ఆంధ్రప్రదేశ్‌

మూడో పంటకూ నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూన్ 20: ఎన్ని ఇబ్బందులున్నా అన్నదాతల కళ్లలో వెలుగులు నింపడమే తమ ప్రభుత్వ ఆశయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇందులో భాగంగానే రైతులను రుణ విముక్తులను చేశామని, త్వరలో ఇ-క్రాప్ విధానం ప్రవేశపెడతామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం చిట్టవరం గ్రామంలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఏరువాక పౌర్ణమి’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. రాజమహేంద్రవరం వరకు ప్రత్యేక విమానంలో వచ్చిన ముఖ్యమంత్రి అక్కడి నుండి హెలికాప్టర్‌లో నరసాపురం చేరుకున్నారు. అక్కడి నుండి చిట్టవరం వరకు కారులో వచ్చిన ఆయన ఏరువాక కార్యక్రమం ఏర్పాటుచేసిన వ్యవసాయ క్షేత్రానికి ఎడ్ల బండిలో చేరుకున్నారు. తొలుత భూమాతకు పూజలు నిర్వహించారు. వ్యవసాయ క్షేత్రంలో నవధాన్యాలు చల్లారు. పూజాకార్యక్రమాలు పూర్తయ్యాక, పొలంలోకి దిగి ఎద్దులతో కూర్చిన నాగలిపట్టి దుక్కి దున్నారు. అనంతరం ఆధునిక వ్యవసాయ యంత్రంతో నాట్లు వేశారు. తర్వాత సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో నీటి భద్రత కల్పించి, వ్యవసాయానికి నీరందిస్తామని, ఆదాయం పెరిగే విధంగా పంటలు వేసుకోవాలని రైతాంగాన్ని కోరారు. రాష్టవ్య్రాప్తంగా సరాసరి వంద సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతోందని, ఇందులో ఒక సెంటీమీటరు ఉపయోగించుకోగలిగితే 57 టిఎంసిల నీరు అందుబాటులోకి వస్తుందన్నారు. ఇంత భారీస్థాయిలో లభించే వర్షపు నీరు వృథాగా సముద్రంలో కలిసిపోతోందన్నారు. రాష్ట్రానికి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్టును కేంద్ర సహకారంతో నిర్ణీత సమయంలో పూర్తిచేస్తామన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నీటి కొరత తీరిపోతుందన్నారు. గోదావరి జిల్లాల్లో గతంలో ఒకప్పుడు ఒకే పంట ఉండేదని, ఎన్టీఆర్ హయాంలో రెండవ పంటకు నీరిచ్చారని, భవిష్యత్తులో మూడు పంటలు పండించడానికి అన్నదాతలు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. రెండు పంటలు వరి సాగుచేసి, మూడో పంటగా అపరాలు సాగువేసుకోవాలని సూచించారు. అలాగే కొబ్బరిని కూడా అంతరపంటగా వేసుకోవచ్చునన్నారు.
ఇప్పుడు చేపల పెంపకం మంచి ఆదాయ వనరుగా మారిందన్నారు. రాష్ట్రంలో ఏటా ఆక్వా సాగుద్వారా రూ.30వేల కోట్లు ఆదాయం లభిస్తుంటే, ఒక్క పశ్చిమగోదావరి జిల్లా నుండి రూ.8వేల కోట్లు వస్తోందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ఫసల్ బీమా పథకం ద్వారా రైతులకు నూరుశాతం పరిహారం వస్తుందని, ఇందులో కేంద్రం వాటా 50 శాతం, రాష్ట్రం వాటా 50 శాతం ఉంటుందని, దీన్ని రైతాంగం ఉపయోగించుకోవాలన్నారు.
ఈ ఏడాది నుండి ఇ-కాప్ విధానాన్ని అమలు చేస్తామని, ఈ విధానంలో గ్రామాల్లో వ్యవసాయ విస్తరణాధికారులను ఎప్పటికప్పుడు సిఎం డాష్‌బోర్డుకి అనుసంధానం చేస్తారన్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటుచేసి, ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతులు జరిగేలా సహకరిస్తామన్నారు. రెండు, మూడు నెలల్లో ప్రతీ ఇంటికి ఇంటర్‌నెట్, 100 టెలివిజన్ ఛానల్స్, టెలిఫోన్ సౌకర్యం అతితక్కువ ధరకు అందిస్తామన్నారు. దీంతో ప్రతీ ఇంటికి వీడియో కాన్ఫ్‌రెన్స్ ద్వారా అనుసంధానం కావచ్చని, అవసరమైతే తానే సమాధానం కూడా చెబుతానన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పీతల సుజాత, పైడికొండల మాణిక్యాలరావు ఎంపిలు తోట సీతారామలక్ష్మి, గోకరాజు గంగరాజు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు పాల్గొన్నారు.

చిత్రం... నాగలితో దుక్కి దున్నుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు,
ఆధునిక యంత్రంతో వరి నాట్లు వేస్తున్న దృశ్యం