రాష్ట్రీయం

శాసనసభ నిర్వహణ తీరు బాధాకరం: అంబటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 18: శాసనసభ నిర్వహణ తీరును గమనిస్తుంటే బాధాకరంగా ఉందని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం వైస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాసమస్యలపై ప్రతిపక్ష సభ్యులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి సభలో ప్రస్తావించటం అవివేకమన్నారు. భారతరత్న అంబేద్కర్ గురించి సభలో ప్రస్తావించేందుకు మరో రెండు రోజులు సభను పొడిగిస్తే మాట్లేడేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కాల్‌మనీ వ్యవహారాన్ని పక్కదోవ పట్టించేందుకే బిఆర్ అంబేద్కర్ అంశాన్ని సభలో ప్రస్తావించారని ఆరోపించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఆమోద దినోత్సవంగా దేశమంతా నిర్వహిస్తే అప్పుడు గుర్తుకురాని అంబేద్కర్ ప్రస్తుతం గుర్తురావటంలోని పాలకుల ఆంతర్యం ప్రజలకు తెలుసునన్నారు. విజయవాడలో అంగన్‌వాడీ వర్కర్లను పోలీసులు అమానుషంగా లాఠీలతో కొట్టి, విచక్షణారహితంగా ప్రవర్తించిన తీరు బాధకలిగిస్తోందన్నారు. న్యాయమైన కోర్కెల సాధన కోసం పోరాటం చేస్తున్న వారిపట్ల ప్రభుత్వం నిస్సిగ్గుగా వ్యవహరించటం మంచి సంప్రదాయం కాదని హితవు చెప్పారు.
లండన్ మ్యూజియంలోని
కళాఖండాల్ని తెప్పించండి: గల్లా
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, డిసెంబర్ 18: లండన్ మ్యూజియంలోని అమరావతి కళాఖండాలను ఆంధ్రప్రదేశ్ రాజధానికి తీసుకొచ్చేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ శుక్రవారం పార్లమెంట్ జీరో అవర్‌లో కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రాజధాని అమరావతికి శంకుస్థాపన చేశారని చెపుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణానికి కృషి చేస్తున్న దృష్ట్యా కళాఖండాలను అమరావతిలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. చారిత్రక నేపథ్యం కలిగిన అమరావతిని శాతవాహనులు 2, 3 శతాబ్దాల కాలంలో పరిపాలించారన్నారు. 2వ శతాబ్దంలో కృష్ణా, గోదావరి నదుల మధ్య ప్రదేశం బౌద్ధులకు చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రాంతమన్నారు. 2006లో అమరావతి కేంద్రంగా కాలచక్రను బౌద్ధమత గురువు దలైలామా నిర్వహించారన్నారు. బ్రిటీష్ పాలనలో ప్రథమ సర్వేయర్ జనరల్ మెకంజీ 1880లో 70 కళాఖండాలను ఓడ ద్వారా లండన్‌కు తరలించినట్లు వెల్లడించారు. 2వ శతాబ్దంలో బౌద్ధుల జీవిత విశేషాలను తెలియజేసే కళాసంపదను కేంద్ర ప్రభుత్వం మరలా వెనక్కి తీసుకురావాల్సిందిగా గల్లా జయదేవ్ విజ్ఞప్తి చేశారు.
భూ దోపిడీపై శే్వతపత్రం విడుదల చేయాలి: కారత్
ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు, డిసెంబర్ 18: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం భూ దోపిడీకి పాల్పడుతోందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కారత్ ఆరోపించారు. కర్నూలులో శుక్రవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ అవసరానికి మించి భూమిని సేకరించిన ప్రభుత్వం రైతుల వెన్నువిరిచేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అమరావతి నగర నిర్మాణంతో పాటు పరిశ్రమలు, అభివృద్ధి పేరుతో సుమారు 15 లక్షల ఎకరాల భూమిని ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా సేకరించిందని ఆరోపించారు. భూ దోపిడీపై ప్రభుత్వం వాస్తవాలతో కూడిన శే్వతపత్రం విడుదల చేస్తే ప్రజలకు వివరాలు తెలుస్తాయన్నారు. భూమికీ అరకొర నష్టపరిహారం ఇవ్వడం సమంజసం కాదని కారత్ అభిప్రాయపడ్డారు. మార్కెట్ విలువకు నాలుగు రెట్లు అధికంగా రైతులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సేకరించిన భూమిలో సైతం పెద్ద కుంభకోణం ఉందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ భూములకు భూ స్వాములు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల పేరుతో రికార్డులు సృష్టించి తమది కాని భూమికి కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టారని మండిపడ్డారు. దీనిపై న్యాయవిచారణకు ప్రభుత్వం ఆదేశించాలని డిమాండ్ చేశారు. లేదంటే తామే కోర్టులను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల వాస్తవ వివరాల కంటే తక్కువగా చూపించారని కారత్ తెలిపారు.

ఆంధ్రా విలీన మండలాల్లో
తెలంగాణ అధికారుల పెత్తనం
విఆర్ పురం, డిసెంబర్ 18: విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన ఖమ్మం జిల్లా మండలాల్లో దేవాదాయ శాఖ వ్యవహారాలు ఇంకా తెలంగాణ ఆధ్వర్యంలోనే సాగుతున్నాయి. విఆర్ పురం, కూనవరం, నెల్లిపాక, చింతూరు మండలాలను తూర్పుగోదావరి జిల్లాలో, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలను పశ్చిమ గోదావరి జిల్లాలో విలీనం చేసి ఏడాదిన్నర అయినా దేవాదాయ శాఖ మాత్రం నేటికీ ఆంధ్రప్రదేశ్‌లో విలీనం కాలేదు. ఏడాదిన్నర కావస్తున్నా ఇంకా ఈ మండలాల్లోని దేవాలయాల వద్ద తెలంగాణ ఆధికారుల పెత్తనమే కొనసాగుతోంది. శ్రీరామగిరి గ్రామం వద్ద నున్న శ్రీ సుందర సీతారామ చంద్రస్వామి ఆలయం, వడ్డిగూడెం గ్రామం సతీ పార్వతీ రుద్రకోటేశ్వరస్వామి అలయం, కూనవరం మండలంలో సుబ్రమణ్యేశ్వరస్వామి దేవాలయం, నెల్లిపాక మండలంలో శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయాల నిర్వహణా బాధ్యతలను నేటికీ తెలంగాణ ప్రభుత్వం చూస్తోంది. ఈ పురాతన ఆలయాలకు అప్పట్లో పూర్వీకులు కొంత పొలాలను సమకూర్చి వాటి కవుళ్లతో ఆలయాల వద్ద పూజలు, పండుగలు, జాతరలు నిర్వహించేవారు. కాలక్రమేణా ఈ ఆలయాల భూములను అప్పటి ఉమ్మడి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, వీటి నిర్వహణా బాధ్యతలు చేపట్టింది. అనంతరం ఈ భూములు పోలవరం ప్రాజెక్టు ముంపులోకి వెళ్లడంతో పరిహారం కింద లక్షల రూపాయలు రావటంతో వాటిని ఆ ఆలయాల పేరున బాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. ఆలయాల వద్ద కార్యక్రమాలను నిర్వహించటానికి అప్పట్లో కమిటీలు నియమించేవారు. గత కొద్ది సంవత్సరాలుగా ఆలయాలకు శాశ్వత కమిటీలను కూడా నియమించకపోవడం విశేషం. ప్రస్తుతం పండుగలు, ఉత్సవాల నిర్వహణకు ముందు ఆలయాల వద్ద తాత్కాలిక ఉత్సవ కమిటీలు ఏర్పాటుచేసి, కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో దాదాపు 280 దేవాలయాలకు ప్రభుత్వం కమిటీలు ఏర్పాటుచేసింది. కానీ విలీన మండలాల దేవాలయాలు జిల్లా అధికారులకు స్వాధీన పరచకపోవటంతో, వీటికి రాష్ట్ర ప్రభుత్వం కమిటీలను నియమించలేదు.

ఎన్‌కౌంటర్‌లో
మావో దళపతి మృతి
చింతూరు, డిసెంబర్ 18: చత్తీస్‌గఢ్ రాష్ట్రం కొండాగావ్ జిల్లాలో పోలీసులు, మావోయిస్టుల మధ్య శుక్రవారం జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు కమాండర్ రణధీర్ మృతి చెందాడు. డిస్ట్రిక్టు రిజర్వుడు గ్రూపు(డిఆర్‌జి) బలగాలు దానూర్ పోలీసుస్టేషను పరిధిలో కూంబింగ్ చేపడుతుండగా కేజం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తారసపడడంతో ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో బైనార్ ఏరియా మావోయిస్టు కమాండర్ రణధీర్ మృతి చెందినట్టు బస్తర్ ఐజి కల్లూరి తెలిపారు. రక్తం మరకలను బట్టి మరికొందరు మావోయిస్టులు గాయపడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

రూ.2కోట్ల ఎర్రచందనం పట్టివేత

కడప, డిసెంబర్ 18: రాష్ట్రప్రభుత్వం ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ప్రత్యేక పోలీసు బలగాలు, టాస్క్ఫోర్స్ ఏర్పాటుచేసినా శేషాచలం అడవుల్లో తమిళ ఎర్రకూలీలు చొరబాటును మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. కడపజిల్లాలో శుక్రవారం మూడు వేర్వేరు ప్రాంతాల్లో 163 దుంగలను, సిమెంట్ యాస్ రవాణాచేసే ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.2కోట్లు పైనే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రైల్వేకోడూరు సమీపంలోని బాలుపల్లె మాధవరంపోడు వద్ద రవాణా సిద్దంగా డంప్‌లో 90 దుంగలు, ఆ సమీపంలోని ఎస్.కొత్తపల్లె వద్ద 8దుంగలు, సిమెంట్ యాస్‌ను రవాణా చేసే ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకొని సిద్దవటం భాకరాపేటలో 64 దుంగలను పోలీసు, అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కూంబింగ్ నిర్వహిస్తున్నా శుక్రవారం పట్టుబడ్డ దుంగలతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. వీటి విలువ రూ.2కోట్ల పైబడే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఎర్రచందనం కూలీలు శేషాచలం అడవుల్లోకి 100మంది పైబడి ప్రవేశించగా, ఆయిల్ ట్యాంకర్‌లో 90 దుంగలను చెన్నైకు తరలిస్తుండగా అటవీశాఖ , పోలీసుశాఖ సంయుక్తంగా దాడులు చేసి బాలుపల్లె అటవీచెక్ పోస్టు వద్ద పట్టుకున్నారు. అలాగే చెన్నై మార్గంలోని భాకరాపేట వద్ద తరలించేందుకు 64 దుంగలను సిద్దం చేయగా వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రకూలీలు ఎప్పుడు శేషాచలం అటవీప్రాంతాలకు ప్రవేశించారో ఎవరికీ అంతుపట్టడం లేదు. ఇటీవల శేషాచలం అడవుల్లో పోలీసులు, అటవీశాఖ అధికారులు, సిబ్బంది ఏకంగా టాస్క్ఫోర్స్ డిఐజి ఎం.కాంతారావు నేతృత్వంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఎర్రకూలీలు, స్మగ్లర్లు పోలీసుల, అటవీశాఖ అధికారులు, సిబ్బంది దృష్టి మళ్లించేందుకు కూలీలు నల్లమల అడవుల్లోకి పారిపోయి అక్కడ స్థానికంగా పోలీసులు, అటవీశాఖ సిబ్బంది కూంబింగ్ చేస్తున్న నేపథ్యంలో.. రెండురోజుల క్రితం మళ్లీ శేషాచలం అడవుల్లో దుంగలు నరికి రవాణాకు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

హిందూ ధర్మంపై డిప్లొమా కోర్సు
తిరుపతి, డిసెంబర్ 18: శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో హిందూ ధర్మ పిజి డిప్లొమా కోర్సులను ప్రవేశ పెడుతున్నట్లు వర్శిటీ విసి దేవనాధన్, రిజిస్ట్రార్ కృష్ణమూర్తి తెలిపారు. భారతీయ సంస్కృతికి ఆధారమైన విషయాలను సరళంగా ఈ కోర్సులో పాఠ్యాంశాలను రూపొందించామన్నారు. ఈ కోర్సులను ఆన్‌లైన్ కోర్సులుగా ప్రవేశ పెట్టామన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులకు ఉచిత వేద విద్యను నేర్పించనున్నామన్నారు. అయితే కనీస విద్యార్హత ఇంటర్మీడియట్ ఉండాలని స్పష్టం చేశారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకోవడానికి ఈ నెల 31వ తారీఖు వరకు గడవు ఉందని తెలిపారు.

బాక్సైట్ ఉద్యమానికి
స్వరూపానందేంద్ర మద్దతు

ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, డిసెంబర్ 18: విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. విశాఖ ఏజెన్సీలోని ముంచింగిపుట్, పెదబయలు మండలాల్లో స్వరూపానందేంద్ర శుక్రవారం పర్యటించి, అక్కడి గిరిజనులకు దుప్పట్లు, దుస్తులు పంపిణీ చేసి, వారితో మాట్లాడారు. పురాణ పురుషులైన రాముడు, హనుమంతుడు వంటి వారు సంచరించిన ప్రదేశాలు ఈ అటవీ ప్రాంతాలు అని అన్నారు.
ఆంజనేయుడు కూడా ఒక గిరిజనుడేనని స్వామి గిరిజనులకు గుర్తు చేశారు. వీటిని ధ్వంసం చేయాలన్న ప్రభుత్వ ఆలోచన సరికాదని అన్నారు. ఆదివాసీల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని గిరిజన సందపదను కొల్లగొట్టాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. ఇదంతా కేవలం రాజకీయ స్వార్థం కోసమే చేస్తున్నారని అన్నారు. ప్రతి ఆదివాసి బాక్సైట్‌కు వ్యతిరేకంగా పోరాడాలని స్వరూపానందేంద్ర పిలుపునిచ్చారు. ఏజెన్సీ ప్రాంతంలో మత మార్పిడులు విస్తృతంగా జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.