జాతీయ వార్తలు

మా అమ్మాయి పేరు జ్యోతి సింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: నిర్భయ గ్యాంగ్ రేప్ జరిగి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం ఆమె తల్లి తన కుమార్తె పేరును తొలిసారిగా వెల్లడించడమే కాకుండా ఆమె పేరు చెప్పడానికి తానేమీ సిగ్గుపడడం లేదని కూడా స్పష్టం చేసింది. ‘నా కుమార్తె పేరు జ్యోతి సింగ్’ అని బుధవారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ప్రకటించిన బాధితురాలి తల్లి అత్యాచారాలు లాంటి అమానుష చర్యలకు పాల్పడినవారే సిగ్గుపడాలి తప్ప బాధితులు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ కాదని కూడా స్పష్టం చేసింది. అంతేకాదు బాధితురాలి పేరును దాచిపెట్టడం వల్ల ప్రయోజనం ఏమిటో తనకు అర్థం కావడం లేదని కూడా ఆమె చెప్పింది.
సరిగ్గా మూడేళ్ల క్రితం ఇదే రోజున ఢిల్లీలో నడుస్తున్న బస్సులో 23 ఏళ్ల యువతిపై ఆరుగురు దాడి చేసి అత్యాచారం జరిపిన తర్వాత ఆమెను బస్సులోంచి రోడ్డుపైకి తోసేసిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన ఆ యువతి సింగపూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందతూ ఆ తర్వాత మృతి చెందింది. కాగా, మృతి చెందిన తమ కుమార్తెకు ఇప్పటికీ న్యాయం జరగలేదని మృతురాలి తండ్రి మంగళవారం అన్నారు. ఈ దారుణానికి పాల్పడిన ఆరుగురిలో ఒకరు తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకోగా, మరో నలుగురికి కోర్టు మరణ శిక్ష విధించింది. బాలనేరస్థుడైన మరొకరికి ఆ చట్టం కింద గరిష్ఠంగా విధించే మూడేళ్ల శిక్ష విధించగా, ఈ నెల 20న అతను శిక్ష పూర్తి చేసుకుని విడుదల అవుతున్నాడు. అయితే ఇప్పుడు యువకుడైన అతను సమాజానికే ప్రమాదకరమని, అందువల్ల అతడ్ని విడుదల చేయకూడదని కూడా బాధితురాలి తండ్రి కోరారు.

మోదీని రమ్మని
ఎప్పుడైనా పిలిచారా?
ఆంధ్రభూమి బ్యూరో
న్యూఢిల్లీ, డిసెంబర్ 16: తెలంగాణలో పర్యటించడానికి, పథకాలు కేటాయించటంలో ప్రధాని మోదీ సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారని తెరాస నేతలు చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదని తెలంగాణ బిజెపి నేతలు ఖండించారు. రాష్ట్రంలో నిర్వహించిన ఏ కార్యక్రమానికైనా ప్రధానిని ఆహ్వానించారా, ఆహ్వానించినట్లు ఒక లేఖనైనా చూపించగలరా? అంటూ పార్టీ మాజీ అధ్యక్షుడు ఎన్ ఇంద్రసేనారెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ అడిగిన ఇళ్లను కేటాయించినట్టు కేంద్ర అధికారులు తనకు చెప్పారని ఆయన వివరించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకూ ఒక్క ఆహ్వానం కూడా మోదీకి అందలేదని సంబంధిత అధికారులు స్పష్టం చేసినట్టు ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించవలసిందిగా తానే స్వయంగా కెసిఆర్ కుటుంబ సభ్యులకు సూచించానన్నారు. కెసిఆర్ కుమారుడు కెటిఆర్ అహంభావి అని నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు.