రాష్ట్రీయం

సెక్స్ రాకెట్‌తో సిఎంకు సంబంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 18: విజయవాడలో వెలుగుచూసిన కాల్‌మనీ, దానివెనుకవున్న సెక్స్ రాకెట్‌తో ముఖ్యమంత్రి, తెదేపా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు సంబంధం ఉందని శాసనసభలో ప్రతిపక్ష నేత జగన్ ఆరోపించారు. రెండోరోజైన శుక్రవారం కాల్‌మనీ వ్యవహారం అసెంబ్లీని కుదిపేసింది. కాల్‌మనీపై స్పీకర్ కోడెల చర్చ ప్రారంభిస్తూ ప్రతిపక్ష నేత జగన్‌కు అవకాశం ఇచ్చారు. నేరుగా కాల్‌మనీ నిందితుల గురించి పత్రికల్లో వచ్చిన కథనాలు, విదేశాల్లో ఎమ్మెల్యే బోడే ప్రసాద్, అతని స్నేహితుడు వెనిగళ్ల శ్రీకాంత్ కలిసి ఉన్న ఫోటోలను సభకు జగన్ చూపించారు. ఇంత సాక్ష్యంవున్నా కనీసం బోడే ప్రసాద్‌ను అరెస్టు చేయలేదని, శ్రీకాంత్ గురించి ఆచూకీ చెప్పకున్నా పోలీసులు ఎమ్మెల్యేను ప్రశ్నించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ వ్యాఖ్యలపై పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాదరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్తే కాల్‌మనీ వ్యవహారంతో సంబంధం ఉందని ప్రచారం చేయడం దారుణమన్నారు. భార్యతో నేనుంటే ఎవరో ఆడవాళ్లతో ఉన్నట్టు ఫోటోలను మార్ఫింగ్ చేసి చూపించారన్నారు. ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి, మంగలి కృష్ణ, గాలి జనార్థన్‌రెడ్డి వంటి ఆర్థిక నేరగాళ్లతో సంబంధమున్న జగన్‌ను ఏమనాలని ప్రశ్నించారు. జగన్ స్పందిస్తూ చంద్రబాబు దీవెనలతోనే కాల్‌మనీ, సెక్స్‌రాకెట్ వ్యవహారం జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయని, వాటిని పట్టించుకోకుండా ప్రతిపక్షంపై దాడి చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని ఆధారాలుంటే చూపించాలి కానీ, కేసుకు సంబంధించిన సమాచారం ఉందని చెప్పి ఇవ్వకుంటే నిందితుడవుతావని, మరో కేసు నీపైనా పెట్టాల్సి వస్తుందని చురక వేశారు. ఎమ్మార్వో వనజాక్షి కేసులో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను శిక్షించలేదని, కనీసం విచారించలేదని జగన్ చర్చలో ప్రస్తావించడంతో సభలోనే ఉన్న చింతమనేని ఒక్కసారిగా జగన్‌పై విరుచుకుపడ్డారు. ఎమ్మార్వోకు, డ్వాక్రా మహిళకు జరిగిన గొడవలో నేను జోక్యం చేసుకుంటే దాన్ని తాను దాడి చేసినట్టు నీ పత్రిక, చానల్ ప్రచారం చేసిందని ఆగ్రహించారు. నీది, నీ తండ్రిది, తాత చరిత్ర ఏమిటో మాకు తెలుసుని వ్యాఖ్యనించారు. దీంతో తెదేపా, వైకాపా సభ్యుల మధ్య వాగ్వాదాం చోటుచేసుకుంది. అనంతరం సిఎం చంద్రబాబు మాట్లాడుతూ ఏదైనా సాక్ష్యం, సమాచారం ఉంటే ఇవ్వండి తప్ప సమస్యను పక్కదారి పట్టించేలా మాట్లాడవద్దని సూచించారు. సరైన సమాచారం లేకుండా మీ పత్రికలు, టీవీల్లో కథనాలు వేస్తున్నారని, ఇది పద్ధతి కాదన్నారు. అందుకే మీ పత్రికవద్ద ఆధారాలు ఏమైనా ఉంటే ఇవ్వండి. విచారణ చేస్తామని చెప్పారు. మీ పత్రికే కాదు, ఎవరు ఆధారాలు లేకుండా రాసినా మంచిది కాదన్నారు. వాస్తవాలు ఎంతైనా రాసేందుకు స్వేచ్ఛ ఉందని, అవాస్తవాలు రాస్తే సహించేది లేదన్నారు. ఇప్పటికే చాలా సమయం అయ్యిందని, చర్చను ఇంతటితో ముగిస్తే మంచిదని సభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. జగన్ తిరిగి మాట్లాడుతూ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి తప్ప రిటైర్డు జడ్జితో విచారణ చేయడం సరికాదన్నారు. అనంతరం సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ కోడెల ప్రకటించారు.