రాష్ట్రీయం

వైభవంగా కార్తీక దీపార్చన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం/విజయవాడ/రాజమండ్రి/్భద్రాచలం, నవంబర్ 25: రాష్ట్ర వ్యాప్తంగా కోటి దీపార్చన జరిగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలంలో బుధవారం సాయంత్రం పాతాళగంగ వద్ద నదీహారతి, ఆలయం వద్ద జ్వాలాతోరణం కన్నులపండువగా నిర్వహించారు. భక్తులు తెల్లవారుజామునే పాతాళగంగలలో పుణ్యస్నానాలు ఆచరించి నదిలో కార్తీకదీపాలు వదిలారు. క్యూలైన్లలో నిలుచుని స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. సాయంత్రం పాతాళగంగ స్నానఘట్టాల వద్ద పుణ్య నదీ కార్యక్రమాన్ని ఆలయ అర్చక వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. నదీమతల్లికి 11 రకాల హారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత నదికి ప్రత్యేక పూజలు చేసి గంగమ్మకు చీరె, సారెను సమర్పించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం సాయంత్రం శ్రీశైలంలో జ్వాలాతోరణం వెలిగించారు. గోదావరి జిల్లాల్లో శివాలయాలు కిటకిటలాడాయి. గోదావరి జిల్లాల్లోని నాలుగు పంచారామ క్షేత్రాలతోపాటు ముఖ్యమైన అన్ని శివాలయాల్లో భక్తులు బారులు తీరారు. రెండు జిల్లాల్లోని గోదావరి తీరాల్లో వేకువజాము నుండే మహిళలు పుణ్యస్నానాలు ఆచరించి, దీపాలు వదిలారు. పంచారామ క్షేత్రాలైన తూర్పు గోదావరి జిల్లాలోని ద్రాక్షారామ భీమేశ్వరాలయం, సామర్లకోట కుమార భీమేశ్వరాలయం, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని సోమేశ్వరాలయం, పాలకొల్లులోని క్షీరారామలింగేశ్వర ఆలయాలకు తెల్లవారుజాము నుండే భక్తులు పోటెత్తారు. రాజమండ్రి కోటిలింగాలఘాట్ నుండి చింతాలమ్మ ఘాట్ వరకు సుమారు 500 మీటర్ల పొడవునా లక్ష దీపోత్సవం అద్భుతంగా జరిగింది.
శ్రీ పీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద పర్యవేక్షణలో ఐదు రోజులుగా విజయవాడ స్వరాజ్యమైదానంలో జరుగుతున్న కార్తీక వైభవం బుధవారం రాత్రితో ఘనంగా ముగిసింది. కార్తీక పౌర్ణమి కావటంతో అత్యంత వైభవంగా జరిగిన కోటి దీపార్చన కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు తరలివచ్చిన భక్తకోటితో సభా ప్రాంగణం పోటెత్తింది. కైలాసమే నేలకు దిగివచ్చిందాయన్నట్లుగానున్న సభా ప్రాంగణం భక్తుల శివనామ స్మరణతో మార్మోగింది. విశ్రాంత ఐఎఎస్ అధికారి పివిఆర్‌కె ప్రసాద్, ఆధ్యాత్మికవేత్త అన్నదానం చిదంబరశాస్ర్తీ పాల్గొన్నారు. అలాగే ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి సన్నిధిలో బుధవారం రాత్రి గోదావరికి నదీహారతి భక్తి ప్రవత్తులతో జరిగింది. ఉత్సవ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు మురళీధర్‌రావు నేతృత్వంలో గోదావరికి ధూప, కర్పూర, దీప హారతులు ఇచ్చారు. ఈ సందర్భంగా చిన్నారుల కూచిపూడి,్భరతనాట్యాలతో పాటుగా, కన్నుల విందు చేసిన బాణాసంచాల పేలుళ్లు, భక్తుల జయజయధ్వానాలు, మురళీగానాలు నడుమ నదీహారతి వైభవంగా సాగింది.

