రాష్ట్రీయం

తిరుమల కిటకిట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, డిసెంబర్ 20: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించి, వైకుంఠ ద్వార ప్రవేశం చేయడానికి వచ్చిన భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది. వీరికి సోమవారం తెల్లవారుజామున 4 గంటల నుండి ఆలయం లోపలకు అనుమతించడానికి టిటిడి చర్యలు చేపట్టింది. ముందుగా స్వామివారికి నిత్యం జరిగే సుప్రభాతం, తోమాల, అర్చన లాంటి సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. అనంతరం బ్లూ బుక్ ప్రకారం ప్రొటోకాల్ విఐపిలను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. ఈ సంఖ్యను మూడు వేల మందికి మించకుండా కుదించాలని టిటిడి ఇఓ అన్నిరకాల చర్యలు చేపడుతున్నారు. కొండపై ఎటుచూసినా గోవిందమాల దీక్షలు ధరించి పసుపు దుస్తులు వేసుకొన్న భక్తులు దర్శనమిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన దీక్ష విరమించడానికి తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల నుండి గోవిందమాల భక్తులు అలిపిరి, శ్రీవారిమెట్టు కాలిబాటల గుండా నడిచి తిరుమలకు చేరుకుంటున్నారు. కాగా తిరుమలలో వసతి కొరత నేపథ్యంలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజున స్వామివారిని దర్శించుకొన్న భక్తులు తక్షణం తిరుపతికి వెళ్లడానికి వీలుగా ఈ రెండు రోజులపాటు కనుమ మార్గాలను 24 గంటలపాటు తెరచి ఉంచనున్నారు. శనివారం 71,849 మంది స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం భక్తులు తిరుమలకు చేరుకొన్నప్పటికీ స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్లే వారి సంఖ్య తక్కువగా ఉంది. దీంతో 3 గంటల వ్యవధిలోనే భక్తులకు స్వామి దర్శనం లభిస్తోంది. ఇక ఆదివారం రాత్రి సమయానికే సుమారు రెండు లక్షల మంది భక్తులు తిరుమలకు చేరుకున్నారు. ఈనేపథ్యంలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకొనే భక్తులను వైకుంఠ క్యూకాంప్లెక్స్‌లో అనుమతించి కంపార్ట్‌మెంట్లలో కూర్చోబెడుతున్నారు. ఇక నారాయణగిరి ఉద్యానవనంలో కూడా భక్తుల సౌకర్యార్థం తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేశారు. అక్కడ క్యూలైన్లతో పాటు భక్తులు కూర్చోడానికి వీలుగా ప్రత్యేక తివాచీలను ఏర్పాటు చేశారు. వారున్నచోట్లకు అల్పాహారం నుంచి భోజనాల వరకు, నీళ్ల నుంచి టీ, కాఫీ, పాలులాంటి పానీయాలను సరఫరా చేస్తున్నారు. రెండు వైకుంఠ క్యూకాంప్లెక్స్, ఉద్యానవనంలో 4 కిలోమీటర్ల మేర తాత్కాలిక షెడ్లు, క్యూలైన్లు భక్తులతో పూర్తిగా నిండిపోయింది.
పురుషులకు, స్ర్తిలకు వేరువేరుగా ఉద్యానవన ప్రాంతంలో తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా టిటిడి వైద్యబృందంతో ప్రాథమిక వైద్యబృందాలను ఏర్పాటు చేశారు. ఉద్యానవనంలో కమాండ్ పోలీసు కంట్రోల్ రూంను ఏర్పాటుచేసి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే వసతి సౌకర్యాల విషయంలో టిటిడి యాజమాన్యం ముందస్తు గదులు రిజర్వు చేసుకొనే విధానాన్ని తాత్కాలికంగా రద్దు చేసింది. ముందు వచ్చిన వారికి ముందు గదులు కేటాయించే విధానం అమలు చేసినప్పటికీ వసతి కొరత తప్పలేదు.
chitram...
వైకుంఠ ఏకాదశి సందర్భంగా సర్వాంగ సుందరంగా ముస్తాబైన శ్రీవారి ఆలయం