రాష్ట్రీయం

కాల్ మనీపై రాజకీయాలొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 20: కాల్ మనీపై రాజకీయాలు వద్దని బిజెపి అగ్ర నాయకుడు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. కాల్ మనీపై ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం మాని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ పాలక, ప్రతిపక్షాలకు సూచించారు. కాల్ మనీ వ్యవహారంపై ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్‌గా ఉన్నారని, దీనిపై ఇదివరకే విచారణకు ఆదేశించారని, బాధితులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆయుత చండీయాగం చేయడంలో తప్పేమీలేదని, మన ధర్మంలో యాగం చేస్తే యోగం లభిస్తుందని అంటారని ఆయన తెలిపారు. తనకు ఆహ్వానం వచ్చిందని, ఈ నెల 24న హాజరవుతానని ఆయన చెప్పారు.
సోనియా కుటుంబాన్ని వేధించడం లేదు
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని, ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీని ఎన్డీఏ ప్రభుత్వం వేధిస్తున్నదని ఆ పార్టీ చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదని అన్నారు. వారిపై కేసు నమోదైంది యుపిఎ ప్రభుత్వ హయాంలోనేన్న విషయాన్ని మరచిపోరాదని ఆయన తెలిపారు. సోనియా, రాహుల్ కోర్టుకు వెళితే అక్కడ బలప్రదర్శన ఎందుకు చేశారో కాంగ్రెస్ నాయకులు వివరించాలని అన్నారు. సమన్లు ఇచ్చి కోర్టుకు హాజరు కావాలంటేనే బలప్రదర్శన చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ఇలా సమన్లు అందుకున్న వారు కాంగ్రెస్‌ను స్పూర్తిగా తీసుకుని కోర్టుల వద్ద బలప్రదర్శన చేస్తే న్యాయవ్యవస్థ పతనం కాదా? అవమానించినట్లు కాదా? అని ఆయన ప్రశ్నించారు. బెయిల్ వస్తే విజయోత్సవం ఏమిటీ? అని ఆయన ప్రశ్నించారు. బెయిల్ కోరితే కోర్టు మంజూరు చేసిందని ఆయన తెలిపారు. 2013 సంవత్సరంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడే నేషనల్ హెరాల్డ్ కేసు నమోదైందని ఆయన గుర్తు చేశారు. అయినా పార్లమెంటును స్తంభింపజేశారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ తీరును దేశంలోని అన్ని ప్రముఖ పత్రికలు ఖండించాయని ఆయన చెప్పారు. ఆరోపణలు చేసే ముందు ఆలోచన చేయాలని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ‘సిట్’ ముందు ఒక కేసులో చాలా సాదాసీదాగా హాజరయ్యారని ఆయన తెలిపారు. 8 గంటలు సిట్ విచారణ కొనసాగించిందని ఆయన చెప్పారు. తమ పార్టీ నేత అమిత్‌షాను అనేక రకాలుగా వేధించారని ఆయన విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ను ఓడించినందుకు ఇప్పుడు ఆ పార్టీ నాయకులు ప్రతీకారం తీర్చుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బురద చల్లే ప్రయత్నం చేస్తున్నదని ఆయన విమర్శించారు. పార్లమెంటు సమావేశాలు మరో మూడు రోజుల్లో ముగియనున్నాయని, 18 పెండింగ్ బిల్లులు ఆమోదించుకోవాల్సి ఉన్నందున ప్రతిపక్షాలు సహకరించాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కోరారు.

కైకాలకు అక్కినేని సినీరత్న పురస్కారం
హైదరాబాద్, డిసెంబర్ 20: ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణకు అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ ఆమెరికా పురస్కారం ‘సినీరత్న’ అవార్డు ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో ఆదివారం రాత్రి జరిగిన ఈ వేడుకకు అక్కినేని కుటుంబ సభ్యులు నాగ సుశీల, సుమంత్, సుశాంత్ తదితరులతోపాటు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తోటకూర ప్రసాద్ కూడా హాజరయ్యారు. కైకాలతోపాటు వివిధ రంగాలకు చెందిన పలువురికి అవార్డులను ప్రదానం చేశారు. సీనియర్ నటి జమునకు కూడా కైకాలతోపాటు సన్మానం చేశారు. జీవితసాఫల్య పురస్కారాన్ని ఘట్టమనేని కృష్ణకు, రంగస్థల విభాగంలో కర్నాటి లక్ష్మీనరసయ్య, విశిష్ట వ్యాపారరత్న అవార్డును ఎవిఆర్ చౌదరికి, వైద్యరత్న పురస్కారాన్ని డాక్టర్ గుళ్ల సూర్యప్రకాశ్‌కు, విద్యారత్నను చుక్కా రామయ్యకు, యువ రత్నను పూర్ణ మాలవత్‌కు, సేవారత్న అవార్డును డాక్టర్ సునీతా కృష్ణన్‌కు అందజేశారు.
ఈ కార్యక్రమానికి పలువురు సినీరంగ ప్రముఖులు హాజరయ్యారు.

అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ ఆమెరికా పురస్కారాన్ని అందుకున్న సినీ నటి జమున