రాజమండ్రి పుష్కరఘాట్‌లో కార్తీక పౌర్ణమి సందడి
విజయవాడలో పరిపూర్ణానంద స్వామి ఆధ్వర్యంలో దీపోత్సవం

జలదిగ్బంధంలోనే పల్లెలు
వాగులు, వంకలు దాటలేక ప్రజల అవస్థ

కడప, నవంబర్ 25: కడప జిల్లాలో భారీవర్షాల నుంచి తెరిపి ఇచ్చినప్పటికీ జిల్లాలోని వాగులు, వంకలు, రోడ్లు, కాజ్‌వేలు, బ్రిడ్జిలు తెగిపోయి వందకుపైగా గ్రామాలు ఇంకా జల దిగ్భందంలోనే ఉన్నాయి. వర్షం తగ్గినా వాగులు, వంకలు, చెరువులు, కుంటలు నీటి ప్రవహంతో పరవళ్ళు తొక్కుతుండడంతో రాకపోకలు స్తంభించాయి. పలువురు యువకులు, మహిళలు వాగులు,వంకలు దాటుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. సుండుపల్లె మండలంలో ఇప్పటివరకు నలుగురు గల్లంతైనప్పటికీ విధిలేని పరిస్థితి కొందరు వాగులు దాటుతూనే ఉన్నారు. రైల్వేకోడూరు, సుండుపల్లె మండలాల్లో 20 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోగా, ఆ పరిసర ప్రాంతాల్లో నదులు, పెద్ద వాగులు ప్రవహిస్తున్నాయి. ఈ 20 గ్రామాల ప్రజలకు 10 రోజులుగా బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఓబులవారిపల్లె, పాములేరు, రైల్వేకోడూరు గుంజననది, ముష్టేరులతో పాటు సుండుపల్లె మండలం బహుదానదిలో భాగంగా రాయవరం -మలుపుబెస్తపల్లె, సుండుపల్లె-తిమ్మసముద్రం, ఫించా ముడుంపాడులలో బహుదానది నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అక్కడ ఉన్న కాజ్‌వేలపై 5 నుంచి 8 అడుగుల ఎత్తున నీరు పారుతోంది. ఓబులవారిపల్లె పాములేరు తెగిపోవడంతో 30 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. అలాగే సుండుపల్లె మండలంతోపాటు పొరుగున ఉన్న చిత్తూరు జిల్లా కెవిపల్లె, కలకడ మండలాలకు రాకపోకలు స్థంభించాయి. సంబంధిత ప్రాంతాల్లో కొంతమంది అత్యవసర పనులు, రోగాల బారిన పడి ఆస్పత్రులకు వెళ్ళాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంత మంది సాహసించి వాగులు, వంకలు దాటుతూ అతికష్టం మీద ప్రయాణం సాగిస్తున్నారు. సుండుపల్లె, ఫించా, రాయవరానికి చేరుకోవడానికి మామూలు రోజులలో 20 నుంచి 40 కి.మీటర్ల దూరం ప్రయాణించి రాయచోటి నుంచి రాకపోకలు కొనసాగిస్తుంటారు. అయితే ప్రస్తుతం ఆ ప్రాంతం నుంచి కలకడ, కెవిపల్లె, పీలేరు ప్రాంతాలకు వంద కిలోమీటర్లకు పైగా సుదూర ప్రయాణం చేయాల్సి వస్తోంది. రైల్వేకోడూరులోని లోతట్టు ప్రాంతాల్లో వరద ఉద్ధృతికి భయపడి పలువురు తమ ఇండ్లను ఖాళీచేశారు. అలాగే ఓబులవారిపల్లె మండలంలో పాములేరు, గుండాల ఏర్లు తెగిపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.

