడా ఇవ్వలేదని తెలిసింది. ఆ రోజు సెమినార్లలో ఉన్నారా? లేదా? అన్నది వారి అటెండెన్స్ రిజిస్టర్‌తో పోల్చి పరిశీలిస్తే బండారం బయటపడుతుందని చెబుతున్నారు. వివిధ ప్రసిద్ధి సంస్థలతో అనుబంధం విషయంలోనూ సరైన సమాచారం ఇవ్వలేదని తెలిసింది.
వాస్తవాలతో సరిపోల్చాలి
వాస్తవ రికార్డులతో అభ్యర్ధులు నింపిన బయోడాటా వివరాలను సమగ్ర పరిశీలన జరిపించిన తర్వాతనే ధృవీకరించాలని, గతంలోనూ ఎలాంటి పరిశీలన లేకుండా నియమించి ప్రాప్తకాలజ్ఞతతో ఇద్దరు వీసీలను బలవంతంగా తొలగించాల్సి వచ్చిందని పలువురు అంటున్నారు.