తెలంగాణ

సందడే సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 9: గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ కోసం పార్టీలన్నీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నేపథ్యంలో, నోటిఫికేషన్ వెలువడిన మరుసటి రోజునుంచే రాజధానిలో హడావుడి కనిపిస్తోంది. రిజర్వేషన్లు, షెడ్యూలు ప్రకటనతో ఆశావాహులు పార్టీ కార్యాలయాల వద్ద క్యూ కడుతుండటంతో, సందడి నెలకొంది. కాంగ్రెస్ ఆఫీస్ గాంధీభవన్‌కు శనివారం పెద్దఎత్తున అనుచరులతో ఆశావహులు తరలిరావడంతో ఆవరణ కిక్కిరిసింది. తెదేపా, భాజపా, మజ్లీస్ కార్యాలయాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. అధికార తెరాస కార్యాలయమైన తెలంగాణ భవన్ పరిస్థితి చెప్పాల్సిన పని లేదు. ఇటీవల వరంగల్ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అనూహ్యంగా భారీ మెజారిటీతో గెలుపొందడంతో, గ్రేటర్ ఎన్నికల్లో టిక్కెట్ వస్తే చాలు గెలుపొందినట్టేనన్న నమ్మకంతో అనేకమంది ఆశావాహులు తెలంగాణ భవన్‌కు చేరుకుంటున్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్, భాజపా నేతలు కంగుతినేలా డిపాజిట్లు గల్లంతైన సంగతి తెలిసిందే. అయితే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు టిక్కెట్ల కోసం పార్టీ నేతలు అంతగా పోటీ పడతారో లేదోనన్న భయాన్ని, అనుమానాన్ని పటాపంచలు చేస్తూ ఆశావాహులు పెద్దసంఖ్యలో తరలి వస్తున్నారు. కాంగ్రెస్ ఆశావాహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ గురువారం నుంచే ఆరంభమైంది. మూడు రోజులుగా టికెట్ ఆశిస్తున్న నేతలు అనుచరులను వెంటతీసుకుని డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా గాంధీభవన్‌కు వచ్చి దరఖాస్తులు అందించి వెళ్తున్నారు. ఇప్పటికే 500లకు పైగా దరఖాస్తులు అందినట్టు సమాచారం. తెలుగు దేశం, భారతీయ జనత పార్టీ కార్యాయాలకు ఆశావాహులు పెద్దసంఖ్యలో వచ్చి ముఖ్య నేతలను కలిసి దరఖాస్తులు అందిస్తున్నారు. మిత్రపక్షాలైన తెదేపా -్భజపా ముఖ్య నేతలు సీట్ల సర్దుబాటు కోసం చర్చల ప్రక్రియ ప్రారంభించారు. చర్చలు కొలిక్కి వచ్చేందుకు రెండు మూడు రోజులు పడుతుందని ఇరు పార్టీల నేతలు అంటున్నారు. చర్చల సందర్భంగా ఫలానా సీటు తమ పార్టీకే వచ్చేలా చూడాలని, ఆ సీటును తనకు కేటాయిస్తే తప్పకుండా విజయం సాధించి చూపిస్తానని కొంతమంది ఆశావాహులు నేతలపై వత్తిడి తెస్తున్నారు.
ఇలాఉండగా దారు-ఉల్-సలాంలోని మజ్లీస్ పార్టీ కార్యాలయం టిక్కెట్లు ఆశిస్తున్న వారితో నిండిపోయింది. ఆశ్చర్యం ఏమిటంటే ఆశావాహుల్లో ముస్లింలతో సమానంగా హిందువులూ ఉన్నారు. పాతనగరంలోని పలు డివిజన్లు బీసీ మహిళలకు కేటాయించడంతో, అనేకమంది మహిళలు మజ్లీస్ పార్టీ కార్యాలయానికి వచ్చి సీట్ల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జిహెచ్‌ఎంసి 150 డివిజన్లలో 50శాతం మహిళలకు రిజర్వుకావడంతో, మజ్లీస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు బలమైన మహిళా అభ్యర్థుల కోసం వెతుకులాట ప్రారంభించాయి. పోటీ చేసేందుకు చాలామంది ఉత్సాహం చూపుతున్నా, స్థానిక డివిజన్‌లో సమాజ సేవలో పాల్గొంటూ కొంతైనా పలుకుబడి ఉన్న వారి సంఖ్య ఆశించిన విధంగా ఉండటం లేదు. రిజర్వేషన్ ఉన్నందుకే పోటీకి వచ్చిన వారి సంఖ్య కూడా కనిపిస్తోంది. ఇంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటూ, ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా, మరేదైనా ప్రైవేటు ఉద్యోగం చేసుకునే వారు, గృహిణిగా ఉన్న వారు భర్త లేదా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో టిక్కెట్ కోసం పార్టీ కార్యాలయాలకు వస్తున్నారు. కొంతమంది తమకు పరిచయమున్న నేతలతో టిక్కెట్ల కోసం తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
నేడు మహిళా భేరీ: శారద
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల దృష్ట్యా ఆదివారం మధ్యాహ్నం గాంధీభవన్ ఆవరణలోని ప్రకాశం హాలులో మహిళా భేరీ సదస్సు నిర్వహించనున్నట్లు టిపిసిసి మహిళా విభాగం అధ్యక్షురాలు నేరెళ్ళ శారద తెలిపారు. భేరీకి టిపిసిసి అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతారని ఆమె చెప్పారు.
chitram...
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సిత్రాలు మొదలయ్యాయి. గుజరాతీయులు
ఇష్టపడే పటేల్ గర్భా కార్యక్రమం శనివారం నగరంలో జరిగింది. కార్యక్రమానికి హాజరై
గుజరాతీ మహిళలతో సంప్రదాయ నృత్యం చేస్తున్న తెరాస ఎంపీ కవిత. రాజధానిలో
పెద్ద సంఖ్యలోవున్న గుజరాతీ ఓట్లకు ఇదొక ఆకర్షణ మంత్రం.