తెలంగాణ

సంక్షేమంలో అగ్రస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 9: సంక్షేమ రంగంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా మల్కాజిగిరి నియోజక వర్గం సమావేశం అల్వాల్‌లోని ఎమ్మెల్యే కనకారెడ్డి నివాసంలో శనివారం జరిగింది. ఈ సమావేశంలో ఈటల మాట్లాడుతూ పేదలు, సామాన్యుల సంక్షేమానికే ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను గత పాలకులు మనుషులుగా చూడలేదని, వాళ్లు కూడా మనుషులే అని టిఆర్‌ఎస్ ప్రభుత్వం తగిన గుర్తింపు ఇచ్చిందని తెలిపారు. గతంలో ఆరువేల 500 రూపాయల జీతం ఉన్నవారికి 12వేలు, 7500 రూపాయల జీతం ఉన్నవారికి 15వేలు, పదివేలు ఉన్నవారికి 17వేల 500 రూపాయలుగా వేతనాలు పెంచినట్టు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బిసిలకు స్వయం ఉపాధి పథకాల కింద ఇచ్చే రుణాలకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ గతంలో నామమాత్రంగా ఉండేదని, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పెంచినట్టు చెప్పారు. గతంలో కార్పొరేషన్లు లక్ష రూపాయల రుణం ఇస్తే 30వేల రూపాయలు సబ్సిడీ ఇచ్చేవారని, టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇప్పుడు లక్ష రుణానికి 80వేల సబ్సిడీ ఇస్తోందని తెలిపారు. రెండు లక్షల రుణానికి లక్షా 40వేలు మాఫీ, ఐదు లక్షల రుణానికి మూడు లక్షల మాఫీ, పది లక్షల రుణానికి ఐదు లక్షలు మాఫీ చేస్తోందని తెలిపారు. గత ప్రభుత్వం రుణాల కోసం 150 కోట్ల రూపాయలు కేటాయిస్తే, తెలంగాణ ప్రభుత్వం 1100 కోట్ల రూపాయలు కేటాయించినట్టు చెప్పారు. 18నెలల కాలంలో తెలంగాణలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్టు చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ఘన విజయం సాధిస్తుందని, నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేసేందుకు టిఆర్‌ఎస్‌కు అండగా నిలవాలని ప్రజలను కోరారు.