జాతీయ వార్తలు

కరవుపై చర్యలేవీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: దేశంలో కరవుపీడిత ప్రాంతాల్లో తీసుకున్న చర్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్రం, ఎనిమిది రాష్ట్రాలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ ఎస్‌ఏ బాబ్డేతో కూడిన ధర్మాసనం సుప్రీంలో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారించింది. కరవు ప్రాంతాల్లో రైతులకు సకాలంలో పంటల బీమా పథకం అమలు, రాయితీలు కల్పించాలంటూ స్వరాజ్ అభియాన్ సంస్థ న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. పిటిషన్ విచారించిన ధర్మాసనం కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ, యూపీ, మధ్యప్రదేశ్, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. వచ్చే పంటకు సబ్సిడీపై ఇన్‌పుట్స్, పశువులకు దాణా సరఫరా చేయాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. జాతీయ ఆహార భద్రత పథకం కింద బాధిత రైతులను ఆదుకోవాలని స్వరాజ్ అభియాన్ కోరింది. ప్రజలు కరవుతో అల్లాడుతుంటే సంబంధిత రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయని, తమ బాధ్యతలను పూర్తిగా విస్మరిస్తున్నాయని పిటిషనర్ తరఫున కోర్టుకు హాజరైన ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆరోపించారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కరవు ప్రాంతాల్లోని కుటుంబాల్లో ఒక్కొక్కరికి నెలకు ఐదు కిలోల ఆహార ధాన్యాలను అందజేయాల్సి ఉంటుందన్నారు. దురదృష్టవశాత్తు అనేక రాష్ట్రాలు పథకాన్ని అమలు చేయడమేలేదని పిటిషనర్ తెలిపారు. బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు తప్ప మిగతాచోట్ల ఆహార భద్రతా పథకం ఊసేలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. అనేక రాష్ట్రాల్లో ఏపిఎల్/బిపిఎల్ విధానం నిరుపయోగంగా తయారైందని నిపుణులు అధ్యయనంలో తేలిందన్నారు.