రాష్ట్రీయం

వేతనాల కోసం కదంతొక్కిన అంగన్‌వాడీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 18: రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ప్రకటించిన వేతనాల అమలుకు జీవో జారీచేయాలంటూ ‘చలో విజయవాడ’ పేరిట రాష్టవ్య్రాప్తంగా తరలివచ్చిన వేలాదిమంది అంగన్‌వాడీ టీచర్లు, కార్యకర్తలు ఎర్ర జెండాలు చేతబట్టి కదంతొక్కారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రదర్శనగా బయల్దేరిన కార్యకర్తలను తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ప్రారంభంలోనే నిలుపుదల చేసేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. లాఠీలు ఝుళిపించి దాదాపు వెయ్యి మందికి పైగా అదుపులోకి తీసుకుని ఎట్టకేలకు ప్రదర్శనను నిలువరించగలిగారు. తోట్లవల్లూరు, పెనమలూరు, కృష్ణలంక, తదితర పోలీస్టేషన్లలో దాదాపు 100 మందికి పైగా కార్యకర్తలను పోలీసులు నిర్బంధించారు. రాత్రి 9 గంటల వరకు వారు పోలీసుల నిర్బంధంలోనే ఉన్నారు. వీరిలో 25 మందికి పైగా అంగన్‌వాడీ టీచర్లున్నారు. అర్ధరాత్రి సమయానికి వీరిని అరెస్ట్ చేస్తారని తెలుస్తోంది. అరెస్టయిన వారిలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు, నాయకులు సిహెచ్ బాబూరావు, జిల్లా కార్యదర్శి ఆర్ రఘు, నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్, సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ గఫూర్, ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి చలసాని వెంకట రామారావు, ఓబులేసు, నగర కార్యదర్శి ఆసుల రంగనాయకులు, మాజీ మంత్రి, వైకాపా తూర్పు కృష్ణా అధ్యక్షుడు కెపి సారథి, సిఐటియు, ఎఐటియుసి, వివిధ సంఘాల నాయకులు ఉన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎ రామకృష్ణ స్వల్పంగా గాయపడ్డారు. అంగన్‌వాడీ వర్కర్ల సంఘ నాయకులు పలువురు తీవ్ర గాయాలతో వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో లంకా సుబ్బమ్మ, బేబి అనే కార్యకర్తల పరిస్థితి విషమంగా వుంది. అంగన్‌వాడీ టీచర్లకు రూ.4200, హెల్పర్లకు రూ.2200 వేతనం చెల్లిస్తుండగా వేతనాల పెంపు కోసం దీర్ఘకాలంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏప్రిల్‌లో జరిగిన శాసనసభా సమావేశంలో వేతనాల పెంపునకు స్వయంగా హామీనిచ్చి మంత్రివర్గ ఉప సంఘాన్ని కూడా నియమించారు. టీచర్లకు నెలవారీ జీతాన్ని రూ.7100, హెల్పర్లకు 4,600 చెల్లించేందుకు మంత్రివర్గ ఉప సంఘం సూత్రప్రాయంగా అంగీకరించింది. దీనిపై జీవోలు జారీకావాలంటూ ఆందోళన చేస్తూ ఈ నెల 14వ తేదీ ‘చలో విజయవాడ’కు పిలుపునిచ్చారు. అయితే 16న జరిగే మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామన్న నేతల హామీతో తమ ఆందోళనను వాయిదా వేసుకున్నారు.

విజయవాడలో ఆందోళనకు దిగిన
అంగన్‌వాడీ కార్యకర్తలను బలవంతంగా
అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

తోపులాటలో స్పృహతప్పి
పడిపోయిన అంగన్‌వాడీ కార్యకర్త

వేతనాల పెంపు
ఏప్రిల్ 1 నుండి అమలు
ప్రభుత్వంపై 311.15 కోట్ల అదనపు భారం

హైదరాబాద్, డిసెంబర్ 19: అంగన్ వాడీ కార్యకర్తలకు, సహకార్యకర్తలకు, కార్మికులకు వేతనాలను పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు శుక్రవారం నాడు శాసనసభలో ప్రకటన చేశారు. అయితే పెంచిన వేతనాలను వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుండి అమలుచేస్తామని వెల్లడించారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు ప్రస్తుతం 4200 రూపాయిలు చెల్లిస్తుండగా, దానిని 7వేలకు పెంచుతామని, మినీ అంగన్‌వాడీ కార్యకర్తలకు 2950 రూపాయిల నుండి 4500 రూపాయిలకు పెంచుతామని, హెల్పర్లకు 2200 నుండి 4500 రూపాయిలకు పెంచుతామని చెప్పారు. దీనివల్ల 48770 మంది అంగన్‌వాడీ కార్యకర్తలకు, 6837 మంది మినీ కార్యకర్తలకు, 48770 మంది హెల్పర్లకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. ప్రస్తుతం అంగన్‌వాడీల వేతనాలకు 398.6 కోట్లు వెచ్చిస్తుండగా రానున్న రోజుల్లో బడ్జెట్‌పై 709.9 కోట్ల భారం పడుతుందని, అందులో రాష్ట్రప్రభుత్వం 540.85 కోట్లు, కేంద్రం 169.09 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఫలితంగా రాష్ట్రప్రభుత్వంపై 311.15 కోట్లు అదనపు భారం పడుతుందని సిఎం పేర్కొన్నారు. అంబేద్కర్‌పై శాసనసభ సుదీర్ఘచర్చ జరిపిన సందర్భంగా అంగన్‌వాడీ వేతనాల గురించి ప్రకటన చేసినట్టు చెప్పారు.