రాష్ట్రీయం

తిరుమలేశుడి భక్తులపై తుపాకి గురిపెట్టిన ఎస్‌ఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, డిసెంబర్ 20: తిరుమల జెఇఓ కార్యాలయానికి దారి ఎటు అని అడిగిన ప్రశ్నకు ఆగ్రహంతో ఊగిపోయిన చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన ఎస్‌ఐ నాగేశ్వరరావు విజయవాడకు చెందిన ఫణికుమార్‌పై సర్వీస్ రివాల్వర్‌ను గురిపెట్టిన సంఘటన ఆదివారం ఎస్‌ఎంసి సర్కిల్‌లో చోటుచేసుకొంది. దీంతో ఆగ్రహించిన భక్తులు ధర్నాకు దిగారు. వారికి మద్దతుగా మరికొంతమంది భక్తులు చేరి పోలీసులను నిలదీశారు. సమాచారం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకుని ఎస్‌ఐని అక్కడ నుంచి పంపించి భక్తులను శాంతింపజేశారు. విజయవాడకు చెందిన ఫణికుమార్ వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకోవడానికి తమ కుటుంబ సభ్యులతో కలసి తిరుమలకు చేరుకున్నారు. ఎవరు సిఫార్సుతో వచ్చారో తెలియదుకాని జెఇఓ కార్యాలయానికి వెళ్లేందుకు ఎస్‌ఎంసి సర్కిల్ మీదుగా వెళ్లడానికి ప్రయత్నించారు. ఆ ప్రాంతంలో భక్తుల సంచారం ఎక్కవగా ఉండడంతో వాహనాలను అటువైపు అనుమతించకుండా వన్ వే విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ విషయం తెలియని భక్తులు అటువైపు వెళ్లారు. విధుల్లో ఉన్న ఎస్‌ఐ నాగేశ్వరరావు వాహనాన్ని నిలిపివేశారు. దీంతో జెఇఓ ఆఫీసుకు ఎలా వెళ్లాలో సలహా ఇవ్వమని వాహనంలో ఉన్న భక్తులు ఎస్‌ఐని కోరారు. ముందు వాహనం వెనక్కి తిప్పు అంటూ తనదైన శైలిలో హుకుం జారీ చేశారు. ఎందుకంత కోపంగా మాట్లాడుతారంటూ భక్తులు ఎస్‌ఐని ప్రశ్నించారు. దీంతో ఎస్‌ఐ వారితో వాగ్వాదానికి దిగారు. భక్తులు కూడా ఏమాత్రం తగ్గకుండా తాము సలహా ఇవ్వమనడం తప్పా అంటూ ఎస్‌ఐని నిలదీశారు. తననే ప్రశ్నిస్తారా అంటూ ఆగ్రహంతో ఊగిపోయిన ఎస్‌ఐ తన వద్దనున్న సర్వీస్ రివాల్వర్‌ని గురిపెట్టి కాల్చేస్తానంటూ బెదిరించాడు. దీంతో సహనం కోల్పోయిన భక్తులు కాల్చమని ఎదురుతిరిగారు. ఈ విషయాన్ని అటుగా వెళుతున్న భక్తులు గమనించి విజయవాడ భక్తులకు మద్దతుగా నిలిచారు. అందరూ కలసి రోడ్డుపై బైఠాయించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని భక్తులను శాంతపరిచి ఎస్‌ఐని అక్కడ నుంచి పంపించి వేశారు.

‘పెండింగ్ ప్రాజెక్టుల
పూర్తికి నిధులు’
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 20: పెండింగ్ ప్రాజెక్టుల కోసం నిధులు కేటాయిస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ఆదివారం ఆయన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తా, హైదరాబాద్ మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌విఎస్ రెడ్డి తదితర ఉన్నతాధికారులతో సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎంఎంటిఎస్ రెండో దశ పనులు గత 12 ఏళ్ళుగా పెండింగ్‌లో ఉన్నాయని, గత ప్రభుత్వం వీటిని నిర్లక్ష్యం చేసిందని దత్తాత్య్రేయ విమర్శించారు. ఎన్డీఏ అధికారం చేపట్టిన తర్వాతే రెండో దశ పనులు వేగవంతమయ్యాయని తెలిపారు. తెలంగాణలోని పెండింగ్ ప్రాజెక్టులతో పాటు అదనపు పనులను వేగవంతం చేసేందుకు రానున్న బడ్జెట్‌లో అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తామని చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని కోరారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని, నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అన్నారు. ట్రాఫిక్ సమస్య లేకుండా చేసేందుకు రోడ్ల వెడల్పును వేగవంతం చేయాలని, ఇందుకోసం ప్రత్యేయ విధానాన్ని చేపట్డాలని సూచించారు.

