రాష్ట్రీయం

సభా మర్యాదను మంటగలిపారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 20: శాసనసభలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సభా మర్యాదను ఏమాత్రం పాటించడం లేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. సభలో ఆయన వ్యవహారశైలి సక్రమంగా లేదని, ఇది అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. స్వయంగా ఒక మహిళా శాసనసభ్యురాలు ముఖ్యమంత్రిని పట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడితే, ఆమెను వెనకేసుకురావడమేకాకుండా ఏం తప్పు మాట్లాడారని అంటారా అని ఆయన ప్రశ్నించారు. జగన్ వైఖరిని తప్పుబట్టారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో విలేకరుల సమావేశంలో సోమిరెడ్డి మాట్లాడుతూ కాల్‌మనీ వ్యవహారంపై సిఎం ధైర్యంగా చర్చ చేపడితే అందులో పాలుపంచుకోకుండా నేరస్తులను కాపాడేలా జగన్ ప్రవర్తించడం దారుణమని అన్నారు. సభలో ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చి శాసనసభ్యురాలు రోజా వాడిన భాష, ‘కామ ముఖ్యమంత్రి’, ‘సెక్స్‌రాకెట్’ సిఎం అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రతిపక్ష నేతగా జగన్ ఎలా సమర్ధించుకుంటారని ప్రశ్నించారు. రోజా కోసం శాసనసభను అడ్డుకుంటామని ప్రకటించడం దురదృష్టకరమని అన్నారు. లేడీ డాన్‌గా మారి రోజా మాట్లాడుతుంటే నియంత్రించాల్సింది పోయి ఆమెను మరింత రెచ్చగొట్టేవిధంగా మాట్లాడ్డం సిగ్గుచేటని అన్నారు. వైఎస్ పాలన పదేళ్లలో నేరగాళ్లకు రెడ్‌కార్పెట్ పరిచిందని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విదేశాల్లో ఉన్న నేరగాళ్లను సైతం పట్టుకొచ్చి జైల్లో పెట్టామని గుర్తు చేశారు. అధిక వడ్డీలతో ప్రజలను వేధిస్తున్న వాళ్లపైన పోలీసులు నిర్థాక్షణ్యంగా, నిష్పక్షపాతంగా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఇక వైఎస్, కెవిపిలు రాష్ట్రాన్ని భ్రస్టుపట్టించారని అన్నారు.
మాంత్రికుడు కెవి రామచంద్రరావు ఇప్పుడు మళ్లీ రంగ ప్రవేశం చేశారని అన్నారు. కెవిపి, జగన్ కలిసి అమరావతి రాకూడదని అడ్డుపడుతున్నారని అన్నారు. అయితే వెయ్యేళ్లకు సరిపడా ముందుచూపుతో అమరావతి నగరాన్ని రూపొందించే సత్తా చంద్రబాబునాయుడుకు ఉందని మర్చిపోవద్దని ఆయన కెవిపి, జగన్‌లకు సూచించారు. కెవిపి కుతంత్రాలు మానుకుని ఇక విశ్రాంతి తీసుకుంటే మంచిదని సోమిరెడ్డి సలహా ఇచ్చారు.