తెలంగాణ

హెల్మెట్ తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 9: రాజధానిలో గత ఏడాదికంటే ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు తగ్గాయని, మెట్రో పాలిటన్ నగరాల్లో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా వినియోగించాలని నగర కమిషనర్ మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. హెల్మెట్ ధారణతోనే ప్రమాదాలు అరికట్టవచ్చని, హెల్మెట్ ధరించకపోవడంతోనే 25శాతం ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. హెల్మెట్ ధారణపై అవగాహన కల్పించేందుకు శనివారం పీపుల్స్ ప్లాజా నుంచి చార్మినార్ వరకూ సుమారు ఐదువందల బైక్‌లతో యువకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలోని ప్రధాన పట్టణాల్లో హెల్మెట్ ధారణ పెరిగిందని, హైదరాబాద్‌లోనే హెల్మెట్ వాడకం తగ్గిందన్నారు. ప్రమాదాల బారినపడకుండా ఉండాలంటే హెల్మెట్ తప్పనిసరన్నారు.