రాష్ట్రీయం

అడుగడుగునా అర్చకులకు అవరోధాలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 25 : ‘‘శీఘ్రమేవ మనోవాంఛా సిద్ధిరస్తు’’ అంటూ దేవాలయాల్లో భక్తులను ఆశీర్వదించే అర్చకుల సమస్యలు మాత్రం నెలల తరబడి పరిష్కారం కావడం లేదు. ఎప్పుడు పరిష్కారం అవుతాయో కూడా తెలియడం లేదు. ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పటికీ ఈ సమస్యల పరిష్కారంలో అడుగడుగునా అవరోధాలే ఏర్పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎండోమెంట్స్ శాఖ అధీనంలోని దాదాపు 600 దేవాలయాల్లో అర్చకులు, ఇతర ఉద్యోగులు తమకు వేతనాన్ని ట్రెజరీ ద్వారా ఇవ్వాలంటూ చాలాకాలంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వానికి అనేక పర్యాయాలు అర్జీలు పెట్టుకున్నారు. ఈ ఏడాది ఆగస్టు చివరి నుండి సెప్టెంబర్ మొదటి వారం వరకు సమ్మె కూడా చేశారు.అర్చకులు, ఇతర ఉద్యోగుల వేతనాలు, తదితర అంశాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించేందుకు ముగ్గురు అధికారులతో ఒక కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అర్చకులు తదితర ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉందంటూ జూలై నుండి ఎదురు చూస్తున్నారు. జూలైలో గోదావరి పుష్కరాలు, ఆ తర్వాత ముఖ్యమంత్రి విదేశీ పర్యటన, ఇటీవలి వరంగల్ ఉపఎన్నిక తదితర అంశాలు వీరికి అడ్డు వచ్చాయని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.
అర్చకులు, ఇతర ఆలయ ఉద్యోగులకు ట్రెజరీ ద్వారా వేతనాలు ఇవ్వడం కుదరదని, అందువల్ల ప్రత్యామ్నాయ విధానంలో వేతనాలు చెల్లించేందుకు ప్రయత్నిస్తామని ప్రభుత్వం హామీ కూడా ఇచ్చింది. రాష్ట్ర దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి, దేవాదాయ సెక్రటరీ శివశంకర్ తదితర అధికారుల వద్ద జరిగిన చర్చల్లో ఈ విషయం తేలింది. ఇప్పటికే ప్రభుత్వానికి, అర్చక, ఆలయ ఉద్యోగుల సంఘాల ప్రతినిధుల మధ్య అనేక పర్యాయాలు చర్చలు జరిగాయి. ఆర్థికాంశాలపై ఇప్పటికే ప్రభుత్వం అధ్యయనం చేయించింది. ఆలయాల నుండి ఏటా దాదాపు 300 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తోందని, అర్చకులు, ఇతర సిబ్బందికి పే-రివిజన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా వేతనాలు చెల్లిస్తే ఏటా 110 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని తేల్చారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అంగీకరిస్తే, ఈ అంశంపై ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయని తెలిసింది. కెసిఆర్ వద్ద సమావేశం ఎప్పుడు జరుగుతుందన్న వియం మాత్రం వెల్లడి కావడం లేదు.

సెంట్రల్‌వర్శిటీలో
డిసెంబర్ 5, 6న
జాబ్ ఫెయిర్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, నవంబర్ 25: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ, జాబ్ డయలాగ్ అనే సంస్థతో కలిసి డిసెంబర్ 5, 6 తేదీల్లో జాబ్ ఫైయిర్ నిర్వహిస్తోంది. సెంట్రల్ యూనివర్శిటీ ఆవరణలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జాబ్ ఫెయిర్ జరుగుతుందని యూనివర్శిటీ వర్గాలు తెలిపాయి. సెంట్రల్ వర్శిటీలో పిజి విద్యను పూర్తి చేయనున్న సుమారు 500 మంది విద్యార్థులు ఈ జాబ్ ఫెయిర్‌కు హాజరు కానున్నారు. ఈ ఏడాది మే నెలలో నిర్వహించిన టాలెంట్ మేళా విద్యార్థులకు చాలా ఉపయోగపడిందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు మంచి భవిష్యత్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో జాబ్‌ఫెయిర్‌ను నిర్వహిస్తున్నట్లు యూనివర్శిటీ ప్లేసమెంట్ గైడెన్స్ అడ్వయిజరీ బ్యూరో చైర్మన్ ప్రొ.రాజీవ్ వాంకర్ తెలిపారు. వివిధ రంగాలకు చెందిన కంపెనీల ప్రతినిధులను ఒకే చోట టాలెంట్ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి కలుసుకునేందుకు అవకాశం ఈ వేదిక ద్వారా కలుగుతుందని తెలిపారు. మే నెలలో నిర్వహించిన టాలెంట్ మేళా వల్ల 50 మంది విద్యార్థులకు ఆఫర్‌లెటర్లు అందాయని, తెలివైన విద్యార్థులను మరింత ప్రోత్సహించేందుకు గాను ఈ జాబ్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు జాబ్స్ డయాలాగ్ సంస్థ సిఇఓ శ్రీవిద్యా విశ్వనాథన్ తెలిపారు. ప్రతిష్ఠాత్మక కంపెనీలు ఈ జాబ్‌ఫెయిర్‌లో పాల్గొంటున్నాయని ఆమె వివరించారు. జాబ్ ఫెయిర్‌లో పాల్గొనేందుకు వచ్చే కంపెనీలు ఉచితంగా పాల్గొనవచ్చని, ఆసక్తి ఉన్న కంపెనీలు తమను సంప్రదించవచ్చని తెలిపారు.