కళింగపట్నం - బాలి యాత్ర ప్రారంభం
గార, నవంబర్ 25: ఆంధ్రుల చరిత్రను, సంస్కృతిని భావి తరాలకు అందించే లక్ష్యంతో కార్తీక పౌర్ణమి పర్వదినం రోజున బుధవారం బాలి యాత్ర ప్రారంభమయింది. శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం రేవు నుండి ఇండోనేషియాలోని బాలి ద్వీపం వరకు ఈ యాత్ర సాగుతుంది. సామాజికవేత్త ప్రొఫెసర్ కెఎస్ చలం జెండా ఊపి ఈ యాత్రను ప్రారంభించారు. మన సాంప్రదాయాలను వారసత్వంగా భావి తరాలకు అందించేందుకు అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపు ఇచ్చారు. గతంలో ఇక్కడి ఆంధ్రులు కార్తీక పౌర్ణమి రోజునే కళింగపట్నం రేవు నుండి ప్రయాణం ప్రారంభించేవారన్నారు. అదే విధంగా బాలి ద్వీపం నుంచి కూడా ఇదే రోజు ఇక్కడికి ప్రయాణాలు ప్రారంభమయ్యేవన్నారు.
బిసిల సంక్షేమానికి కృషి: మంత్రి కొల్లు
సబ్బవరం, నవంబర్ 25: తెలుగుదేశం పార్టీ తొలినుంచి బిసిల సంక్షేమం కోసం కృషి చేస్తోందని రాష్ట్ర బిసి సంక్షేమశాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. విశాఖ జిల్లా సబ్బవరం మండలం రావలమ్మపాలెంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బిసిల ఆర్థిక వెనుకబాటుతనాన్ని స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ గుర్తించక పోయినప్పటికీ అన్న ఎన్టీఆర్ గుర్తించారన్నారు. అందుకే బిసిల కోసం సంక్షేమశాఖ ఏర్పాటు చేశారన్నారు. ఆ బాటనే అనుసరించి గతంలో చంద్రబాబునాయుడి హయాంలో ఆదరణ పథకం పెట్టి ఆదుకున్నారన్నారు. మళ్లీ రాష్ట్రంలో ఆ పథకాన్ని పునరుద్ధరిస్తామని మంత్రి ప్రకటించారు. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ వెనుకబడిన తరగతుల వారి సంక్షేమం కోసం బిసి సబ్ ప్లాన్‌కు 6,640 కోట్ల రూపాయలను కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు.
ఏపిని ఆదుకోండి: ఎంపీ సుజనాచౌదరి
ఆంధ్రభూమి బ్యూరో
న్యూఢిల్లీ, నవంబర్ 25: పునర్విభజన చట్టంలో చేసిన హామీలను అమలు చేసి ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని ప్రధాని మోదీని మరోసారి కోరినట్టు కేంద్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి తెలిపారు. ఏపికి ప్రత్యేక హోదా ప్రకటించే విషయంలోకూడా సత్వరం ఒక నిర్ణయం తీసుకోవాలని పార్లమెంట్ సమావేశాలకు ముందుగా బుధవారం జరిగిన ఎన్డీయే భాగస్వామ్యపక్షాల సమావేశంలో ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హొదాపై ఆయన బిజెపి అధ్యక్షుడు అమిత్‌షాతో చర్చించారు. ప్రత్యేక హోదాకు సంబంధించి తాజా పరిణామాలపై హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలసి మాట్లాడమని అమిత్‌షా సూచించారు. శుక్రవారం రాజ్‌నాథ్‌సింగ్‌ను కలవనున్నట్టు మంత్రి వెల్లడించారు. వరద నష్టాలపై నివేదికలు అందగానే మరింత సాయం అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారని చౌదరి పేర్కొన్నారు.
అండమాన్ వద్ద ఉపరితల ఆవర్తనం
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, నవంబర్ 25: దక్షిణ అండమాన్ వద్ద సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు బుధవారం రాత్రి తెలిపారు. ఇది రాగల 48 గంటల్లో బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే ప్రస్తుత దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పెద్దగా ఉండదన్నారు. రుతు పవన ప్రభావంతో కోస్తాలో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.