తెలంగాణ

నల్లగొండలో వాడిన గులాబి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, డిసెంబర్ 30: నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన ప్రత్యర్ధి టిఆర్‌ఎస్ అభ్యర్ధి తేరా చిన్నపరెడ్డిపై 193 ఓట్లతో విజయం సాధించారు. జిల్లా కేంద్రంలోని డ్వామా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ఓట్ల లెక్కిం పు కార్యక్రమం ప్రారంభం నుండి కూడా రాజగోపాల్‌రెడ్డి ఆధిక్యతలో కొనసాగారు.
తొలి రౌండ్ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనే గెలు పు కోటా ఓట్లు 548 ఓట్లకుగాను రాజగోపాల్‌రెడ్డి 642 ఓట్లు సాధించడంతో ఆయన గెలుపొందినట్లుగా ప్రకటించారు. టిఆర్‌ఎస్ అభ్య ర్ధి చిన్నపరెడ్డికి 449 ఓట్లు రాగా, స్వతంత్ర అభ్యర్ధులు మిట్టా పురుషోత్తంరెడ్డికి రెండు, సుం కరి మల్లేశ్‌గౌడ్‌కు ఒక ఓటు దక్కింది. మొత్తం పోలైన 1100 ఓట్లలో ఆరు ఓట్లు చెల్లకుండా పోయాయి. రెండు గంటల్లోనే ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తవ్వగా విజేత రాజగోపాల్‌రెడ్డికి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి, రిటర్నింగ్ అధికారి ఎ.వెంకట్రావు గెలుపు ధృవీకరణ పత్రాలను అందించారు. కాగా, ఈ ఎన్నికల్లో అధికార టిఆర్‌ఎస్ పార్టీకి మొత్తం స్థానిక ఓటర్లు 1110 మందిలో కేవలం 138 సంఖ్యాబలమే ఉన్నప్పటికీ గెలుపు కోసం గత కొంత కాలంగా పెద్ద ఎత్తున విపక్షాల నుండి ఫిరాయింపులను ప్రోత్సహించింది. తే రా గెలుపు కోసం జిల్లా మంత్రి జి.జగదీష్‌రెడ్డి సర్వశక్తులొడ్డినా ఫలితం ప్రతికూలంగా రావడం టిఆర్‌ఎస్‌కు షాక్ గురిచేసింది. నామినేషన్లకు ముం దునుండే టిఆర్‌ఎస్ క్యాంపులు నిర్వహించి మెజార్టీ ఓటర్లను క్యాంపుల్లో పెట్టినా క్రాస్‌ఓటింగ్ ఆ పార్టీ విజయావకాశాలకు గండికొట్టింది. అటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి టిఆర్‌ఎస్‌లోకి వల స వెళ్లిన కాంగ్రెస్ స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు సిపిఐ, సిపిఎం, బిజెపి, టిడిపిలోని ఓ వర్గం ఓటర్లు సహకరించడంతో ఆయన విజయం సాధ్యమైంది. అదిగాక సొంత జిల్లాలో ఓడితే రాష్ట్ర స్థాయిలోనూ, ఢిల్లీ అధిష్టానం దృష్టి లో పలుచనవుతామని భావించిన పిసిసి చీఫ్ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సిఎల్పీ నేత కె.జానారెడ్డి, ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపిలు గుత్తా, పాల్వాయి, మాజీ మంత్రి ఆర్.దామోదర్‌రెడ్డి ఐక్యంగా పనిచేయడం కూడా రాజగోపాల్‌రెడ్డి గెలుపునకు దోహదం చేసింది. ఏదేమైనా తెలంగాణలో అన్ని ఎన్నికల్లోనూ టిఆర్‌ఎస్ చేతిలో వరుస ఎదురుదెబ్బలు తింటున్న కాంగ్రెస్‌కు నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు పార్టీకి కొత్త జవసత్వాలను, క్యాడర్‌కు ఉత్సాహాన్ని అందించినట్లయింది.

నల్లగొండలో ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి విజయోత్సవ ర్యాలీ దృశ్యాలు

నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ధ్రువీకరణ పత్రం అందిస్తున్న రిటర్నింగ్ అధికారి ఎ.వెంకట్రావు

ధర్మమే గెలిచింది

అధికార పార్టీ అడ్డదారులు తొక్కింది
ఓటర్ల చైతన్యమే కాంగ్రెస్‌ను గెలిపించింది
ధ్వజమెత్తిన కోమటిరెడ్డి బ్రదర్స్
ఘనంగా విజయోత్సవ ర్యాలీ

