రాష్ట్రీయం

రోడ్డునపడ్డ చిన్నారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కందుకూరు, డిసెంబర్ 20: పేదల ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకుని ఫైనాన్స్ వ్యాపారులు చెలరేగిపోతున్నారు. ఓవైపు కాల్‌మనీ వ్యాపారులపై ప్రభుత్వం చర్యలు చేపడుతుండగా కందుకూరు ప్రాంతంలో మాత్రం వడ్డీ వ్యాపారుల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలోని 3వ వార్డు ఉప్పుచెరువులో ఆదివారం ఫైనాన్స్ వ్యాపారి దాష్టీకానికి ఓ కుటుంబం రోడ్డున పడింది. బాధితురాలు కె విజయలక్ష్మి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఉప్పుచెరువు ప్రాంతంలో నివాసం ఉంటున్న కె విజయలక్ష్మి సంవత్సరం క్రితం కందుకూరు ప్రాంతంలో ఫైనాన్స్ వ్యాపారి వద్ద కుటుంబ అవసరాలు నిమిత్తం 1.50 లక్షల రూపాయలను అప్పుగా తీసుకుంది. అప్పు ఇచ్చిన ఫైనాన్స్ నిర్వాహకులు తొలుత 3 రూపాయల వడ్డీ అని చెప్పి, తీరా అప్పు చెల్లించబోయేసరికి 10 రూపాయల వడ్డీ చెల్లించాలని వేధించినట్లు బాధితురాలు తెలిపింది. ఈనేపథ్యంలో ఆదివారం విజయలక్ష్మి తన కుమార్తెతో కలసి ఇంట్లో ఉండగా ఫైనాన్స్ వ్యాపారి కుటుంబ సభ్యులు, బంధువులు వచ్చి అప్పు, వడ్డీ తిరిగి చెల్లించాలని వాగ్వివాదానికి దిగారు. అనంతరం ఇంటిలోని సామాన్లను బయటకు విసిరేశారు. మూడేళ్ల చిన్నారిని సైతం కనికరం లేకుండా నడిరోడ్డుపైకి గెంటేశారు. సమాచారం అందుకున్న స్థానిక సిపిఐ నాయకులు వీరారెడ్డి, వలేటి రాఘవులు తదితరులు ఆ ప్రాంతానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని ఓదార్చి ఫైనాన్స్ వ్యాపారులను ఈ పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు. ఈ సందర్భంగా బాధితురాలు విలేఖర్లతో మాట్లాడుతూ తన సమస్యను పోలీసులకు తెలిపినప్పటికీ పట్టించుకోవడం లేదని వాపోయింది. ఈ విషయంపై స్థానిక డిఎస్పీ శ్రీనివాసరావును వివరణ కోరగా సమాచారం అందిందని, విచారణ చేపడుతున్నామని తెలిపారు. విచారణ అనంతరం వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు.

దంపతుల దారుణ హత్య

గొంతుకోసి పరారైన దుండగులు ౄ ఆస్తి వివాదాలే కారణం?
విజయవాడ (క్రైం), డిసెంబర్ 20: విజయవాడలో ఓ జంట తమ ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు అతి దారుణంగా అర్ధరాత్రి ఇద్దరి గొంతుకోసి హతమార్చారు. నగల కోసమే దోపిడీ దొంగలు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నా.. కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న ఆస్తి వివాదాల నేపథ్యంలోనే హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. పటమటలంక చేపల మార్కెట్ సమీపంలో మునగపాటి గంగాధరరావు(55), వీరాంజమ్మ(50) అనే దంపతులు తమ స్వగృహంలో నివాసముంటున్నారు. గతంలో ఆటోడ్రైవరైన గంగాధరరావు అనారోగ్యం వల్ల నాలుగేళ్లుగా ఖాళీగా ఇంట్లోనే ఉంటున్నాడు. వీరాంజమ్మ కోఆపరేటివ్ సొసైటీలో సీనియర్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తూ పదేళ్లుగా డెప్యుటేషన్‌పై విజయకృష్ణా సూపర్‌బజార్‌లో అకౌంటెంట్‌గా విధులు నిర్వహిస్తోంది. వీరి కుమార్తె షామిలి ఇరిగేషన్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీరుగా పనిచేస్తున్న సత్యకిషోర్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. వారు గుణదలలో నివాసముంటున్నారు. ఇంట్లో గంగాధరరావు, వీరాంజమ్మ మాత్రమే ఉంటున్న క్రమంలో ఆదివారం ఉదయం ఎంతకీ తలుపు తెరవకపోవడంతో ఈ భవనంలో అద్దెకుంటున్నవారు పోలీసులకు సమాచారం అందించారు. పటమట పోలీసులు వచ్చి తలుపు తెరచి చూడగా దంపతులిద్దరూ రక్తం మడుగులో పడి ఉన్నారు. ఇద్దరికీ గొంతుపై పదునైన ఆయుధంతో కోసిన గాయాలు, చేతి మణికట్టుపై కూడా తెగిన గాయాలున్నట్లు పోలీసులు గుర్తించారు.
వీరాంజమ్మ ఒంటిపై ఉన్న బంగారు ఉంగరం, మెడలోని బంగారు నానుతాడు కనిపించకపోయేసరికి దొంగల ఘాతుకంగా భావిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న అల్లుడు సత్యకిషోర్ ఇక్కడకు చేరుకున్నాడు. హైదరాబాద్‌లో ఉన్న కుమార్తె షామిలి బయలుదేరి వచ్చారు. డిసిపి కాళిదాసు రంగారావు, సెంట్రల్ ఏసిపి ప్రభాకర్‌బాబు, పటమట సిఐ జాన్‌కెనడీ, సిసిఎస్, సిటిఏఫ్ ఏసిపిలు అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్, వేలిముద్రల నిపుణులు, పోలీసు జాగిలాలతో ప్రాథమిక ఆధారాలు సేకరించారు.
మృతదేహాలను ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించి హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలావుంటే, హతుడు గంగాధరరావు, అతని సోదరుడు శ్రీనివాసరావుకు మధ్య ఆస్తి సంబంధ వివాదాలు నడుస్తున్నట్లు కూడా వెలుగులోకి వచ్చింది. ఈదిశగా కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.