తెలంగాణ

అమెరికాలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 8: ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన ఓ విద్యార్థి మార్కులు తక్కువ వచ్చాయని కలతచెంది ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని ఆకస్మిక మృతితో హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఉప్పల్ సర్కిల్‌లోని రామంతాపూర్ ఇందిరానగర్‌లో నివసిస్తున్న మెదక్ జిల్లా చేగుంట మండలం పరిధిలోని మక్కరాజ్‌పేట్‌కు చెందిన బండి ఉమాశంకర్ పెద్ద కుమారుడు శివకరణ్(22) హైదరాబాద్ ఎద్దుమైలారం నారాయణ త్రిపుల్ ఐటి క్యాపంపస్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీర్ పూర్తి చేశాడు. చదువులో చురుకైన విద్యార్థి శివకరణ్ క్యాంపస్ సెలక్షన్‌లో ఉద్యగం సంపాదించాడు. అయినప్పటికీ పెద్ద ఉద్యోగం చేయాలనే తపనతో ఎంఎస్ చేయడానికి గత ఆగస్టు నెల అమెరికా వెళ్లాడు. నార్త్ కరోలినా విశ్వవిద్యాలంలో ఎంఎస్ చదువుతున్నాడు. అనారోగ్యంతో ఫస్ట్ సెమిస్టర్‌లో తక్కువ మార్కులు వచ్చాయి. దీంతో అతడు మానసికంగా కుంగిపోయాడు. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి తీవ్రంగా కుమిలిపోయాడు. అవేమి పట్టించుకోవద్దని ధైర్యంగా ఉండాలని తల్లిదండ్రులు ధైర్యాన్ని ఇచ్చారు. అయినప్పటికీ అతడు నివసించే వసతి గృహంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శివకరణ్ మరణవార్త తెలియడంతో హైదరాబాద్‌లో నివసిస్తున్న తల్లిదండ్రులు, బందువులు కన్నీళ్ల పర్యతమయ్యారు.
రామంతాపూర్ ఇందిరానగర్‌లో నివసిస్తున్న బండి ఉమాశంకర్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగి. అతని భార్య పద్మ వెటర్నరి డిపార్ట్‌మెంట్‌లో ఔట్‌సోర్సింగ్‌లో పని చేస్తుంది. వీరికి ఇద్దరు కుమారులు శివకరణ్, శశిధర్ ఉన్నారు. చిన్న కుమారుడు సిఏ చేస్తున్నాడు. ఇంటికి పెద్ద కుమారుడైన శివకరణ్ చిన్నప్పటి నుండే క్లాస్ ఫస్ట్. హబ్సిగూడ జాన్సన్ గ్రామర్ స్కూల్‌లో ఇంటర్ వరకు పూర్తిచేయగానే నారాయణ కళాశాల యాజమాన్యం అతన్ని ఉచిత కోచింగ్ ఇచ్చి త్రిపుల్ ఐటిలో చదివించింది. స్నేహితులు, బందువులచే శభాష్ అనిపించుకుంటున్న చురుకైన శివకరణ్ ఆత్మహత్య చేసుకోవడంతో దిగ్భాత్రిని వ్యక్తం చేశారు.

అమెరికాలో ఆత్మహత్య చేసుకున్న
శివకరణ్ (ఫైల్ ఫొటో)