ఆంధ్రభూమి బ్యూరో
నల్లగొండ, డిసెంబర్ 30: జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విజయంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెల్లుబికింది. ఇటీవలి కాలంలో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అందుకున్న అతిపెద్ద విజయం కావడంతో సహజంగానే ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. రాజగోపాల్‌రెడ్డి విజయం పట్ల జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు, డివిజన్ కేంద్రాల్లో ఆ పార్టీ శ్రేణులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించి బాణసంచా పేల్చి స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. జిల్లా కేంద్రం నల్లగొండలో కౌంటింగ్ హాల్ డ్వామా కార్యాలయం నుండి మొదలుకుని రాజగోపాల్‌రెడ్డి, సోదరుడు వెంకట్‌రెడ్డిల విజయోత్సవ ర్యాలీ నల్లగొండ గడియారం సెంటర్ వరకు భారీ ఎత్తున కొనసాగింది. ఈ విజయోత్సవ ర్యాలీలో కోమటిరెడ్డి బ్రదర్స్ కార్యకర్తలకు, స్థానిక ప్రజలకు అభివాదం చేస్తూ సాగారు. గడియారం సెంటర్‌లో పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పిదప కార్యకర్తలనుద్దేశించి కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రసంగిస్త్తూ టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు టిఆర్‌ఎస్ అధర్మంపై సాధించిన ధర్మం విజయమంటూ అభివర్ణించారు. తగినంత బలం లేకున్నా పోటీకి దిగిన టిఆర్‌ఎస్ స్థానిక ఓటర్లను ప్రలోభాలకు, బెదిరింపులకు గురిచేసి గెలుపొందేందుకు అడ్డదారులు తొక్కినా వారు చైతన్యంతో వ్యవహరించి టిఆర్‌ఎస్‌కు, జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డి గుణపాఠం చెప్పారన్నారు. ఎన్నికల్లో ఇచ్చి న హామీని కెసిఆర్ ప్రభుత్వం ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. పత్తికి, ధాన్యానికి మద్దతు ధర లేదని రైతులు ఆత్మహత్యల పాలవుతున్నారన్నారు. కాంగ్రెస్ హయాం లో తెచ్చి న సాగు, తాగునీటి ప్రాజెక్టులు మిన హా టిఆర్‌ఎస్ 18 నెలల పాలనలో ఒక్క పని చేపట్టలేదన్నారు. జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యేలు రౌడీయిజాన్ని సాగిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ఇకనైనా కెసిఆర్ వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. జిల్లా ఎమ్మె ల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు 2019 ఎన్నికల గెలుపునకు ప్రారంభమన్నా రు. అనంతరం ఎంపి గుత్తా ఇంట్లో జరిగిన విజయోత్సవ కార్యక్రమంలో ఎంపి గుత్తా, మాజీ ఎంపి అంజన్‌కుమార్ యాదవ్, మా జీ మంత్రి ఆర్. దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఎన్. పద్మావతి, ఎన్. భాస్కర్‌రావు, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ ఎమ్మెల్సీగా గెలిచిన రాజగోపాల్‌రెడ్డిని అభినందనల్లో ముంచెత్తారు.

విలేఖరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి

ఖమ్మంలో టిఆర్‌ఎస్‌దే విజయం
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, డిసెంబర్ 30: ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని అధికార టిఆర్‌ఎస్ పార్టీ చేజిక్కించుకుంది. పార్టీ ఆవిర్భవించిన తర్వాత గత సాధారణ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో జలగం వెంకట్రావు విజయం సాధించగా, ఆ తర్వాత అనేక మంది ఆ పార్టీలో చేరినప్పటికీ పార్టీ అభ్యర్థిగా ఖమ్మం జిల్లాలో పోటీ చేసి గెలిచిన ఘనత బాలసాని లక్ష్మీనారాయణకే దక్కింది. ఈ నెల 27న జరిగిన ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు బుధవారం ఖమ్మంలో జరిగింది. ఐదుగురు అభ్యర్థులు బరిలో ఉండగా అధికార, వామపక్షాల పార్టీ అభ్యర్థులైన బాలసాని లక్ష్మీనారాయణ, పువ్వాడ నాగేశ్వరరావుల మధ్యనే తీవ్ర పోటీ నెలకొంది. జిల్లాలో 726ఓట్లు ఉండగా 692ఓట్లు మాత్రమే పోలయ్యాయి. మొదటి రౌండ్‌లో టిఆర్‌ఎస్ అభ్యర్థి లక్ష్మీనారాయణకు 313ఓట్లు రాగా, రెండో ప్రాధాన్యంలో మరో 3ఓట్లు వచ్చాయి. పువ్వాడ నాగేశ్వరరావుకు మొదటి ప్రాధాన్యంలో 275ఓట్లు రాగా, రెండో ప్రాధాన్యంలో మరో 10ఓట్లు వచ్చాయి. వైసిపి అభ్యర్థి లింగాల కమల్‌రాజుకు 102మాత్రమే రాగా, ఒక నోటా, ఒక ఓటు చెల్లలేదు. స్వతంత్ర అభ్యర్థులకు ఒక్క కూడా రాలేదు. ఆశ్చర్యకరంగా స్వతంత్ర అభ్యర్థులకు నామినేషన్ సమయంలో బలపర్చిన 10మంది అభ్యర్థుల ఓట్లు కూడా రాకపోవటం గమనార్హం. అధికార పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తనను గెలిపించామని టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీగా గెలుపొందిన బాలసాని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. రాష్టమ్రంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కానుకగా ఎమ్మెల్సీ ఎన్నికను ఇవ్వనున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ఖమ్మం జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సమితి ఒక్కటే ఉండేలా అభివృద్ధిలో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.

