తెలంగాణ

ప్రగతి సాగుచేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జనవరి 7: వ్యవసాయాధారిత దేశమైన భారత్‌లో వందేళ్ల క్రితంనాటి సాగు వైభవాన్ని తెచ్చే కృతనిశ్చయంతో ప్రధాని నరేంద్ర మోదీ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ పేర్కొన్నారు. వ్యవసాయ యోగ్యమైన భూమికి సాగు నీరు అందించాలని ప్రణాళికబద్ధంగా కృషి చేస్తున్నట్టు చెప్పారు. మెదక్ మండల కేంద్రమైన ములుగు గ్రామ శివారులోని 1300 ఎకరాల అటవీ భూమిలో 1823 కోట్ల అంచనాతో నిర్మించ తలపెట్టిన శ్రీ కొండా లక్ష్మణ్ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి కెసిఆర్‌తో కలిసి గురువారం మధ్యాహ్నం శంఖుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశంలో చూసినా మట్టిని మట్టిగా పిలుస్తారని, ఒక్క భారతదేశంలో మాత్రమే భూమిని కన్నతల్లితో సమానంగా గౌరవిస్తారన్నారు. అలాంటి దేశంలో వ్యవసాయం చిన్నాభిన్నమైందని, ఇది గమనించిన కేంద్రం అనేక పథకాలు ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చిన మొదటిదఫాలో నాటి ప్రధాని వాజపేయి ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల మారుమూల గ్రామాలన్నీ బిటి రోడ్లకు నోచుకున్నాయన్నారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ వ్యవసాయంపై దృష్టిసారించి ప్రధానమంత్రి గ్రామ సంచాయ్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టి రైతు ప్రభుత్వంగా చాటి చెప్పారన్నారు. తెలంగాణ గాంధీగా పేరుగాంచిన కొండా లక్ష్మణ్ పేరిట ఉద్యాన వర్శిటీ ఏర్పాటు అభినందనీయమన్నారు. తెలుగు రాష్ట్రాలు విడిపోకముందు ఆంధ్రకు వ్యవసాయ వర్శిటీ మంజూరైందని, తెలంగాణలో అలాంటి విద్యాలయం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉద్యాన వర్శిటీని కేంద్రం మంజూరు చేసిందన్నారు. వర్శిటీ నిర్మాణం పూర్తయ్యే వరకూ కేంద్రం సహకారం అందిస్తుందన్నారు. తక్కువ నీరు ఎక్కువ ఉత్పత్తి నినాదంతో బిందు సేద్యం చేపట్టేలా రైతులకు అవగాహన కల్పించడంతోపాటు నిధులను సమకూర్చడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. రైతులు కష్టపడి సాగు చేసిన పంటకు దళారి వ్యవస్థవల్ల గిట్టుబాటు పొందలేక పోతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఏ రాష్ట్రంలో ఏ పంటకు ఎంత మద్దతు ధర ఉందనే విషయం ప్రతి రైతుకు తెలియజేయాలన్న లక్ష్యంతో ఈ-మార్కెటింగ్‌ను ప్రవేశపెట్టబోతున్నట్టు చెప్పారు. రైతులు సంపన్నులుగా కావాలంటే కొత్త రైతును తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వర్శిటీకి మంజూరు చేసిన 75 కోట్లలో సగం నిధులు విడుదలయ్యాయని, నెలాఖరులోగా మొత్తం నిధులు అందిస్తామన్నారు. కార్యక్రమంలో కెసిఆర్ మాట్లాడుతూ అన్ని రకాల పంటలు సాగు చేసుకునే యోగ్యమైన భూములు రాష్ట్రంలో ఉన్నాయని, దీన్ని ఉపయోగించుకుని రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా తీర్చిదిద్దుతామన్నారు. ఉద్యాన పంటల సాగులో మెళకువలు నేర్పేందుకు వర్శిటీని హబ్‌గా మారుస్తామన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, హరీష్‌రావు, జోగు రామన్న, డిప్యూటి స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... ములుగు బహిరంగ సభలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి రాధా మోహన్ సింగ్