రైల్వే టెర్మినల్ కోసం భూమి కేటాయించాల్సిందిగా ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కోరనున్నట్లు దత్తాత్రేయ తెలిపారు.

రోజా సస్పెన్షన్
అప్రజాస్వామికం
ఏ నిబంధన మేరకు చర్య తీసుకున్నారు?
ప్రభుత్వానికి వైకాపా సూటిప్రశ్న
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 20: శాసనసభ సమావేశాల నుంచి తమ పార్టీ ఎమ్మెల్యే ఆర్‌కె రోజాను ఏ నిబంధన మేరకు ఏడాదిపాటు సస్పెండ్ చేశారని వైఎస్‌ఆర్‌సిపి అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ చర్య పూర్తిగా అప్రజాస్వామికమన్నారు. శాసన సభ్యురాలు స్పీకర్‌ను దూషిస్తూ వ్యాఖ్యలు చేయలేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మాత్రమే విమర్శించారని గుర్తు చేశారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రోజాపై ఉన్న సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో నిబంధనలు, సంప్రదాయాలు పాటించడం లేదని తమ్మినేని విమర్శించారు. శాసనసభ చరిత్రలో ఇలాంటి పరిస్థితులను ఎన్నడూ చూడలేదని అన్నారు. లోక్‌సభ, రాజ్యసభలో ఉన్న నిబంధనలే ఇక్కడే ఉన్నాయని చెప్పారు. గతంలో కరణం బలరాం నేరుగా స్పీకర్‌ను తిట్టారని, చంద్రబాబు గతంలో స్పీకర్‌ను రౌడీ స్పీకర్ అంటూ ముషారఫ్‌తో పోల్చారని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు స్పీకర్‌ను దూషించిన ఎన్నో సందర్భాలు శాసనసభ రికార్డుల్లో ఉన్నాయని సీతారాం అన్నారు. ఒక వేళ సభ్యులు ఎవరైనా దూషించి ఉంటే తొలుత ఎథిక్స్ కమిటీకి ఆ అంశాన్ని రిఫర్ చేయాల్సి ఉంటుందని, ఆ కమిటీ సిఫారసు చేసిన తర్వాతే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. కరణం బలరాం విషయంలో ఇదే జరిగిందని అన్నారు. కాల్‌మనీ, సెక్స్ రాకెట్ వ్యవహారంలో చాలా మంది తెలుగుదేశం పార్టీకి చెందిన వారు నిందితులుగా ఉన్నందున ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుందనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం రోజాపై సస్పెన్షన్ వేటు వేసిందని ఆరోపించారు.
ఎపిలో శిల్పారామం ఏర్పాటుకు
ప్రత్యేక ఐఏఎస్ అధికారిని నియమించండి
ముఖ్యమంత్రి చంద్రబాబును కోరిన
ఎఐపిపి జాతీయ కార్యదర్శి జాస్తి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 20: ఆంధ్రప్రదేశ్‌లో శిల్పారామం ఏర్పాటు చేసేందుకు, అందుకు తగిన చర్యలు చేపట్టేందుకు వీలుగా ప్రత్యేక ఐఏఎస్ అధికారిని నియమించాలని అఖిలభారత పంచాయత్ పరిషత్ (ఎఐపిపి) జాతీయ కార్యదర్శి జాస్తి వీరాంజనేయులు ఎపి సిఎం ఎన్.చంద్రబాబునాయుడును కోరారు. 2014 నవంబర్ 12న గుంటూరు నగరంలో శిల్పారామం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించి జివో జారీ చేసిందని, ఇందుకు రూ.కోటి కూడా మంజూరు చేసిందని గుర్తు చేశారు. అయితే ఇంతవరకు శంకుస్థాపన జరగలేదని అన్నారు. కళాత్మక విలువలు ఉట్టిపడేలా ఈ శిల్పారామం తయారు చేయాలని అన్నారు. తక్షణమే స్పందించి శిల్పారామం ఏర్పాటుకు వెంటనే ఐఏఎస్ అధికారిని నియమించాలని, శంకుస్థానకు ఏర్పాట్లు చేయాలని ఆయన సిఎంకు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.
ఎపిఐఐసి డైరక్టర్‌గా ఫణికిశోర్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 20: ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్టక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎపిఐఐసి) బోర్డు డైరక్టర్‌గా రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఫణి కిశోర్‌ను రాష్ట్రప్రభుత్వం నియమించింది. ఐటి, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ నుంచి కూడా బోర్డులో ప్రాతినిధ్యం ఉంటే మంచిదని బోర్డు విసి, ఎండి చేసిన ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలించిన అనంతరం ఫణికిశోర్‌ను మరో డైరక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.