మహబూబ్‌నగర్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై..

ఫలించిన విపక్షాల వ్యూహం
తెరాస దూకుడుకు బ్రేక్...మంత్రుల ఎత్తుగడలు చిత్తు

ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, డిసెంబర్ 30: మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రతిష్టాత్మకంగా భావించిన రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానానికి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుధవారం వెలువడిన ఫలితాల్లో ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి గెలుపొందడంతో జిల్లా కాం గ్రెస్ పార్టీ శ్రేణుల్లో సంబరాలు మిన్నంటాయి. ఈ ఎన్నికల్లో రెండు స్థానాలకు టిఆర్‌ఎస్ అభ్యర్థులు కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎస్. జగదీశ్వర్‌రెడ్డి పోటీ చేశారు. వీరిద్దరినీ గెలిపించుకునేందుకు జిల్లా మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు వేసిన ఎత్తుగడలు ఫలించలేదు. తాము ప్రతి పాదించిన అభ్యర్థుల్లో ఒక అభ్యర్థి మాత్రమే గెలుపొందడంతో తెరాస నాయకులు షాక్‌కు గురయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి గెలుపొందడంతో జిల్లా వ్యా ప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. అ యితే ఈ ఎన్నికల్లో తెరాసను ఓడించేందుకు కాంగ్రెస్ నాయకులు వేసిన పాచికలు పారడంతో కాంగ్రెస్ అభ్యర్థి ఘనవిజయం సాధించారు. రెండు స్థానాలను తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన మంత్రులకు ఈ ఫలితాలు షాక్‌ను ఇచ్చాయి. ఎన్నికల షెడ్యూల్డ్ వెలువడినప్పటి నుండి జిల్లాలో అధికార పక్షాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని కాంగ్రెస్, టిడిపి, బిజెపి నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఒకటయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకమైన ప్రతిపక్షాల వ్యూ హాలు ఫలించడం ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్‌రెడ్డి గెలుపొందడం ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వచ్చినందున ఈ విజయం సాధించామని ఎమ్మెల్యే డికె అరుణతో పాటు ఎమ్మెల్సీగా గెలుపొందిన దామోదర్‌రెడ్డి సైతం ఫలితాల అనంతరం తేల్చిచెప్పారు. పాలమూరు జిల్లాలో ప్రతి పక్షాల వ్యూహం ఫలించిందని చెప్పవచ్చు. ఓట్ల లెక్కింపు సందర్భంలో కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లలో కూడా కాంగ్రెస్ అభ్యర్థికి దాదాపు 379 ఓట్లు రావడంతోనే రెండవ ప్రాధాన్యత ఓట్లతో సునాయాసంగా గెలుపొందారు.
తెరాస అభ్యర్థి ఒకరు కసిరెడ్డి నా రాయణరెడ్డి గెలుపొందినప్పటికీ టిఆర్‌ఎస్ శ్రేణుల్లో తీవ్ర నిరాశనే మిగిలింది. మరో అభ్యర్థి జగదీశ్వర్‌రెడ్డి ఓటమిని తెరాస నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఫలితాల వెలువడ్డ తరువాత తెరాసకు చెందిన ప్రధాన నాయకులు ముఖం చాటేశారు. కొందరు నాయకులు సెల్‌ఫోన్లు సైతం స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి గెలుపొందడం ఆ పార్టీ శ్రేణులకు నూతనోత్సాహాన్ని నింపింది. కాగా, 800లకు పైగా ఓటర్లను క్యాంపునకు తీసుకెళ్లిన తెరాస నాయకులకు తీరా ఫలితాలు వచ్చాక షాక్‌కు గురైయ్యారు. తెరాస దూకుడుకు బ్రేకులు వేశామని టిఆర్‌ఎస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఒక స్థానానికి టిఆర్‌ఎస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి గెలిచినప్పటికీ గులాబీ శ్రేణుల్లో మాత్రం నిరాశ నిస్పృహలు వ్యక్తమయ్యాయి. అయితే జిల్లాకు చెందిన మంత్రులు ఈ ఎన్నికల్లో తెరాస అభ్యర్థుల గెలుపుకోసం చేసిన వ్యూహాలు ఫలించకపోవడంతో ఆ పార్టీ నాయకులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

