రాష్ట్రీయం

కల్తీ అడ్డా హైదరాబాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 20: హైదరాబాద్‌లోని నాగోల్ ప్రాంతంలో కల్తీ నూడుల్స్, పహాడీ షరీఫ్‌లోని కల్తీ నూనె తయారు చేస్తున్న కేంద్రాలను సౌత్‌జోన్ టాస్క్ఫోర్సు ఆదివారం సీజ్ చేశారు. ఆరుగురిని ఆరెస్టు చేసి ఏడు వందల నూడుల్స్ బస్తాలు, 70 బస్తాల పిండి, నాలుగు డ్రమ్ముల నూనెను స్వాధీనం చేసుకున్నారు. జంతు కబేళారాలతో కల్తీ నూనె, నెయ్యి తయారు చేస్తున్నట్టు సమాచారం అందుకున్న టాస్క్ఫోర్సు పోలీసులు దాడులు నిర్వహించారు. కల్తీ నూనె బట్టీని దగ్ధం చేశారు. ఈ అక్రమ వ్యాపారంతో సంబంధం ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నాగోల్ ప్రాంతంలోని ఓ ప్రదేశంలో ఎలాంటి అనుమతులు లేకుండా వివిధ బ్రాండ్‌లతో కల్తీ నూడుల్స్ తయారు చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు సౌత్‌జోన్ టాస్క్ఫోర్సు అదనపు డిప్యూటీ కమిషనర్ కోటి రెడ్డి నేతృత్వంలోని బృందం తనిఖీలు చేపట్టింది. రవికుమార్, ఎండి జాఫర్, ఎం మహేశ్, ఎస్‌కె రహీమ్‌లను అరెస్టు చేశారు. వీరి నుంచి ‘మలాయి గోల్డ్ సూపర్ ఫైన్ మైదా’బ్రాండ్ పిండి 250 బ్యాగులను 12,500 కిలోల కంచన్ బ్రాండ్ మైదా పిండి, 3,500 కిలోల నూడుల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 470 సేమియా పాకెట్లతోపాటు వీటిని తయారు చేసే యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
పైరసీ డివిడిల పట్టివేత..
హుస్సేని ఆలం, చార్మినార్, కంచన్‌బాగ్, చాదర్‌ఘాట్ పోలీసు స్టేషన్ల పరిధిలోని వివిధ వీడియో లైబ్రరీలలో 320 సినిమాలకు చెందిన పైరసీ డివిడిలను టాస్క్ఫోర్సు పోలీసులు పట్టుకున్నారు. ఈ నెల 18న కొత్తగా విడుదలైన ‘దిల్‌వాలె’ హిందీ సినిమాకు చెందిన 320 పైరసీ డివిడిలు, 500 వివిధ సినిమాలకు చెందిన సిడిలు, 250 ఎంప్టీ డివిడిలు, 25 వివిధ సినిమాలకు చెందిన లేబుల్స్‌తోపాటు 3 కంప్యూటర్లు, 12 డివిడి రైటర్లు కలిగివున్న సిపియు బాక్స్‌లను, అసెంబుల్డ్ సిపియు, మానిటర్లు, 15 కీ బోర్డులు స్వాధీనం చేసుకున్నారు.