రాష్ట్రీయం

అసెంబ్లీ ఎదుట కారు దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 18: నగరంలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో శుక్రవారం అసెంబ్లీ ముగిసిన కొద్ది సేపటికే అసెంబ్లీ ఎదుట ఉన్న కారులో మంటలు చెలరేగడం కలకలం రేపింది. కారు (ఎపి29సిబి0078)ఇంజన్‌లో ఏర్పడిన సమస్యవల్లే మంటలు చెలరేగాయన్న విషయం తెలుసుకొని పోలీసులు ఊపిరి పిల్చుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ఎమ్మెల్యే ముడియం శ్రీనివాస్‌రావువాహనం ఇంజన్‌లో చెలరేగిన మంటలు ఒక్కసారిగా ఎగిసిపడటంతో కారు పూర్తిగా దగ్ధమైంది. శుక్రవారం రాత్రి అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం ఇంటికి వెళ్లేందుకు వాహనంలో వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. కారు అలైంటింగ్ పాయింట్ నుండి నర్సరి దాటి వస్తుండగా ఒకేసారి కారులో మంటలు అంటుకున్నాయి. ఇది గమనించిన బందోబస్తులో ఉన్న పోలీసులు అప్రమత్తమై కారులో ఉన్న ఎమ్మెల్యే ముడియం శ్రీనివాస్‌రావుతో పాటు గన్‌మెన్, డ్రైవర్‌ను కిందికి దింపారు. దీంతో ఎమ్మెల్యేకు తృటిలో ప్రణాపాయం తప్పింది. షార్ట్‌సర్క్యూట్ కారణంగానే కారు ఇంజన్‌లో మంటలు అంటుకున్నాయని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనలో ఎవ్వరికి గాయాలు కాలేదని ఎమ్మెల్యేతో పాటు గన్‌మెన్, డ్రైవర్ సురాక్షితంగా బయట పడ్డారని సైఫాబాద్ పోలీసు ఇన్‌స్పెక్టర్ కె.పూర్ణచందర్ తెలిపారు.

అసెంబ్లీ ఎదుట మంటలు వ్యాపించి తగలబడిన ఎమ్మెల్యే కారు