రాష్ట్రీయం

3 రోజుల్లో మాస్టర్ ప్లాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 20: మరో మూడురోజుల్లో అమరావతి మాస్టర్ ప్లాన్, ఈనెల 29లోగా రాజధాని డ్రాఫ్ట్ ప్లాన్ సిద్ధమవుతాయని రాష్ట్ర పురపాలక మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఆదివారం సాయంత్రం ఇక్కడ తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ నోటిఫై చేసిన తరువాత సిఆర్‌డిఏ చట్టం సెక్షన్ 10(1) ప్రకారం నెల రోజుల పాటు రైతుల అభ్యంతరాలకు సమయం కేటాయిస్తామన్నారు. అభ్యంతరాల పరిశీలన, పరిష్కారం అనంతరం డ్రాఫ్ట్ పనులు వేగవంతం అవుతాయని వివరించారు. రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులకు జనవరి 30న ప్లాట్లు కేటాయించనున్నట్టు ప్రకటించారు.
విజయవాడ -అమరావతి -గుంటూరు ఎనిమిది లేన్ల రహదారి నిర్మించనున్నట్టు చెప్పారు. 50మీటర్ల వెడెల్పుతో దీన్ని నిర్మించే ఆలోచన ఉందన్నారు. దీనిలో భాగంగానే రెండు సర్వీస్ రోడ్లు ఉంటాయన్నారు. సిఆర్‌డిఎలో దీనిపైనే ఆదివారం విస్తృతంగా చర్చించామన్నారు. ఈనెల 29లోగా అథార్టీలో అప్రూవ్ చేసి, తరువాత టెండర్ల ప్రక్రియ మొదలు పెట్టే ఆలోచన ఉందన్నారు. వీలైనంత త్వరగా దీన్ని పూర్తి చేయాలన్న ఆకాంక్షతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారన్నారు.
ఇటీవలే కేంద్ర జాతీయ రహదారుల మంత్రి గడ్కరీ రాష్ట్రంలో పర్యటించి రహదారుల ఆవశ్యకతపై కేంద్ర విధానాన్ని స్పష్టం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి నారాయణ గుర్తు చేశారు. ఎపీ నూతన రాజధాని అమరావతి చుట్టూ 210 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఔటర్ రింగ్ రోడ్డుకు 7 వేల 700 ఎకరాల భూమి అవసరం ఉందన్నారు. ఈ భూమిని భూసమీకరణ ద్వారా సేకరించాలా, భూ సేకరణతో స్వీకరించాలా అన్న విషయాన్ని సిఆర్‌డిఎలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఈ బాహ్య వలయ రహదారి పరిధిలోనే గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. దీనికీ సుమారు 7.5వేల ఎకరాల వరకూ భూములు అవసరం ఉంటుందన్నారు. భూములు గుర్తించే బాధ్యతను సిఆర్‌డిఎ అడిషినల్ కమిషనర్ మల్లికార్జునకు అప్పగించామన్నారు. ఎయిర్‌పోర్టు అథార్టీతో అడిషినల్ కమిషనర్ సంప్రతింపులు జరిపి, భూములను గుర్తిస్తారన్నారు. రాజధాని ప్రాంతంలో యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు నారాయణ వెల్లడించారు. చెన్నై నగరాన్ని బూచిగా చూపి అమరావతిని అడ్డుకోవద్దంటూ మంత్రి నారాయణ విపక్షాలకు విజ్ఞప్తి చేశారు.