రాష్ట్రీయం

డార్క్‌నెట్.. ఉగ్ర సవాల్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 25: పోలీసులు, సైబర్ నిపుణుల కళ్లుగప్పి కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఉగ్రవాదులు తమ సమాచారాన్ని పరస్పరం మార్పిడి చేసుకుంటున్నారు. మొదటి నుంచి హైదరాబాద్ పరిసరాలు, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉగ్రవాద సానుభూతిపరులున్న ప్రాంతాలుగా ముద్రపడటంతో, వీరి కదలకలపై పోలీసులు నిఘా పెంచారు. సామాజిక మాధ్యమాలు, ఫేస్ బుక్ ద్వారా సమాచార మార్పిడికి పాల్పడితే దొరికిపోతున్నామనే అనుమానంతో ఉగ్రవాద సానుభూతిపరులు కొత్తగా డార్క్‌నెట్‌ను ఆశ్రయిస్తున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న సాంకేతికతకు అనుగుణంగా టెర్రరిస్టులు కూడా తమ పంథా మార్చుకుంటూ కొత్త అంతర్జాలం వైపుదృష్టి సారిస్తున్నారు. ఉగ్రవాదులు ఎక్కడ, ఎప్పుడు, ఎలాంటి దాడులు నిర్వహించాలో క్షణాల్లో సమాచారాన్ని అందిపుచ్చుకునేందుకు వీలుగా డార్క్‌నెట్‌ను వినియోగిస్తున్నట్టు సమాచారం. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రపంచంలోని అగ్ర దేశాలపై దాడులకు పూనుకోవడం, ప్రపంచవ్యాప్తంగా సిరియా కేంద్రంగా ఐఎస్ రిక్రూట్‌మెంట్ జరుపుకోవడం, ఉగ్రవాద భావాజాలాన్ని ప్రేరేపిస్తూ యువతను ఆకర్షించడం వంటి అంశాలను ఇంటర్నేషనల్ ఇనె్వస్టిగేషన్ విభాగం కనిపెట్టింది. ఐఎస్ సానుభూతిపరులు అరెస్టైన సందర్భంగా జరుపుతున్న ఇంటారాగేషన్‌లో బయటపడుతున్న నిజాలతో ఐఎస్‌ఏ అధికారులు అప్రమత్తమై ఫేస్‌బుక్ ఖాతాలు, సర్వీసు ప్రొవైడర్ల ద్వారా ఉగ్రవాదుల స్థావరాలు, సానుభూతిపరుల వివరాలను కనుగొంటున్న నేపథ్యంలో ఐఎస్ కొత్త అంతర్జాలం ‘డార్క్‌నెట్’ను వినియోగిస్తోంది. ఇదే దేశంలోని నిఘా విభాగానికి, అంతర్జాతీయ భద్రతా ఏజెన్సీ, ఇంటెలిజెన్స్ బ్యూరోలకు తలనొప్పిగా పరిణమిస్తోంది. ఉగ్రవాదుల వివరాలు సేకరించాలన్నా, సానుభూతిపరులను కనిపెట్టాలన్నా, అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్న భద్రతాదళాలకు ఉగ్రవాదుల డార్క్‌నెట్ అంతర్జాలం అంతుచిక్కడం లేదు. ఇది నిఘా వర్గాలకు పెను సవాలుగా మారిందని సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు. డార్క్‌నెట్ సమాచారంపై కేవలం ఐదు శాతం సాంకేతికతను మాత్రమే కనుగొన్నట్టు తెలుస్తుందని ఇ2ల్యాబ్స్ అధికారులు నిఘా వర్గాలకు తెలిపినట్టు తెలిసింది. కన్సల్టింగ్ ఇనె్వస్టిగేటింగ్ అకాడమి పలు ఇంటెలిజెన్స్ అధికారులకు శిక్షణ కూడా ఇచ్చినట్టు ఇనె్వస్టిగేషన్ బ్యూరో అధికారి ఒకరు తెలిపారు. ఇదిలావుంటే, గత సెప్టెంబర్‌లో పోలీసులు అరెస్టు చేసిన ఐఎస్ సానుభూతిపరురాలు నిక్కీజోసెఫ్ అలియాస్ అఫ్షాజుబేన్‌ను విచారించగా భారత్‌లో 50మంది సానుభూతిపరులున్నారని పేర్కొనడం నిఘావర్గాల్లో కలకలం సృష్టించింది. అయితే వారిని గుర్తించి పట్టుకోవడానికి నిఘావర్గాలు చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టేందుకు కూడా ఐఎస్ సానుభూతిపరులు డార్క్‌నెట్ ద్వారా తమ కార్యకలాపాలు నెరపడంతో ఐబీకి అంతుచిక్కడం లేదని ఓ సిఐడి అధికారి పేర్కొన్నారు. ఏదేమైనప్పటికీ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు కొత్త అంతర్జాలం డార్క్‌నెట్ వినియోగంపై ఇనె్వస్టిగేషన్ బ్యూరో దృష్టి సారించింది. ఆ దిశగా ఉగ్రదాడులను ఎదుర్కొనేందుకు, ఉగ్రవాదులు వినియోగిస్తున్న డార్క్‌నెట్ అంతర్జాలంపై నిఘావర్గాలు కొత్త వ్యూహం రచిస్తున్నట్టు సమాచారం.