రాష్ట్రీయం

నలుగురి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 20: కొండచరియలు విరిగిపడిన ఘటనలో బాలుడు సహా నలుగురు దుర్మరణం పాలయ్యారు. విశాఖ నగరం తాటిచెట్లపాలెం సంజీవయ్య కాలనీలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలవడం సంచలనం కలిగించింది. దిమడపు సూర్యనారాయణ (65), భార్య ఆదిలక్ష్మి (55), కుమారుడు శ్రీరాములు (22), ఆదినారాయణ (7) మృత్యువాత పడ్డారు. సూర్యనారాయణ, ఆదిలక్ష్మి, శ్రీరాములు ఒకే పోర్షన్‌లో ఉంటున్నారు. మృతుడు సూర్యనారాయణ సోదరుడు అప్పలసూరి తన కుటుంబంతో మరో పోర్షన్‌లో నివాసం ఉంటున్నాడు. అప్పలసూరి కుమారుడు ఆదినారాయణ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోగా, భార్య మరిడమ్మ, బంధువు బాలాజీ గాయాలతో చికిత్స పొందుతున్నారు. సంఘటనకు సంబంధించి నగర పోలీసు కమిషనర్ అమిత్‌గార్గ్, జివిఎంసి కమిషనర్ ప్రవీణ్‌కుమార్ అందించిన వివరాల మేరకు సంజీవయ్య కాలనీలో దిమడపు సూర్యనారాయణ, అతని సోదరుడు అప్పలసూరి కుంటుంబాలు రెండు పోర్షన్లలో నివాసం ఉంటున్నాయి. పూర్తిగా కొండవాలు ప్రాంతంలో నిర్మించిన రేకుల షెడ్డులో నివసిస్తున్నారు. కూలి పనులు చేసుకునే వీరంతా శనివారం యధావిధిగా పనులు ముగించుకుని ఇంటికి చేరుని నిద్రకు ఉపక్రమించారు. అయితే శనివారం రాత్రి నగరంలో కుండపోత వర్షం కురిసింది. దీంతో కొండవాలు ప్రాంతంలో మట్టి కరిగి రాళ్లు కిందకు జారి ఇంటిపై పడటంతో భవన శిథిలాల కింద చిక్కుకుని వీరు మరణించినట్టు పోలీసులు పేర్కొన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, జివిఎంసి, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. కంప్రెసర్ల సాయంతో బండరాళ్లను ముక్కలుగా చేసి శిథిలాల కింద చిక్కుకున్న వారిని పైకి తీశారు. క్షతగాత్రులను వైద్య సేవల నిమిత్తం కెజిహెచ్‌కు తరలించి చికిత్స అందజేస్తున్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు సంఘటనా స్థలాన్ని సందర్శించి సహాయ కార్యక్రమాలను పరిశీలించారు. సాయంత్రం మున్సిపల్ మంత్రి నారాయణ, తదితరులు కెజిహెచ్‌లో మృతదేహాలను పరిశీలించి, క్షతగాత్రులను పరామర్శించారు.