రాష్ట్రీయం

మొక్కవోని దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 25: జలసంపద, పచ్చదనం, అభివృద్ధి మేళవించిన సుందర రాజధాని నగరంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు ప్రజలంతా మమేకం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. అలాగే హరితాంధ్ర ప్రదేశ్ లక్ష్య సాధనలోనూ ప్రతిఒక్కరూ పాలుపంచుకోవాలన్నారు. తుళ్లూరు మండలం అనంతవరం వేదికగా వనమహోత్సవాన్ని బుధవారం ప్రారంభించిన అనంతరం మాట్లాడిన చంద్రబాబు కృష్ణానది పరివాహక ప్రాంతంలోని రాజధానిలో ఎల్లప్పుడూ నీటి నిల్వలు 6 నుంచి 7 మీటర్ల లోపు ఉండే విధంగా వాటర్ మేనేజమెంట్‌ను అమలు చేస్తామన్నారు. అలాగే రాజధాని పరిధిలోని 18 ప్రాంతాల్లో కోటి మొక్కలు పెంచేందుకు నర్సరీలు ఏర్పాటు చేస్తామని, కృష్ణా నదిలో వాటర్ కార్స్ నడుపుతామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొక్కల పెంపకానికి 350 కోట్లు కేటాయించామని, అవసరమైతే మరిన్ని నిధులు అందించేందుకూ సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రస్తుతం 23 శాతమే ఉన్న అడవులను 50 శాతం వరకు పెంచటానికి కృషి చేస్తామన్నారు. అతివృష్టి, అనావృష్టికి కారణం పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేయటమేనన్నారు. రాష్ట్రంలో 974 కిలోమీటర్ల పొడవునా తీరప్రాంతం ఉన్నందున తుపాన్‌లు వచ్చే అవకాశం అధికంగా ఉందన్నారు. సముద్ర తీరప్రాంతంలో మడ అడవుల అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో 5 కోట్ల జనాభాలో ప్రతి ఒక్కరూ 10 మొక్కలు చొప్పున 50 కోట్ల మొక్కలు నాటాలన్నారు. ఇక నుంచి ప్రతి సంవత్సరం జూలై 1 నుంచి మొక్కలు పెంపకం కార్యక్రమాన్ని ప్రారంభించి కార్తీక మాసంలో పూర్తి చేస్తామన్నారు. ప్రతి పాఠశాల విద్యార్థి గ్రీన్ కాప్స్‌లో సభ్యునిగా చేరి మొక్కలు పెంచాలన్నారు. రాష్ట్రంలోని 15,000 పాఠశాలల్లో 10.19 లక్షల మంది విద్యార్థులు సభ్యులుగా ఉన్నారన్నారు. వారంతా వనమహోత్సవంలో పాల్గొని 15 లక్షల మొక్కలు నాటుతున్నారన్నారు. మొక్కల పెంపకాన్ని బాల్యం నుంచే నేర్పాలనే ఉద్దేశ్యంతో ప్రతి హైస్కూల్‌లో నర్సరీ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు.ప్రకృతి, మనుషులు వేర్వేరు కాదనే విషయాన్ని గుర్తించి మొక్కల పెంపకానికి అందరూ కృషి చేయాలన్నారు. మొక్కలకు నీళ్లు పోసే కార్యక్రమాన్ని డ్వాక్రా సంఘాలకు అప్పగిస్తామన్నారు. ఒకప్పుడు రాజధాని నిర్మాణం ఒక కల అని పేర్కొన్న చంద్రబాబు ఇప్పుడది నిజమైందన్నారు. 2022 నాటికి భారతదేశంలో మూడవ రాష్ట్రంగా, 2029కి మొదటిదిగా, 2050కి ప్రపంచంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు.
అక్కడ చెట్లు నరికితే మహానేరం
మనిషిని చంపితే ఎంత నేరమో సింగపూర్‌లో చెట్లు నరికినా అంతే నేరమని చంద్రబాబు తెలిపారు. చెట్లు నరకాలంటే అక్కడ ప్రభుత్వ అనుమతి తీసుకొవాల్సిందేనన్నారు. చెట్లు నరికితే భవిష్యత్ అంధకారమవుతుందన్న దూరదృష్టితోనే సింగపూర్ ప్రభుత్వం ఇంత కఠినమైన విధానాన్ని అవలంబిస్తోందని తెలిపారు. మొక్కల పెంపకంపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరిగితే భవిష్యత్ తరాలకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రులు గోపాలకృష్ణారెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, రాష్ట్ర అటవీశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అశ్వనీకుమార్ ఫరీదా తదితరులు పాల్గొన్నారు.
chitram...

వన మహోత్సవాన్ని ప్రారంభించి ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు