తెలంగాణ

18నెలల ప్రగతి.. కేంద్రం వివక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 8: ఒకవైపు 18నెలల కాలంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని వివరిస్తూ మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తెలంగాణపై చూపుతున్న వివక్షనే ప్రధాన ఎన్నికల ప్రచార అస్త్రాలుగా ఉపయోగించాలని టిఆర్‌ఎస్ నిర్ణయించింది. గ్రేటర్ ఎన్నికల ప్రచార వ్యూహాంపై నిర్ణయం తీసుకున్నారు. 18నెలల టిఆర్‌ఎస్ పాలనా కాలంలో సాధించిన అభివృద్ధిపై గణాంకాలతో నివేదిక రూపొందించారు. వీటిని మంత్రులు, నియోజక వర్గాల్లో ప్రచార బాధ్యతలు చూస్తున్న ఎమ్మెల్యేలు, నాయకులకు అందజేస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో ప్రగతి నివేదికలు మొత్తం నాయకుల చేతికి అందుతాయని, ఎన్నికల్లో ప్రచారంలో ఈ అంశాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించారు.
కెటిఆర్ నాయకత్వంలో ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో సాధించిన అభివృద్ధితో పాటు 18నెలల్లో టిఆర్‌ఎస్ సాధించిన అభివృద్ధిని ప్రధానంగా వివరించాలని నిర్ణయించారు. 60 ఏళ్లలో కాంగ్రెస్, టిడిపిలు సాధించలేని ప్రగతి 18నెలల్లో టిఆర్‌ఎస్ ప్రభుత్వం సాధించిందని టిఆర్‌ఎస్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. కాంగ్రెస్, టిడిపి పాలనను విమర్శిస్తూ, మరోవైపు తెలంగాణ పట్ల బిజెపి చూపుతున్న వివక్షను ప్రధానంగా ప్రస్తావిస్తామని టిఆర్‌ఎస్ నాయకులు తెలిపారు. ఆంధ్రకు ఎంతో కొంత చేసినా తెలంగాణ విషయంలో మాత్రం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చూపుతోందని విమర్శించారు. హైకోర్టు విభజనతో పాటు తెలంగాణకు సంబంధించి ఏ సమస్యను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికి ప్రధానమంత్రిని మూడుసార్లు ఆహ్వానించినా తెలంగాణకు రాలేదని టిఆర్‌ఎస్ మంత్రులు విమర్శించారు. వంద రోజుల్లో తెలంగాణ ఇస్తామన్న వారు అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా తెలంగాణకు చేసిందేమీ లేదని, వివక్ష చూపుతున్నారని విమర్శించారు. హైదరాబాద్ నగరంలో ఇప్పటి వరకు చేసిన అభివృద్ధిని వివరించడంతో పాటు హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికను వివరించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌కు సంబంధించి భవిష్యత్తు ప్రణాళికలతో ఎన్నికల ప్రణాళిక రూపొందించారు. 25వేల కోట్ల రూపాయల వ్యయంతో హైదరాబాద్‌లో అద్భుతంగా స్కైవేలు, ఫ్లై ఓవర్లు నిర్మించడానికి సంబంధించి ప్రణాళికను వివరించనున్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోను త్వరలోనే విడుదల చేస్తామని టిఆర్‌ఎస్ నాయకులు తెలిపారు.
హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, షీ టీమ్స్ ఏర్పాటు, విద్యుత్ బకాయిల రద్దు, ఇంటి పన్ను రద్దు వంటి అంశాలను వివరించనున్నట్టు చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 34లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నామని నియోజక వర్గాల వారిగా, డివిజన్ల వారిగా ఎంత మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నది లెక్కలు తేల్చారు. నాయకులు ప్రచారానికి వెళ్లినప్పుడు ఈ అంశాలను ప్రధానంగా ప్రస్తావించాలని పార్టీ నాయకత్వం ఆదేశించింది. నగరంలో విద్యుత్ కోత లేకుండా 24 గంటల విద్యుత్ పంపిణీ తమ ప్రభుత్వం సాధించిన విజయం అని కెటిఆర్ తెలిపారు. మరోవైపు టిఆర్‌ఎస్ ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారిని సైతం ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది.