రాష్ట్రీయం

దండలు వేసేందుకు పోటాపోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 18: అసెంబ్లీ ఆవరణలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసే విషయంలో టిడిపి-వైకాపా ఎమ్మెల్యేలు పోటీ పడ్డారు. శుక్రవారం అసెంబ్లీలో అంబేద్కర్ 125 జయంతి ఉత్సవాలపై చర్చ జరిగింది.
కాల్‌మనీ వ్యవహారంపై చర్చ జరపాలని వైకాపా ఎమ్మెల్యేలు పట్టుబట్టడంతో, అంబేద్కర్‌పై చర్చ జరగకుండా అడ్డుపడుతున్నారని స్పీకర్ వారిని చర్చ ముగిసేంత వరకు సస్పెండ్ చేశారు. ఇలాఉండగా ప్రతిపక్ష నేత జగన్ వైకాపా ఎమ్మెల్యేలను వెంట తీసుకుని అసెంబ్లీ వెలుపల కొంత సేపు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడు తూ అంబేద్కర్‌పై చర్చిస్తున్న ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహాన్ని కడిగించి, పూలదండ కూడా వేయలేదని విమర్శించారు. ఆ తర్వాత వైకాపా ఎమ్మెల్యేలు ఇరువురు అంబేద్కర్ విగ్రహం వద్దకు ఎతె్తైన ఇనుప గ్రిల్స్ ఎక్కి అటువైపు దిగి విగ్రహానికి పూల దండ వేశారు.
కాగా చర్చ ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్ళి నివాళి అర్పించారు.

అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేస్తున్న
వైకాపా అధినేత జగన్, పార్టీ ఎమ్మెల్యేలు