రాష్ట్రీయం

అవి ముమ్మాటికీ పోలీసు హత్యలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, డిసెంబర్ 18: కడపజిల్లా పులివెందుల నియోజకవర్గం తొండూరు భద్రంపల్లెకు చెందిన నలుగురు వైసిపీ కార్యకర్తలు అనుమానస్పద స్థితిలో బెంగళూరు శివార్లలో మృతిచెందిన నేపథ్యంలో వారి మృతదేహాలతో తొండూరు పోలీసుస్టేషన్ ఎదుట వైసిపి నేతలు, కార్యకర్తలు శుక్రవారం భారీఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కడప ఎంపి వైఎస్ అవినాష్‌రెడ్డి, రాష్ట్ర మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మాట్లాడుతూ పోలీసుల వేధింపులవల్ల నాలుగు నిండు ప్రాణాలు గాల్లో కలిశాయని ఆరోపించారు. జిల్లా అదనపు ఎస్పీ విజయకుమార్ హుటాహుటిన సంఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. తాము శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నామని, తమను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించడంతో ధర్నా పూర్తయ్యేవరకు ఎఎస్పీ అక్కడే మకాం వేశారు. వైసిపి నేతలు, ప్రముఖులు పెద్దఎత్తున తరలివచ్చి మృతదేహాలతో పోలీసుస్టేషన్ ఎదుట బైఠాయించారు. కొండాపురం సిఐ రవిబాబు నేతృత్వంలో ఎస్‌ఐ శ్రీనివాసులు టిడిపి కార్యకర్తలపై హత్యాయత్నం చేసినట్లు కేసు నమోదుచేయడం వల్లే తమవారు ఊరువదిలి బెంగుళూరు సమీపంలో తలదాచుకున్నారని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎంపి వైఎస్ అవినాష్‌రెడ్డి, రాష్టమ్రాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నేతల ప్రోద్బలంతో పోలీసులు తమ కార్యకర్తలను వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. మృతి చెందిన నాలుగు కుటుంబాలవారికి తమ పార్టీ అండగా నిలుస్తుందన్నారు.
రక్షకులా...్భక్షకులా...?
పులివెందుల: కడపజిల్లాలో పోలీసులు అధికార పార్టీ తొత్తులుగా మారడంవల్లే నాలుగు నిండుప్రాణాలు గాల్లో కలిసి పోయాయని కడప ఎంపి వైఎస్ అవినాష్‌రెడ్డి, మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పదిరోజుల క్రితం చౌకదుకాణాల డీలర్‌షిప్ విషయమై ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగి, ఒకరిపై ఒకరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్నారన్నారు. కానీ తమవర్గానికి చెందిన వారికే ఎక్కువగా గాయాలైనా తమవారిపై 307 కేసులు నమోదు చేశారన్నారు. అంతేగాకుండా అధికార పార్టీ నాయకుల వత్తిళ్లతో తమ వర్గీయుల ఇంటివద్దకు వెళ్లి పోలీసులు అసభ్యంగా మాట్లాడారని, మీ భర్తలు ఇంటికివస్తే బట్టలు ఊడదీసి కొడతామని మహిళలను హెచ్చరించారన్నారు. ఈ విషయాన్ని డిఎస్పీ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో తమపార్టీ కార్యకర్తలు రాష్ట్రాన్ని వదిలి వెళ్లి బెంగుళూరు సమీపంలో తలదాచుకుని మృత్యువాత పడ్డారన్నారు.

తొండూరు పోలీసు స్టేషన్ వద్ద మృతదేహాలతో ధర్నా చేస్తున్న ఎంపి అవినాష్, మాజీ మంత్రి వివేకానందరెడ్డి