30ఎంబిపి15
మహబూబ్‌నగర్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందడంతో
సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్ అభ్యర్థి కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి

పాలమూరులో టిఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు చెరొకటి

టిఆర్‌ఎస్ అభ్యర్థి కసిరెడ్డి,
కాంగ్రెస్ క్యాండిడేట్ కూచుకుళ్ల గెలుపు

మహబూబ్‌నగర్, డిసెంబర్ 30: మహబూబ్‌నగర్ జిల్లాలో స్థానిక సంస్థల రెండు ఎమ్మెల్సీ స్థానాలకు బుధవారం ఫలితాలు వెలువడ్డాయి. అధికార టిఆర్‌ఎస్ పార్టీ నుండి రెండు స్థానాలకు పోటీ చేసినప్పటికీ టిఆర్‌ఎస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి ఒక్కరు మాత్రమే గెలుపొందారు. ఈ పార్టీ తరఫున రెండో స్థానానికి పోటీ చేసిన ఎస్. జగదీశ్వర్‌రెడ్డి ఓటమి చెందారు. మరో ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి ఘనవిజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత క్రమంలోనే తెరాస అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి 66 ఓట్లతో గెలుపొందారు. తెరాసకు చెందిన నారాయణరెడ్డికి 445 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి కూచుకుళ్ల దామోదర్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత క్రమంలో 379 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా టిడిపి అభ్యర్థి కొత్తకోట దయాకర్‌రెడ్డికి 152 ఓట్లు మొదటి ప్రాధాన్యతలో ఓట్లు పడ్డా యి. మరో తెరాస అభ్యర్థి సుంకిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డికి 273 ఓట్లురాగా స్వ తంత్య్ర అభ్యర్థి జగదీశ్వర్‌రెడ్డికి 3 ఓట్లు వచ్చాయి. దాంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాంకిషన్ మొదటి ప్రాధాన్యత క్రమంలో తెరాస అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి గెలుపొందినట్లు ప్రకటించారు. ఆ తర్వాత రెం డవ ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. తెరాస అభ్యర్థి జగదీశ్వర్‌రెడ్డి, కాం గ్రెస్ అభ్యర్థి కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ప్రాధాన్యత క్రమంలో టిడిపి అభ్యర్థి దయాకర్‌రెడ్డికి పోలైన ఓట్లలో రెండ వ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేసి ఆయనను ఎలిమినేషన్ చేశారు. అందులో 48 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్‌రెడ్డి 97 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తెరాస అభ్యర్థి ఎస్ జగదీశ్వర్‌రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి గెలుపొందినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపొందాలంటే పోలైన ఓట్లలో చెల్లిన ఓట్లను లెక్కలోకి తీసుకుంటే అభ్యర్థులు గెలుపొందడానికి కావల్సిన ఓట్లు 417గా అధికారులు నిర్ధారించారు. దాంతో మొదటి ప్రాధాన్యత ఓట్లలో తెరాస అభ్యర్థి నారాయణరెడ్డి 445 ఓట్లు వచ్చాయి. దాంతో ఆయన సునాయాసంగా గెలుపొందారు. రెండవ ప్రాధాన్యత క్రమంలో ఎలిమినేటెడ్ పద్ధతిలో టిడిపి అభ్యర్థి ఓట్లు లెక్కింపు సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థికి కావల్సిన రెండవ ప్రాధాన్యత సరిపోను ఓట్లు వచ్చాయి. ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కల ప్రకారంగా కాంగ్రెస్ అభ్యర్థికి 427 ఓట్లు రాగా తెరాస మరో అభ్యర్థి ఎస్. జగదీశ్వర్‌రెడ్డికి 330 ఓట్లు వచ్చాయి. 97 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్‌రెడ్డి గెలుపొందారు. టిడిపి అభ్యర్థి దయాకర్‌రెడ్డికి ఈ ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురైంది. తెరాస అభ్యర్థులు ఇద్దరు పోటీ చేయగా ఒకరు మాత్రమే గెలుపొందడంతో ఆ పార్టీకి కూడా శృంగభంగం తప్పలేదు.