రాష్ట్రీయం

కూచిపూడి అభివృద్ధి వారితో ఏమవుతుంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 20: కూచిపూడిని అభివృద్ధి చేసే విషయంలో నాట్యశాస్త్రాన్ని ఔపోసన పట్టి నాట్యరంగానికే జీవితాలను అంకితం చేసినవారే సారథ్యం వహించాలని, అప్పుడే పూర్తి న్యాయం జరుగుతుందని ప్రసిద్ధ కూచిపూడి నాట్యాచారిణి, శంకరాభరణం ఫేం మంజుభార్గవి అన్నారు. నటరాజ్ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో విజయవాడలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల ప్రాంగణంలోని కళావేదికపై జరుగుతున్న అమరావతి నృత్యోత్సవ్‌లో ఆదివారం ఉదయం ఆమెతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. వేల మందితో ఏదోఒక కార్యక్రమం చేస్తూ గిన్నిస్ బుక్‌లో రికార్డుల కోసం పాకులాడుతూ పదిమందిలో పెద్దలా తిరుగుతున్న ఒక వ్యక్తికి కూచిపూడి నాట్యారామం బాధ్యతలు అప్పగించటం శోచనీయమని ఆమె పరోక్షంగా కూచిభొట్ల ఆనంద్‌పై విమర్శలు గుప్పించారు. పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఈమధ్య అవార్డులు, పురస్కారాలు, బిరుదులు తీసుకునేవారు, ఇచ్చేవారు ఎక్కువయ్యారని వ్యాఖ్యానించారు. అవార్డులనేవి ఇచ్చే సంస్థకు, తీసుకునే వ్యక్తికి కూడా గౌరవం కలిగించేవిగా ఉండాలన్నారు. నాట్యం అభ్యసించే వారికి స్వరజ్ఞానం, లయజ్ఞానం తప్పనిసరి అని గ్రహించాలన్నారు. రికార్డులతో ప్రదర్శనలివ్వటం సరికాకపోయినప్పటికీ ఒక్కోసారి నాలుగు, ఐదు ప్రదర్శనలివ్వవలసి వచ్చినప్పుడు తప్పనిసరి అవుతోందన్నారు. నాట్యభ్యాసకులు భక్తి, అంకితభావం కలిగి ఉండాలని మంజుభార్గవి స్పష్టం చేశారు. ముఖాముఖిలో ఎన్‌ఎండిఎ వ్యవస్థాపకులు బత్తిన విక్రమ్‌గౌడ్ పాల్గొన్నారు.