రాష్ట్రీయం

అమరావతిలో స్ఫూర్తిభవన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 18: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 10నుంచి 15 ఎకరాల విస్తీర్ణంలో అంబేద్కర్ స్ఫూర్త్భివన్ నిర్మించనున్నట్టు సిఎం చంద్రబాబు ప్రకటించారు. శుక్రవారం శాసనసభలో అంబేద్కర్ జయంత్యుత్సవాలపై జరిగిన చర్చకు బాబు బదులిచ్చారు. అంబేద్కర్ అందించిన సేవలను వివరిస్తూ అతి పెద్ద మ్యూజియం ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ప్రతి జిల్లాలో అంబేద్కర్ భవనాలు నిర్మిస్తామని, ఏడాది పొడవునా అంబేద్కర్ జయంతిపై ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది జరిగే అంబేద్కర్ 126వ జయంతి సందర్భంగా ప్రజలకు స్ఫూర్తిదాయక సందేశాన్ని ఇస్తామని, బడుగు, బలహీనవర్గాలకు అంబేద్కర్‌వల్లే న్యాయం జరిగిందని చెప్పారు. వచ్చేరోజుల్లో సమాజంలో ఆర్ధిక అసమానతలను తొలగించాలని భావిస్తున్నామని, అంబేద్కర్‌పై పాఠ్యగ్రంథాల్లో పాఠ్యాంశాలను చేరుస్తామన్నారు. అంబేద్కర్‌పై అవగాహన కలిగించడంతో ప్రజా చైతన్యం తెస్తామన్నారు. ఆనాడే అంబేద్కర్ భారతీయ సామాజిక వ్యవస్థకు గట్టి పునాది వేశారని, వివిధ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా రాజ్యాంగాన్ని రూపకల్పన చేశారన్నారు.
కార్మికుల పని గంటలను తగ్గించడంలోనూ, దామోదర్ వ్యాలీ, హీరాకుడ్ ప్రాజెక్టులను నిర్మించడంలో అంబేద్కర్ సేవలు అనన్యసామాన్యమన్నారు. దేశంలో సామాజిక ఆర్ధిక జీవన సమానత్వాన్ని సాధించాల్సి ఉంటుందని చెప్పారు.
అంబేద్కర్ ఘనతను పలువురు ఎమ్మెల్యేలు కొనియాడారు. ఎన్నో సంక్షోభాల నుంచి అంబేద్కర్ విజయాలను అందుకున్నారని అన్నారు. అంబేద్కర్‌ను ఒక వర్గానికే పరిమితం చేయడం సబబుకాదని, భారతీయులందరికీ సేవలు అందించిన మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు. ఓసీల్లోనూ పేదలున్నారని, వారందరికీ కొంత నిధి ఏర్పాటు చేయాలని కోరారు. నియోజకవర్గానికి నాలుగు లక్షలిస్తే అంబేద్కర్ విగ్రహాల నిర్మాణం చేపట్టవచ్చని ఎమ్మెల్యేలు సూచించారు. విపక్ష నేతకు అంబేద్కర్ గురించి తెలియకనే సభ నుంచి వెళ్లిపోయారని పలువురు వ్యాఖ్యానించారు.