రాష్ట్రీయం

పోలీసు ఉద్యోగాల భర్తీకి మూడేళ్ల వయసు సడలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 20: తెలంగాణలో త్వరలో జరిగే పోలీసు ఉద్యోగాల భర్తీలో అభ్యర్థులకు మూడేళ్ల వయసు సడలింపును ఇస్తున్నట్టు హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది అన్నారు. ఆదివారం ఆయన తన ఇద్దరు కుమారులతో హైదరాబాద్ నుంచి తాండూర్‌కు సైకిల్ యాత్రను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన తన స్నేహితులను కలుసుకున్నారు. సైకిల్ యాత్ర ఆరోగ్యం, కాలుష్య నివారణకు దోహదపడుతుందని, సైకిల్ యాత్ర వల్ల లభించే అనుభూతిని తన స్నేహితులతో పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఆయనను కలసిని విలేఖరులతో మాట్లాడుతూ పోలీసు శాఖ నూతన టెక్నాలజీతో ముందుకెళ్తుందని, శాంతి భద్రతల పరిరక్షణతోపాటు నేరాల అదుపునకు నూతన సాంకేతికతను వినియోగిస్తున్నామన్నారు. అదేవిధంగా తెలంగాణలో జరిగే పోలీసు ఖాళీల భర్తీలో అభ్యర్థులకు మూడేళ్ల వయసును సడలించామని పేర్కొన్నారు.