రాష్ట్రీయం

అప్లై చేస్తే చాలు.. రేషన్ కార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 15: ఆంధ్రప్రదేశ్‌లో 13 జిల్లాల్లో దరఖాస్తు చేసిన వారందరికీ తాత్కాలిక రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే చాలు వారికి తాత్కాలిక రేషన్ కార్డులను జారీ చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. దరఖాస్తులు అన్నీ పరిశీలన పేరుతో నెలల తరబడి ఫైళ్లలో గుట్టగా పెట్టేబదులు ఎప్పటికపుడు వాటిని పరిశీలించి తుది నిర్ణయాన్ని చెప్పాలని, అది సాధ్యం కానప్పుడు తాత్కాలిక కార్డులను జారీ చేసి తర్వాత పరిశీలన చేయాలని కూడా స్పష్టం చేసింది. క్రిస్మస్ దగ్గర పడినందున, ముందు తాత్కాలిక కార్డులు ఇచ్చి చంద్రన్న క్రిస్మస్ కానుక కింద తక్కువ ధరకే పప్పు, ఉప్పు, నూనెలతో నిత్యావసరాల వస్తువుల కిట్‌లను అందించాలని, అలాగే సంక్రాంతి సమయంలో సంక్రాంతి కానుకను అందించాలని కూడా ప్రభుత్వం పౌరసరఫరాల అధికారులను ఆదేశించింది. గత ఏడాది సంక్రాంతికి ప్రజా పంపిణీ కింద ఇచ్చిన ప్యాకేజ్‌నే ఈ ఏడాది కూడా అందించాలని సూచించారు. ఫిబ్రవరి 1వ తేదీ నాటికి తుది కసరత్తు పూర్తి చేసి శాశ్వత రేషన్‌కార్డులను అందించాలని కూడా నిర్ణయించింది.