రాష్ట్రీయం

రోజాపై ఏడాది వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 18: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్‌కె రోజా అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెన్షన్‌కు గురయ్యారు. కాల్‌మనీ వ్యవహారంపై శుక్రవారం అసెంబ్లీలో టిడిపి-వైకాపా ఎమ్మెల్యేల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగింది. ఒక దశలో రోజా ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానం వరకూ వెళ్ళి ‘కాల్ మనీ, కాల్ చంద్రబాబు, కామ చంద్రబాబు..’ అని వ్యాఖ్యానించారు. దీనిపై చంద్రబాబు మండిపడ్డారు. ఈ దశలో టిడిపి ఎమ్మెల్యేలు దూళిపాళ్ళ నరేంద్ర, అనిత మాట్లాడుతూ రోజాపై చర్య తీసుకోవాలని కోరారు. ఈ మేరకు శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయాల్సిందిగా స్పీకర్‌ను కోరుతూ తీర్మానాన్ని ప్రతిపాదించగా, టిడిపి, బిజెపి ఎమ్మెల్యేలు ఆ తీర్మానాన్ని ఆమోదించారు. దీంతో స్పీకర్ కోడెల శివప్రసాద రావు రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేశారు. ఆమెను సభ నుంచి బయటకు వెళ్ళాల్సిందిగా స్పీకర్ సూచించినా ఆమె పట్టించుకోకుండా కూర్చున్నారు. ఆమె బయటకు వెళితే తప్ప తాను ప్రతిపక్ష నేత జగన్‌కు మాట్లాడేందుకు అనుమతి ఇవ్వనని స్పీకర్ ఖండితంగా చెప్పారు. బిజెపి ఎమ్మెల్యే రామకృష్ణంరాజు మాట్లాడుతూ ఉరి తీసే ముందు కూడా చివరి కోరిక అడుగుతారని, రోజాకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని సూచించారు. యనమల మాట్లాడుతూ ఉరితో పోల్చకూడదని, ఏడాది వరకు సస్పెన్షన్ మాత్రమేనని అన్నారు. రోజా సభ నుంచి వెళ్ళకపోతే కాల్‌మనీపై చర్చ ముగించినట్లుగా భావించాల్సి ఉంటుందని అన్నారు. దీంతో వైకాపా ఎమ్మెల్యేలు ఆమెకు నచ్చజెప్పి బయటకు పంపించారు. జగన్ మాట్లాడుతూ ఏడాది పాటు సభ నుంచి సస్పెండ్ చేయరాదని, ప్రివిల్లేజస్ కమిటీకి సిఫార్సు చేయకుండానే సస్పెండ్ చేశారని విమర్శించారు.
కంట తడి పెట్టిన రోజా
రోజా కంట తడి పెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనపై ప్రభుత్వం కక్ష కట్టిందని ఆవేదన చెందారు. ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే సభ నుంచి బయటకు పంపించారని విమర్శించారు.

అసెంబ్లీలో ప్రసంగిస్తున్న రోజా