తెలంగాణ

లోయలో పడి న బస్సు ఒకరు మృతి 16 మందికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,జనవరి 5: ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్ సమీపంలో నామనగర్ వద్ద ఎర్రవాగు వంతెన పైనుండి ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తాపడిన సంఘటనలో ఒకరు మృతిచెందగా, 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన వివరాల ప్రకారం మంగళవారం ఉదయం 5.30 గంటలకు ఆసిఫాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (ఏపి28జెడ్ 3433) కాగజ్‌నగర్ నుండి బెజ్జూర్ (పాపన్నపేట్)కు బయల్దేరింది. మొత్తం 32 మంది ఈ పల్లెవెలుగు బస్సులో ప్రయాణిస్తుండగా నామనగర్ సమీపంలో గల ఎర్రవాగు వంతెనపైకి చేరుకోగానే డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం కారణంగా బస్సు అదుపుతప్పి ఒక్కసారిగా వంతెన డివైడర్లను ఢీకొట్టి దూసుకొని వెళ్తూ వాగులోయలో బోల్తాకొట్టింది. ప్రయాణికులు ఏంజరిగిందో తెలుసుకునేలోపే క్షతగాత్రుల హాహాకారాలు, రక్తపుటేరులతో సంఘటనా స్థలం రక్తసిక్తంగా మారింది. ఈ ఘటనలో బెజ్జూర్ మండలం గంగారాం గూడకు చెందిన అలం శ్రీనివాస్ (35) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, కండక్టర్ పెద్ది రవీందర్ చేయి విరిగిపోయింది. దీంతో పాటు బస్సులో ప్రయాణిస్తున్న కాగజ్‌నగర్, ఛత్తీస్‌గఢ్, దహెగాం ప్రాంతాలకు చెందిన 15 మంది ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే గ్రామస్థులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను అంబులెన్స్, ప్రైవేట్ వాహనాల ద్వారా కాగజ్‌నగర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ సర్వేశం వెంటనే పోలీసులకు లొంగిపోగా, గాయపడిన వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో వీరిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. సంఘటన జరిగిన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే కోనప్ప హుటాహుటిన ఆసుపత్రికి చేరుకొని బాధితులను పరామర్శించి, మెరుగైన చికిత్స కోసం ఆదేశించారు.

లోయలో పడిన ఆర్టీసీ బస్సు.
మృతి చెందిన శ్రీనివాస్