ఆంధ్రప్రదేశ్‌

మహిళల సంరక్షణ సామాజిక బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జూన్ 19: సమాజంలో మహిళల సంరక్షణను ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి సూచించారు. ప్రస్తుత సమాజంలో మహిళలతో పాటు పురుషులను కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. అనంతపురం నగరంలోని డిఆర్‌డిఎ అభ్యుదయ హాలులో ఆదివారం ‘మహిళా సాధికారత, బాలికా విద్య, బాలల హక్కులు, మీడియా పాత్ర’ అంశంపై రాయలసీమ స్థాయి ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన రాజకుమారి మాట్లాడుతూ మహిళలకు హక్కులు, రిజర్వేషన్లు కల్పించినప్పటికీ వాటిని సంపూర్ణంగా వినియోగించుకోవడం లేదన్నారు. మహిళలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్నారని, సామాజికంగా, ఆర్థికంగా ముందడుగు వేస్తున్నారన్నారు. మరోవైపు మహిళలపై మానభంగాలు, అకృత్యాలు, దౌర్జన్యాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఇలాంటి నేరాల్లో చట్టపరంగా నిందితులకు కఠిన శిక్షలు తప్పవన్నారు. గృహ హింస కేసుల్లో ఎక్కువగా మహిళలు తమ అత్త, ఆడపడుచులపై కేసులు పెడుతున్నారని, ఇలాంటివి 75 శాతం ఉంటున్నాయని, 25 శాతం మాత్రమే భర్తలపై కేసులు నమోదవుతున్నాయన్నారు. మహిళలకు మహిళలే శత్రువులని ఇలాంటి ఘటనలు రుజువు చేస్తున్నాయన్నారు. సెల్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు ద్వారా సోషల్ మీడియా ప్రభావంతో యువత తప్పుదోవ పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
యువతీ యువకులు జాగ్రత్తగా ఉండాలని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలన్నారు. బాలల హక్కులను కాలరాసే, మహిళల రవాణాకు కారణమయ్యే వారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. సదస్సులో నల్లాని రాజేశ్వరీ ఇన్సియేటివ్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నల్లాని రాజేశ్వరి, నగర మేయర్ మదమంచి స్వరూప, హెల్ప్ సంస్థ కార్యదర్శి ఎన్‌విఎస్ రామ్మోహన్‌రావు, ఐసిడిఎస్ పిడి జుబేదాబేగం తదితరులు పాల్గొన్నారు.

అనంతపురంలో నిర్వహించిన ‘మహిళా సాధికారత’ సదస్సులో మాట్లాడుతున్న
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి