తెలంగాణ

నకిలీ పాస్‌పుస్తకాలతో భూ విక్రయం కేసులో ఇద్దరు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 8: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం తట్టియన్నారం గ్రామంలో సర్వే నెం.108 నుంచి 111 వరకు ఉన్న భూమిలో కొంత భూమిని నకిలీ భూమి పాస్‌పుస్తకాలతో అమ్మివేసిన కేసులో ఇద్దరు సోదరులను హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం డిటెక్టివ్ విభాగం జాయింట్ కమిషనర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కె.కరుణకర్‌రెడ్డి, కె.నర్వోత్తమ్‌రెడ్డిలను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కె.ప్రతాప్‌రెడ్డి కాగా, ఆయన కుమారులు కరుణాకర్‌రెడ్డి, నర్వోత్తమ్‌రెడ్డి రెండు, మూడవ నిందితులుగా నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరిని అరెస్టు చేసి శుక్రవారం 12వ అదనపు సిఎంఎం కోర్టులో హాజరు పర్చగా రిమాండ్ విధించినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తట్టియన్నారంలోని సర్వే నెం.108 నుంచి 111లో ఉన్న 70 ఎకరాల 30 గుంటల భూమి ఉంది. ప్రతాత్‌రెడ్డి తన ఇద్దరు కుమారుల సహాయంతో వసంత ఎడ్యుకేనల్ సొసైటీకి 10 ఎకరాల భూమిని 2002 సెప్టెంబర్ 27న నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకాలను సృష్టించి వాటి ఆధారంగా విక్రయించారు. ఈ కేసును విచారించిన డిటెక్టివ్ విభాగం అధికారుల నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసును సిసిఎస్ డిడి ఎసిపి జి.జోగయ్య దర్యాప్తు చేశారు.