ఆంధ్రప్రదేశ్‌

రాజధాని రైలు రద్దయంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 21: సింగల్ హాల్ట్‌తో విజయవాడ - హైదరాబాద్ మధ్య నడుస్తున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12795)కు ద్వితీయ విఘ్నం కలిగింది. రాజధాని ఉద్యోగుల తరలింపు కోసం రాష్ట్ర ప్రభుత్వ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా కేంద్రాన్ని ఒప్పించి తీసుకు వచ్చిన ఈ రైలు గత రాత్రి కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు, సిఎం చంద్రబాబు జెండా ఊపి లాంభనంగా ప్రారంభించారు. ముందుగా ప్రకటించిన విధంగా ఈ రైలు మంగళవారం నుంచి సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరాల్సి ఉంది. ఈ రైలు కోసం విజయవాడ స్టేషన్‌లో మంగళవారంనాడు వేలాది మంది ప్రయాణికులు ఎదురు చూసారు. అయితే ఈ ఒక్కరోజు రైలు సర్వీసు లేదన్న రైల్వే వర్గాల సమాచారంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. కాగా గత రాత్రి సికింద్రబాద్ వెళ్లిన రైలు బుధవారం ఉదయం 5.30కు బయలు దేరి 11 గంటలకు విజయవాడకు చేరుకుంటుందని రైల్వే వర్గాలు తెలిపాయి.